Bigg Boss Telugu 5 Unseen: లోబో, సరయు, హమీదా దమ్ మారో దమ్.. హాట్ హాట్ ముచ్చట్లతో అలా..

బిగ్‌బాస్ హౌస్‌లో ఇంటి సభ్యులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారనే విషయం అందరికి తెలిసిందే. నిషేధిత పదార్థాలు తప్ప అన్నీ సమకూరుస్తారు. మంచి ఆహారం, ఇతర వసతులు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటారు. అలాగే ఇంటిలో ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్ కూడా ఏర్పాటు చేస్తారు. స్మోకింగ్ జోన్‌లోనే కంటెస్టెంట్లు తమ వ్యూహాలకు, ఆలోచనలకు పదను పెడుతూ ఉండటమే కాకుండా.. గాసిప్స్ కూడా అక్కడే క్రియేట్ చేస్తుంటారు. తాజాగా లోబో, హమీదా ఖాతూన్, సరయు రాయ్ ఘాటుగా దమ్ము కొడుతూ.. ఆసక్తిగా ఏం మాట్లాడుకొన్నారంటే..

Photo Courtesy: Disney+hotstar and Star Maa

స్మోకింగ్ జోనులో దమ్ముకొడుతూ..

స్మోకింగ్ జోనులో దమ్ముకొడుతూ..

ప్రతీ సీజన్‌లో మాదిరిగానే బిగ్‌బాస్ తెలుగు 5 షోలో ఇంటిలో స్మోకింగ్ జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు లోబో, హమీదా, సరయు ముగ్గురు దమ్ము కొడుతూ కనిపించారు. ఘాటుగా పొగలు వదులుతూ తమ మనసులోని మాటలను పంచుకొన్నారు. ఇంటి సభ్యుల తీరు గురించి మాట్లాడుకొంటూ కనిపించారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యులపై ఉన్న అభిప్రాయాలను బయటపెట్టుకొంటూ కనిపించారు.

 లోబో నీ గురించి నాకు తెలియదు

లోబో నీ గురించి నాకు తెలియదు

ఇంటిలో జరిగిన ఏదో సంఘటన గురించి లోబోకు సరయు సారీ చెప్పుతూ కనిపించింది. బయట నీ గురించి నాకు తెలియదు. మనకు బాండింగ్ లేదు. కానీ నీ గురించిన ఇన్‌ఫర్మేషన్ నాకు వస్తూ ఉండేది అని సరయు అంటే.. అదే ప్రేమ అంటూ లోబో సిగరేట్ దమ్ము కొడుతూ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. వారిద్దరి సంభాషణ వింటూ హమీదా ఎంజాయ్ చేస్తూ కనిపించింది.

మైండ్ సెట్ ముఖ్యం అంటూ లోబో

మైండ్ సెట్ ముఖ్యం అంటూ లోబో

ఇంటి సభ్యుల్లోని కొందరి గురించి మాట్లాడుతూ.. హౌస్‌లో కనెక్ట్ కావడం కష్టం. ఏదైనా కనెక్టివిటి ఉంటే బయటనే ఉంటుంది. కానీ విశ్వ నాకు తొందరగానే కనెక్ట్ అయిపోయాడు అని సరయు అంటే.. కనెక్టివిటి పక్కన పెడితే.. ప్రధానంగా రిలేషన్ ఏర్పడాలంటే మైండ్ సెట్ ముఖ్యం అని లోబో అన్నాడు.

నటి ప్రియపై లోబో కంప్లయింట్

నటి ప్రియపై లోబో కంప్లయింట్

ఇంటిలో అందరితో ఉన్నట్టు,.. మీతో మజాక్ చేసినట్టు.. సీనియర్ యాక్టర్ ప్రియతో చేయలేను అని లోబో అంటే.. ఆమె అందరితో కలువదు కూడా అంటూ హమీదా కామెంట్ చేసింది. ఆమెను చూస్తే.. బాండింగ్ కష్టమే అనిపిస్తుంది అని లోబో అంటే.. చెప్పలేం అంటూ ఫమీదా కనిపించింది.

సిగరెట్లు వస్తాయో లేవో.. జాగ్రత్తగా

సిగరెట్లు వస్తాయో లేవో.. జాగ్రత్తగా

ఇక సిగరెట్లను భద్రంగా కవర్‌లో దాచుకొంటూ కనిపించారు. సిగరెట్లు తడిచిపోతాయోమో అంటూ కవర్ చుట్టేస్తూ సరయు అంటే.. ఏం కాదు.. పైన పెట్టేయండి అంటూ లోబో చెప్పారు. అంతలోనే వాళ్లు దాచేస్తారో ఏమో అంటూ హమీదా అనుమానం వ్యక్తం చేసింది. కాబట్టి ప్యాకెట్‌లో పెట్టుకో అంటూ సరయు లోబోకు ఇచ్చింది. ప్రతీ రోజు వస్తాయో లేదో అంటూ హమీదా అంటే.. ప్రతీ రోజు వస్తాయి అంటూ లోబో చెప్పడం కనిపించింది.

హమీదా, సరయుపై ఎలిమినేషన్ కత్తి

హమీదా, సరయుపై ఎలిమినేషన్ కత్తి

ఇదిలా ఉంటే.. స్మోక్ జోన్‌లో ఉన్న ఇద్దరు కంటెస్టెంట్లు హమీదా, సరయుపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నది. తొలివారం నామినేట్ అయిన వారిలో వీరిద్దరూ కూడా ఉన్నారు. ఈ ఇద్దరే కాకుండా యాంకర్ రవి, మానస్, మోడల్ జస్వంత్, ఆర్జే కాజల్ కూడా ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X