For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5 Unseen: ఏ ఏరియా నీదీ.. లోబో దెబ్బకు ప్రపోజ్ చేసిన సిరి, బాత్రూమ్‌కు వెళ్లి పని కానీవ్వు

  |

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 అసలైన ఆట మొదలైంది. హౌస్ లో గొడవలు జరిగిన ఎంత ఆప్యాయతలు కనిపించినా కూడా అన్నిటికంటే ఎక్కువగా హైలెట్ అయ్యేది నామినేషన్స్ మాత్రమే. ఎవరు ఎంత స్నేహంగా ఉన్నా కూడా అసలు రంగు బయటపడేది అక్కడే. ఇంట్లో ఎవరు ఎవరిని టార్గెట్ చేస్తారు అనేది బిగ్ బాస్ హౌస్ లో హైలెట్ అయ్యే అంశాలు మొదటి ఈ రోజు చాలా రసవత్తరంగా జరిగాయి.

  అందులో ప్రముఖ సెలబ్రిటీలు కూడా ఉండటం చర్చనీయాంశంగా మారుతోంది. ఎవరు ఎలా ఉన్నా కూడా లోబో మాత్రం తనదైన శైలిలో పక్కా హైదరాబాద్ బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకుంటున్నాడు. అయితే ఒక విషయంలో లోబో సిరికి ఎవరూ ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఏ ఏరియా మీద అంటూ చివరికి ఐ లవ్ యు చెప్పే వరకు తగ్గలేదు.

  అషు రెడ్డి థైస్ అందాలను కింద నుంచి చూపించిన RGV.. హాట్ డోస్ మాములుగా లేదు

  డిఫరెంట్ గా ఆలోచించారు

  డిఫరెంట్ గా ఆలోచించారు

  బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు మొదటి రోజే ఎంతో ఆసక్తికరంగా ఆకట్టుకుంది. ఈసారి సెలబ్రిటీల విషయంలో నిర్వాహకులు చాలా డిఫరెంట్ గా ఆలోచించారని అర్థమైంది. ప్రతి ఒక్కరు కూడా ఎదో ఒక విధంగా సోషల్ మీడియాలో వైరల్ అయిన వారే. బుల్లితెరపై కూడా ఎంతగానో ఆకట్టుకునే సెలబ్రిటీలను కూడా తీసుకు రావడం కొంత హైలెట్ అవుతూ వస్తోంది. ఈసారి బిగ్ బాస్ షో రేటింగ్ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరు కూడా పోటాపోటీగా నిలబడేందుకు ప్రయత్నం చేస్తున్నారని అనిపిస్తోంది.

  Bigg Boss Telugu 5: బిగ్ బాస్‌ కంటెస్టెంట్ ఉమాదేవి హాట్ ఫొటోలు.. ‘కార్తీక దీపం'లో అలా.. పర్సనల్‌ లైఫ్‌లో ఇలా!

  గురకతో షాక్ ఇచ్చిన లోబో

  గురకతో షాక్ ఇచ్చిన లోబో

  అందరికంటే విబిన్నంగా లోబో మంచి ఎంటర్టైన్మెంట్ అందించే విధంగా అడుగులు వేస్తున్నాడు. ఒక్కొక్కరిదీ ఒక్కో టాలెంట్ ఉంటే తను మాత్రం అందరికంటే డిఫరెంట్ గా పక్కా హైదరాబాద్ స్టైల్ లో మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాడు. మొదటి రోజు రాత్రి పడుకున్నప్పుడు గురకతో అందరికీ షాక్ ఇచ్చాడనే చెప్పాలి. అతని గురక ఒక దెబ్బకు ఎవరు సరిగా నిద్ర కూడా పోలేదు. చివరికి రవి కూడా అతడిపై దుప్పటి కప్పే ప్రయత్నం చేశాడు. ఉదయాన్నే ప్రతి ఒక్కరూ లేచి లోగో పై కంప్లైంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. నీ గురక దెబ్బకు ఎవరికీ సరిగ్గా నిద్ర కూడా పట్టలేదని అన్నారు.

  Bigg Boss Telugu 5: మీరెప్పుడు చూడని ఆనీ మాస్టర్ బ్యూటీఫుల్ ఫొటోస్ వైరల్

  ఏ ఏరియా నీది.. ఎక్కడ ఉంటావ్

  ఏ ఏరియా నీది.. ఎక్కడ ఉంటావ్

  ఇక ఆ తర్వాత అందరూ హాలులో మాట్లాడుకుంటుండగా లోబో ఒక్కడు మాత్రం బాత్రూమ్ దగ్గర ఉన్న రెస్ట్ రూమ్ లో అద్దాలను శుభ్రం చేస్తూ ఉంటాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సిరి కళ్ళకు కాటుక పెట్టుకుంటు ఉంటుంది. అదే సమయంలో జెస్సి కూడా వస్తాడు. కానీ అతడు మానస్ తో మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇంతలో సిరి లోబోను హాయ్ బ్రో అని పిలుస్తుంది. దీంతో లోబో ఒక్కసారిగా అసహనానికి గురవుతాడు. ఏ ఏరియా నిధి ఎక్కడ ఉంటావ్ అని బెదిరిస్తాడు. అనంతరం సిరి మణికొండ అని సిగ్గుపడిపోతూ చెబుతుంది.

