Bigg Boss: శృతి మించిన రొమాన్స్.. అడుక్కుని మరీ అలా.. హమీదా కూడా అడిగింది అంటూ షణ్ముఖ్ రచ్చ

బిగ్గెస్ట్ ఇంగ్లీష్ రియాలిటీ షో బిగ్ బ్రదర్ ఆధారంగా హిందీలో మొదలైంది బిగ్ బాస్. చాలా కాలం క్రితమే వచ్చిన ఈ కార్యక్రమానికి మంచి ఆదరణ లభించింది. దీంతో దేశంలోని చాలా భాషల్లో ఈ షోను పరిచయం చేశారు. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం తెలుగులోకి కూడా తీసుకొచ్చారు. అన్నింటి కంటే మన దగ్గర వస్తున్న షోకు మాత్రమే భారీ స్థాయిలో ఆదరణ లభించిందనే చెప్పాలి. అందుకే తెలుగు బిగ్ బాస్‌ను నేషనల్ రేంజ్‌లో రేటింగ్ లభించింది. ఇలా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని, ఇప్పుడు ఐదో దాన్ని కూడా నడిపిస్తున్నారు నిర్వహకులు. ఇది కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇందులో షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ రొమాన్స్‌తో రచ్చ చేశారు. అంతేకాదు, హమీదా గురించి కూడా ప్రస్తావన వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌తో ప్లాన్

ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌తో ప్లాన్

గత నెలలో ప్రారంభం అయిన బిగ్ బాస్ ఐదో సీజన్‌పై ఆరంభం నుంచే భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ భారీ స్థాయిలో ఉంటుందని నిర్వహకులు చెప్పారు. దీంతో ఈ సీజన్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో ఐదింతలు ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలని ప్లాన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే రొమాన్స్, లవ్ ట్రాకులు, ఫైటింగులు, కోల్డ్ వార్స్, ఎమోషనల్ సన్నివేశాలు ఇలా పలు రకాల సన్నివేశాలను చూపిస్తూ షోను రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడిపిస్తున్నారు.

 టైటిల్ పోరులో సోషల్ మీడియా స్టార్స్

టైటిల్ పోరులో సోషల్ మీడియా స్టార్స్

ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్‌లో ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు ప్రవేశించిన విషయం తెలిసిందే. అందులో చాలా మంది తమ తమ రంగాల్లో ఫుల్ పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. అయితే, వీళ్లందరిలో షణ్ముఖ్ జస్వంత్ మేల్ కంటెస్టెంట్లలో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగాడు. దీనికి కారణం అతడికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉండడమే. అలాగే, ఆడవాళ్ల నుంచి సిరి హన్మంత్ కూడా టైటిల్ కోసం పోటీ పడే కంటెస్టెంట్‌గానే షోలోకి ఎంటర్ అయింది. ఇక, వీళ్లిద్దరూ బయట ఫ్రెండ్స్ కావడంతో షో ఆరంభం నుంచే ఫోకస్ అవుతున్నారు.

ఇద్దరిలో ఒకరు అలా... మరొకరు కొత్తగా

ఇద్దరిలో ఒకరు అలా... మరొకరు కొత్తగా

బిగ్ బాస్ షోలో అందరూ చెమటలు చిందించాల్సిన అవసరం లేదు. కొందరు శ్రమతో టాస్కులు ఆడితే.. మరికొందరు మాత్రం బుద్ధితో ఆడుతుంటారు. అలాంటి వారిలో ప్రస్తుత సీజన్‌లో షణ్ముఖ్ జస్వంత్ పేరు ముందుగా చెప్పుకోవాలి. ఆరంభంలో చాలా స్లోగా గేమ్ స్టార్ట్ చేశాడు. కానీ, ఇటీవల చక్కగా ఆడుతూ హైలైట్ అవుతున్నాడు. ముఖ్యంగా స్ట్రాటజీలు ప్లాన్ చేస్తున్నాడు. మరోవైపు, సిరి హన్మంత్ మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇప్పటికే ఆమె బిగ్ బాస్ హౌస్‌కు మొదటి కెప్టెన్‌గా కూడా ఎంపికైంది. అలాగే, ప్రతి దానిలో దూకుడుగా ఆడుతూ దూసుకెళ్తోంది.

