Bigg Boss: షోలో ఆ హీరోను అవమానించిన నాగార్జున.. స్టేజ్ మీదే ఆమెతో అలా చేయడంతో విమర్శలు

తెలుగు సినీ ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా స్టార్ హీరోగా వెలుగొందుతూ హవాను చూపిస్తున్నాడు కింగ్ అక్కినేని నాగార్జున. ఈ క్రమంలోనే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. అదే సమయంలో నిర్మాతగానూ ఎన్నో చిత్రాలను అందించాడు. ఇక, కొన్నేళ్ల క్రితమే బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి.. అక్కడ కూడా సత్తా చాటాడు. అలాగే, బిగ్ బాస్ షోలోకి హోస్టుగా ప్రవేశించిన తర్వాత తనదైన శైలి యాంకరింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు.

ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా గుర్తింపును కూడా అందుకున్నాడు. మూడు సీజన్లనుగా బిగ్ బాస్ షోను హోస్ట్ చేస్తున్న నాగార్జున.. రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో స్టేజ్ మీదే ఓ పని చేసి షాకిచ్చాడు. దీంతో ఆయనపై విమర్శలు వస్తున్నాయి. అసలేం జరిగింది? చూద్దాం పదండి!

ముగ్గురు స్టార్లతో నాలుగు సీజన్లు పూర్తి

ముగ్గురు స్టార్లతో నాలుగు సీజన్లు పూర్తి

బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పేరొందిన బిగ్ బాస్ షో తెలుగులో నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. దీని సక్సెస్ వెనుక హోస్టులుగా చేసిన హీరోల పాత్ర కూడా చాలా ఉంది. మొదటి సీజన్‌ను జూనియర్ ఎన్టీఆర్, రెండో దాన్ని నేచురల్ స్టార్ నాని, మూడు నాలుగు సీజన్లను సీనియర్ హీరో కింగ్ అక్కినేని నాగార్జున తమదైన శైలి హోస్టింగ్‌తో అద్భుతంగా నడిపించి బిగ్ బాస్‌ను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లారు. దీంతో వాళ్ల నుంచి భారీ స్థాయిలో స్పందనను కూడగట్టారు. ఫలితంగా ఇది విజయవంతమైన షోగా పేరు సంపాదించుకుని సత్తా చాటుతోంది.

నాగార్జున రాకతో జోష్.. నేషనల్ రేంజ్

నాగార్జున రాకతో జోష్.. నేషనల్ రేంజ్

ఏమాత్రం అంచనాలు లేకుండానే ప్రారంభం అయినప్పటికీ.. బిగ్ బాస్ అన్ని సీజన్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. మరీ ముఖ్యంగా అక్కినేని నాగార్జున నడిపించిన మూడు, నాలుగు సీజన్లకు అయితే ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కింది. ఫలితంగా వీటికి మాత్రం రికార్డు స్థాయిలో రేటింగ్ వచ్చింది. మరీ ముఖ్యంగా నాలుగో సీజన్ ఫినాలే ఎపిసోడ్‌కు ఏకంగా 18 పైచిలుకు టీఆర్పీ దక్కింది. దీంతో నేషనల్ రికార్డులు కూడా బద్దలైపోయాయి. దీంతో స్టార్ మా ఛానెల్‌ ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. దీంతో నాగ్‌పై ప్రశంసల వర్షం కురిసింది.

ఐదో సీజన్ కూడా.. అదిరిపోయే రికార్డ్

ఐదో సీజన్ కూడా.. అదిరిపోయే రికార్డ్

నాలుగు సీజన్లు సూపర్ హిట్ అవడంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదోది కూడా ప్రారంభం అయింది. దీనిని కూడా కింగ్ అక్కినేని నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు. ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్ సెప్టెంబర్ 5న జరిగింది. ఇందులో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఇది మొదలై ఒక వారం పూర్తవడంతో.. ఆదివారమే ఒకరు షో నుంచి బయటకు వెళ్లిపోయారు. ఇక, ఈ సీజన్‌కు సంబంధించిన ప్రీమియర్ ఎపిసోడ్‌కు సైతం 18 రేటింగ్ వచ్చింది. దీంతో మళ్లీ నాగార్జున పేరు మీదే ఇంకో రికార్డు నమోదైంది.