  Indian Idol fame Shanmukhapriya కు విజయ్ దేవరకొండ బంపర్ ఆఫర్

  బ్రో అంటే నాకు నచ్చదు

  బ్రో అంటే నాకు నచ్చదు

  నువ్వు ఎవరైనా సరే నాకు అనవసరం. మణికొండకు వచ్చి చూపిస్తా నా సంగతి ఏమిటో అని కాస్త సరదాగానే కౌంటర్ ఇస్తాడు. ఇక అందుకు సిరి సారి అని సైలెంట్ అవుతుంది. నన్ను బ్రో అనడం కరెక్ట్ కాదు అని లోబో సిరికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటాడు. అందుకు ఆమె వెంటనే క్షమాపణ కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. అందుకే లోబో మాట్లాడుతూ ఎవరైనా ఒక అమ్మాయి బ్రో అని అంటే పర్వాలేదు. కానీ నెక్స్ట్ లెవెల్ లో చాలా అందంగా ఉండే అమ్మాయి మాత్రం అలా అంటే ఏమాత్రం తట్టుకోలేను. చాలా హర్టింగ్ గా ఉంటుంది.. అని లోబో వివరిస్తాడు.

  ఐ లవ్ యు అని చెప్పడంతో

  ఐ లవ్ యు అని చెప్పడంతో

  సిరి ఎంతగా నవ్వుతున్నా కూడా బ్రో అనడం కరెక్ట్ కాదని ఆమెకు అర్థమయ్యేలా మరింత క్లియర్ గా చెప్పాలని అనుకుంటాడు. ఇక సిరి వెంటనే అతనికి వెంటనే ఐ లవ్ యు చెబుతుంది. సిరి మాటలకు లోబో ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయినప్పటికీ అతనికి వెంట వెంటనే ఐ లవ్ యూ చెబుతూ ఉంటుంది. ఇక లోబో ఒక డబ్బా తీసుకొని తన తలను కొట్టుకుంటాడు. ఇక ఇంతలో అక్కడికి రవి కూడా వస్తాడు.

  పంచాయితీ ఏమిటని రవి అడగడంతో

  పంచాయితీ ఏమిటని రవి అడగడంతో

  రవి రాగానే అక్కడ జరిగిన విషయాన్ని అతనికి చెప్పాలని సిరి ప్రయత్నం చేస్తుంది. కానీ వెంటనే లోబో కలుగజేసుకొని అది అందరికీ చెప్పడం అనవసరం అనేలా సమాధానం ఇస్తాడు.

  మొదటి రోజు నుంచి కూడా రవి లోబో చాలా ఫ్రెండ్లీగా ఉండే ప్రయత్నం చేస్తున్నారు. వీరు ఇదివరకే మాటీవీలో కలిసి పనిచేసిన స్నేహం ఉంది కాబట్టి ఒకరికొకరు చాలా క్లోజ్ గా ఉంటారు. ఆ పరిచయంతోనే ఏం జరిగింది అంటూ లోబోను అడిగే ప్రయత్నం చేస్తాడు. ఇక సిరి కూడా సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుండగా ఇది మన మాట ఉంటూ లోబో అడ్డు పడతాడు.

  Bigg Boss Telugu 5 కు నాగార్జున రెమ్యూనరేషన్ అన్ని కోట్లా ? || Filmibeat Telugu
  బాత్రూమ్ కు వెళ్లి పని కానీవ్వు..

  బాత్రూమ్ కు వెళ్లి పని కానీవ్వు..

  లోబో మాటలకు రవి కాస్త అప్సెట్ అయినట్లు ఏడ్చినట్లు కామెడీ చేస్తాడు. ఇక అదే తరహా కామెడీతో లోబో కూడా అలా కాదు రా నువ్వు అలా బాధపడకు అని మోకాళ్ళ మీద నిలబడి ప్రాధేయ పడతాడు. దీంతో రవి అంత చేయవద్దు అంటూ అసలు ఏ జరిగిందని రవి మళ్ళీ సరదాగా అడుగుతాడు. అయినప్పటికీ. లోబో ఏం కాలేదు మేమిద్దరం ఇక్కడ ఇది క్లీన్ చేసుకుంటున్నామని చెబుతాడు. ఆమ్లెట్ తిన్నావు కదా బాత్రూంకి వెళ్లి పని కానీవ్వు అంటాడు. అందుకు రవి రావట్లేదని చెబుతాడు కూడా. తనకు కూడా సేమ్ ప్రాబ్లం అంటూ లోబో కూడా నవ్వుతూ సమాధానం ఇస్తాడు.

  English summary
  Bigg Boss Telugu 5 Unseen Episode: Lobo and siri funny conversation in rest room.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X