Bigg boss 5 : బిగ్ బాస్ విన్నర్ అతడే.. ఈసారి కూడా అదే ఫార్మాట్.. విమర్శలు తప్పవేమో?

బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితుల కారణంగా ఎన్ని గొడవలు జరిగినా కూడా హౌస్ మెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వస్తే మాత్రం అందరూ కూడా చాలా ఫ్రెండ్లిగా మారిపోతుంటారు. కుటుంబ సభ్యులు రాగానే వివధాలు మర్చిపోయి చాలా సరదాగా గడుపుతుంటారు. బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ స్టేజ్ కు చేరుకుంటున్న సమయంలో కంటెస్టెంట్స్ అందరికి కూడా బిగ్ బాస్ ఎమోషనల్ గా ఒక టచ్ ఇచ్చాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులను సన్నిహితులను చూసి మరింత ఎమోషనల్ అయ్యారు. అయితే ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అనే విషయంలో ఎక్కువ ఫోకస్ ముగ్గురిపై పడుతోంది. నేటితో ఒకరి విషయంలో అయితే క్లారిటీ వస్తుంది. అయితే గత నాలుగు సీజన్స్ తరహాలోనే ఈసారి కూడా విన్నర్ విషయంలో పెద్దగా మార్పులు ఏమి ఉండకపోవచ్చని తెలుస్తోంది.

 రవి కోసం మాజీ విన్నర్

రవి కోసం మాజీ విన్నర్

84 ఎపిసోడ్ లో నాగార్జున హౌస్ మెంట్స్ కుటుంబ సభ్యులను పరిచయం చేసే ముందు కంటెస్టెంట్స్ ఎదో ఒకటి త్యాగం చేయాలని అన్నారు. దీంతో ఒక్కొక్కరు వారికి నచ్చిన దాన్ని త్యాగం చేయక తప్పలేదు. యాంకర్‌ రవి ఎంతో ఇష్టమైన పాప బొమ్మను త్యాగం చేయగా.. స్టేజ్ పైకి అతడి తల్లి ఉమాదేవి వచ్చింది. ఇక కుటుంబ సభ్యులు నీ కారణంగా గర్వంగా ఫీల్ అవుతున్నారని బిగ్ బాస్ రాజువు నువ్వే అంటూ పొగిడారు. ఇక బిగ్‌బాస్‌ తొలి సీజన్‌ విన్నర్‌ శివబాలాజీ కూడా స్పెషల్ గా ఎంట్రీ ఇచ్చి చెప్పాల్సింది చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోవాలని అన్నాడు. ఇక శివబాలాజీ, ఉమాదేవి ఇద్దరు కూడా.. రవి, సన్నీ, శ్రీరామ్‌, షణ్ముఖ్‌, మానస్‌లు టాప్‌ 5లో ఉంటారని వివరణ ఇచ్చారు.

పింకీ కోసం జబర్దస్త్ కమెడియన్స్

పింకీ కోసం జబర్దస్త్ కమెడియన్స్

ప్రియాంక పింకీ మేకప్‌ కిట్‌ త్యాగం చేయడంతో జబర్దస్త్ కమెడియన్స్ సాయి, అప్పారావు వచ్చారు. ఆమెను విన్నర్‌గా తేల్చుతూ సన్నీ, శ్రీరామ్‌, రవి, మానస్‌లను టాప్‌ 5లో ఉంటారని వారి వివరణ ఇచ్చారు. ఇక పింకి కొంత ఎమోషనల్ అవుతూ.. కన్నడ నుంచి తెలుగుకి తీసుకువచ్చి నాతో కామెడీ షో చేయించారు. ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం మీరె అని అప్పారావుకు పింకి కృతజ్ఞతలు తెలిపింది.

షన్నుకి దీప్తి సునయన ముద్దులు

షన్నుకి దీప్తి సునయన ముద్దులు

ఇక మరోవైపు సన్నీ స్పెషల్‌ గిఫ్ట్‌ను త్యాగం చేయగా నిఖిల్‌, వెంకట్‌ అనే స్నేహితులు స్టేజీపైకి వచ్చారు. సన్నీ తరువాతే ఇక వరుసగా షణ్ముఖ్‌, మానస్‌, శ్రీరామచంద్ర, కాజల్‌ను తర్వాతి నాలుగు స్థానాల్లో ఉంటారని చెప్పుకొచ్చారు. ఇక షణ్ముఖ్‌ జస్వంత్, దీప్తి సునయన ప్రేమతో ఇచ్చిన టీషర్ట్‌ను త్యాగం చేయక తప్పలేదు. షన్ను అన్నయ్య సంపత్‌ అనంతరం దీప్తి సునయన ఎంట్రీ ఇవ్వడంతో షణ్ను ఎంతగానో సంతోష పడ్డాడు.

ఎమోషన్స్‌ను బలంగా మార్చుకోవాలి

ఎమోషన్స్‌ను బలంగా మార్చుకోవాలి

ఎమోషన్స్‌ను బలంగా మార్చుకోవాలి.. అలాగని వీక్‌ అవ్వకూడదు అంటూ దీప్తి సలహాలు ఇచ్చింది. నువ్వేంటో నాకు తెలుసంటూ ముద్దులు పంపించింది. ఇక వీరి ఆలోచన అభిప్రాయం ప్రకారం షణ్ముఖ్‌, శ్రీరామ్‌, సన్నీ, రవి, మానస్‌లు వరుసగా టాప్‌ 5లో ఉంటారని వీళ్లు అభిప్రాయపడ్డారు. ఇక అందరి ఆలోచన ప్రకారం మెంబర్స్‌ సన్నీని టాప్‌ 5లోని మొదటి రెండు స్థానాల్లో పెడుతున్నట్లు అనిపిస్తోంది. అతడే విన్నర్‌ అని చెప్పకనే చెబుతున్నారు.

Recommended Video

Jeethu Joseph About Screen Writing | Drushyam 2
బిగ్ బాస్ విన్నర్ అతనే?

బిగ్ బాస్ విన్నర్ అతనే?

అయితే ఇప్పటివరకు అమ్మాయిలు బిగ్ బాస్ లో టైటిల్ గెలిచింది లేదు. ఈసారి కాజల్ గట్టిగానే పోటీ ఇస్తున్నప్పట్టికి వర్కౌట్ అయ్యేలా లేదని అనిపిస్తోంది. ఆనీ మాస్టర్ సైతం తాను గెలవకపోయినా పర్లేదు కానీ ఈసారి ఒక అమ్మాయి బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని కోరుకొని హౌస్ లో నుంచి వెళ్ళిపోయింది. మరి ఈసారి అబ్బాయిలలో ఎవరు నెంబర్ వన్ అవుతారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X