పరువు తీసిన కంటెస్టెంట్స్.. దారుణం

పరువు తీసిన కంటెస్టెంట్స్.. దారుణం

షోలోకి ఎంట్రీ ఇవ్వకముందే షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ స్నేహితులు అన్న విషయం తెలిసిందే. వీళ్లిద్దరూ కలిసి కొన్ని వెబ్ సిరీస్‌లు కూడా చేశారు. అలాగే, వీళ్లు షోలో వ్యవహరిస్తున్న తీరుపై ఆరంభం నుంచీ విమర్శలు వస్తూనే ఉన్నాయి. హౌస్‌లో కూడా సిరి, షణ్ముఖ్ జంటగానే ఆడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవి, లహరి, హమీదా, శ్వేత ఈ విషయాన్ని చెప్తూ ఘోరంగా మాట్లాడారు. ఇందులో సీనియర్ నటి ఉమాదేవి అయితే ఇంటర్వ్యూలోనే దారుణమైన మాటలతో తిట్టేసింది.

 దూరం పెడుతూ.. చనువుగా ఉంటూనే

దూరం పెడుతూ.. చనువుగా ఉంటూనే

ఇద్దరూ కలిసే గేమ్ ఆడుతున్నారని ప్రతి ఒక్కరూ చెప్పడంతో పాటు అందరూ వీళ్లపైనే దృష్టి సారించారు. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజులుగా షణ్ముఖ్.. సిరిని దూరం పెడుతున్నాడు. ఆమె ఎంతలా బ్రతిమాలినా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నాలు కూడా చేశాడు. దీంతో నాగార్జునే స్వయంగా ఆమెతో మాట్లాడమని షన్నూకు చెప్పాడు. దీంతో దూరం పెట్టినా వెంటనే ఆమెతోనే కలుస్తున్నాడు. దీంతో వీళ్లిద్దరి తీరు ప్రేక్షకులను అయోమయంలో ఉంచేస్తోంది. అలాగే, తరచూ తిట్టుకోవడం, కొట్టుకోవడం వంటివి చేస్తూ విపరీతంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు.

శృతి మించిన రొమాన్స్.. అడిగేసి మరీ

శృతి మించిన రొమాన్స్.. అడిగేసి మరీ

ఎప్పుడూ ఏదో విషయంలో చిర్రుబుర్రులాడుకునే షణ్ముఖ్ జస్వంత్.. సిరి హన్మంత్ మధ్య తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో చిన్న డిస్కర్షన్ జరిగింది. దీంతో ఆమె అతడిపై అలిగింది. దీంతో సారి చెప్పాడు. అయినా మాట వినకపోయే సరికి హగ్ చేసుకున్నాడు. అప్పుడు సిరి 'నేను సారీ చెప్పమంటే నువ్వు హగ్ చేసుకుంటావేంటి' అని అడిగింది. దీనికి షణ్ముఖ్ 'నేను సారీ ఇలాగే చెప్తాను' అన్నాడు. అలా కొద్దిసేపు అయిన తర్వాత మళ్లీ అతడి దగ్గరకు వచ్చిన సిరి 'నాకు మళ్లీ ఒకసారి సారీ చెప్పు' అని అడిగి అతడితో హగ్ చేయించుకుని విమర్శల పాలైంది.

Recommended Video

KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
 హమీదాపై షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు

హమీదాపై షణ్ముఖ్ సంచలన వ్యాఖ్యలు

షణ్ముఖ్‌తో మాట్లాడుతోన్న సమయంలో సిరి 'అరేయ్.. బయటకు వెళ్లిన తర్వాత మనమిద్దం ఓ సాంగ్ చేద్దాం రా' అని అడిగింది. దీనికి అతడు 'నువ్వు ఆగు.. ఇలాంటి వాటికే నేను ఉన్నానా? హమీదా కూడా అంతే వర్క్‌ అనే సరికి నేను గుర్తొస్తాను. బయటకు వెళ్లి వీడియోలు చేద్దాం అనే సరికి నేను గుర్తొస్తాను' అంటూ కోప్పడ్డాడు. తద్వారా హమీదా కూడా గతంలో తనను ఇలాగే అడిగిందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. అప్పుడు సిరి 'అంటే నీతో డ్యాన్స్ చేయడం కోసమే నేను క్లోజ్‌గా ఉంటున్నానా' అంటూ మరోసారి అలకపాన్పు ఎక్కేసి అతడిపై కోప్పడిపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X