Bigg Boss Telugu 5 Unseen నాన్న డబ్బు కొట్టేసి హైదరాబాద్‌కు.. ప్రియాంక, భార్య సంపాదనతో బతుకుతావా అని..రవి

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో కంటెస్టెంట్టు తమ కెరీర్‌లో ఎదుర్కొన్న ఆటుపోట్లను పంచుకొన్నారు. జీవితంలో ఎన్నో సమస్యల నుంచి గట్టెక్కి చిరునవ్వుతో జీవితాన్ని కొనసాగించిన విధానాన్ని చెప్పుకొన్నారు. స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి టాస్క్‌లో ఇంటి సభ్యులతో ప్రియాంక సింగ్, యాంకర్ రవి చెప్పుకొన్న విషయాలు మీ కోసం...

Photo Courtesy: Star మా and Disney+Hotstar

ప్రియాంక సింగ్ ఊరి నుంచి పారిపోయి

ప్రియాంక సింగ్ ఊరి నుంచి పారిపోయి

నేను ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచి నా గురించి నేను అర్ధం చేసుకోవడం ప్రారంభించాను. క్రికెట్ ఆట అంటే ఇష్టం. తేజు తేజు అని అందరూ ముద్దుగా పిలిచేవారు. ఆట వద్ద బాల్స్ అందిస్తూ ఆనందంగా ఉన్నాను. చిన్నప్పటి నుంచి నాకు సమస్యలు వెంటాడటం మొదలయ్యాయి. నా చిన్నతనంలోనే అమ్మ చనిపోవడం, నాన్న రెండో పెళ్లి చేసుకొన్నారు. చిన్నతనంలో నా ప్రవర్తన, తీరు మారడంతో అందరూ మా నాన్నకు ఫిర్యాదు చేయడం మొదలుపెట్టారు. పల్లెటూరి వాళ్ల మాటలు ఎలా ఉంటోయో అందరికి తెలుసు. అలాంటి పరిస్థితుల నుంచి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయించుకొన్నాను అని ప్రియాంక సింగ్ పేర్కొన్నారు.

నాన్న జేబులో నుంచి డబ్బులు కొట్టేసి

నాన్న జేబులో నుంచి డబ్బులు కొట్టేసి

ఒక రోజు నాన్న జేబులో నుంచి 50 రూపాయల దొంగిలించి హైదరాబాద్‌కు రావాలని అనుకొన్నాను. రైల్వే స్టేషన్‌కు వచ్చి టికెట్‌కు డబ్బులిస్తే 75 రూపాయల అని చెప్పారు. దాంతో మళ్లీ ఇంటికి వెళ్లి దేవుడికి ముడుపు కట్టిన డబ్బులను తీసుకొని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్‌కు వచ్చే సరికి నా చేతిలో రెండు రూపాయలు ఉన్నాయి. ఒక రూపాయి కాయిన్‌తో అక్కయ్యకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్లారు అని ప్రియాంక చెప్పారు.

300 రూపాయల నుంచి లక్షల సంపాదన

300 రూపాయల నుంచి లక్షల సంపాదన

హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత నాకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నాకు అప్పారావు బాబాయి పరిచయం అయ్యారు. నువ్వు బాగున్నావు. లేడి గెటప్ వేస్తావా? అని అడిగారు. దాంతో సరే అన్నాను. అమ్మాయిలా కనిపించాలనే కోరిక కూడా తీరిపోతుందనే ఆనందంలో పడిపోయాను. అలా ఒక కామెడీ షోలో నేను అమ్మాయిలా నటించాను. అప్పుడు మా ఊరంతా తేజు అమ్మాయిలో టీవీలో కనిపిస్తుందని ముచ్చటపడిపోయారు. అలా నా సంపాదన 300 రూపాయల నుంచి లక్షల్లో సంపాదించడం మొదలు పెట్టాను అని ప్రియాంక సింగ్ తెలిపారు.

 తేజు నుంచి ప్రియాంకగా మారిపోయాను

తేజు నుంచి ప్రియాంకగా మారిపోయాను

నా చిన్నప్పటి నుంచి ఏది చేయాలో అది చేస్తూనే వచ్చాను. ఆ పరిస్థితుల్లో నేను అమ్మాయిలా మారిపోవాలని నిర్ణయించుకొన్నాను. ఆ తర్వాత మీకు తెలిసిందే. నేను ప్రియాంకగా మారిపోయాను. అప్పటి నుంచి నేను నవ్వుతూ బతుకుతున్నాను. నన్ను ఎవరైనా తిట్టినా నేను నవ్వుతూనే ఉంటాను. నవ్వుతూ ఉంటే ఏదైనా సాధించవచ్చు. మీరు స్మైల్ చేయండి.. స్టార్ట్ చేయండి. థ్యాంక్యూ బిగ్‌బాస్ అని ప్రియాంక సింగ్ అన్నారు.

ఎదుటి వాళ్లు తలదించుకొన్నప్పుడే..

ఎదుటి వాళ్లు తలదించుకొన్నప్పుడే..

యాంకర్ రవి తన కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న విషయాలను చెప్పుకొన్నారు. జీవితంలో ఏమీ సంపాదించలేవు. నీ వల్ల ఏమీ కాదని అని మనల్ని నిరుత్సాహపరిచిన ఎదుటి వాళ్లు మన ముందు తలదించుకొన్నప్పడు వచ్చే సంతృప్తిని మించిన మరొకటి ఉండదు. మా ఇంట్లో నన్ను ఏదో ఒకటి అనేవారు. నిత్య సంపాదిస్తున్నది. ఆడపిల్ల సంపాదన మీద ఎన్ని రోజులు ఆధారపడి ఉంటావు అనే వారు. అలాంటి సమయంలో యాంకర్ మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యాను అని యాంకర్ రవి అన్నారు.

సమ్‌థింగ్ స్పెషల్‌కు టాప్ రేటింగ్‌తో

సమ్‌థింగ్ స్పెషల్‌కు టాప్ రేటింగ్‌తో

మా మ్యూజిక్ ఛానెల్‌లో సమ్‌థింగ్ స్పెషల్ అనే షోకు యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేశాను. ఇక అక్కడ చాలా గందరగోళం ఉండేది. మగ యాంకర్లకు స్థానం లేదు. వారు యాంకరింగ్ పనికిరాదనే భావన అక్కడ ఉండేది. ఆ సమయంలో లేడి యాంకర్ టిప్ టాప్‌గా తయారై యాంకరింగ్ చేసేది. అలాంటి పరిస్థితిలో నేను మాస్‌గా ఉండేలా మంచి కంటెంట్‌‌తో సమ్‌థింగ్ స్పెషల్ స్టార్ట్ చేశారు. మూడు వారాల తర్వాత టాప్ రేటింగ్ వచ్చింది. ఆ సక్సెస్‌ను ఫుల్లుగా ఎంజాయ్ చేశాను. నన్ను ఎవరైతే నిందించారో వాళ్లే నా షోను, నా యాంకరింగ్‌ను మెచ్చుకొన్నారు. అందుకే ఎవరైతే మీరు పనికిరారు అంటారో వారిని మెప్పించేలా చేయండి. అదే నా సలహా. అప్పుడే మీ పెదవులపై చిరున్నవు ఉంటుంది అని యాంకర్ రవి అన్నారు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X