చుక్కలు చూపిస్తూ.. చిక్కులు తెచ్చేలా

చుక్కలు చూపిస్తూ.. చిక్కులు తెచ్చేలా


సినిమాల్లో చాలా కాలంగా సత్తా చాటుతూ వచ్చిన అక్కినేని నాగార్జున.. బుల్లితెరపై చేస్తున్న హోస్టింగ్ స్టైల్ ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్‌లో తప్పు చేసిన కంటెస్టెంట్లను మందలించడం.. మంచిగా ఆడితే అభినందించడం వంటివి చేస్తూ ఆయన బెస్ట్ హోస్టుగా పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు, అప్పుడప్పుడు లవ్ ట్రాకుల గురించి మాట్లాడుతూ ఎంతో మందిని ఇరికించాడు కూడా. ఇక, తాజా సీజన్‌లో నాగార్జున రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్లకు చుక్కలు చూపించేలా వ్యవహరిస్తున్నాడు.

రామ్ చరణ్ ఎంట్రీ.. మాస్ట్రో టీమ్ రాక

రామ్ చరణ్ ఎంట్రీ.. మాస్ట్రో టీమ్ రాక

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు అంబాసీడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జున శనివారం జరిగిన వీకెండ్ ఎపిసోడ్‌లో స్వయంగా ప్రకటించారు. అంతేకాదు, ఓ ప్రోమో వీడియోను కూడా విడుదల చేశారు. ఆ తర్వాత చరణ్‌ను బిగ్ బాస్ స్టేజ్‌పైకి ఆహ్వానించారు. ఆ తర్వాత అతడికి స్టేజ్ అప్పగించిన నాగార్జున పక్కకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో రామ్ చరణ్.. 'మాస్ట్రో' మూవీ టీమ్‌ను ఆహ్వానించాడు. అప్పుడు హీరో నితిన్‌తో పాటు హీరోయిన్లుగా చేసిన తమన్నా భాటియా, నభా నటేష్ వచ్చారు.

హీరో నితిన్‌కు షాకిచ్చిన కింగ్ నాగార్జున

హీరో నితిన్‌కు షాకిచ్చిన కింగ్ నాగార్జున

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో పాటు 'మాస్ట్రో' మూవీకి సంబంధించిన యూనిట్ మొత్తం స్టేజ్ మీద ఉన్న సమయంలోనే కింగ్ నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియాను గాఢంగా కౌగిలించుకుని మరీ వెల్‌కం చెప్పాడు. అలాగే కాసేపు పట్టుకుని నిలబడ్డాడు. ఆ తర్వాత నభా నటేష్‌ను కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆహ్వానించాడు. అయితే, హీరో నితిన్‌ను మాత్రం కేవలం పంచ్‌ (కోవిడ్ వల్ల షేక్ హ్యాండ్ ఇవ్వలేదేమో)తో పలకరించాడు. దీంతో అతడికి నాగ్ షాక్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.

Recommended Video

Bigg Boss Telugu 5: Sriram Chandra - Hamida హాట్‌ హాగ్స్‌.. రొమాంటిక్ డ్యాన్సు || Oneindia Telugu
లేడీస్‌ను హగ్ చేసుకోకుండా ఉండలేను

లేడీస్‌ను హగ్ చేసుకోకుండా ఉండలేను

శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున వ్యవహరించిన తీరుపై సోషల్ మీడియాలో ఎన్నో రకాల కామెంట్లు వస్తున్నాయి. తమన్నాను హగ్ చేసుకుని, నితిన్‌కు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకపోవడాన్ని హైలైట్ చేస్తూ చాలా మంది ఔత్సాహికులు మీమ్స్ క్రియేట్ చేశారు. ఇందులో 'నేను అమ్మాయిలు కనిపిస్తే హగ్ చేసుకోకుండా ఉండలేను' అని నాగార్జున అన్నట్లుగా రాసుకొచ్చారు. ఇప్పుడు వీటికి సంబంధించిన మీమ్స్ అన్నీ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వీటిని నాగార్జున అభిమానులు కూడా సరదాగా తీసుకుంటుండడం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X