Bigg Boss 5 Telugu Day 3 Unseen: ఆయనకు ఎక్కడ తగ్గాలో.. నెగ్గాలో తెలుసు.. అతడికి ఏమీ తెలియదు.. ప్రియ రచ్చబండ ము

బిగ్‌బాస్ తెలుగు 5 షోలో ఇంటి సభ్యులు ఒకరి గురించి మరొకరు బేరిజు వేసుకోవడం మొదలుపెట్టారు. తమ ముందు ఉన్న వ్యక్తులను అంచనా వేస్తూ తమ గేమ్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోంటున్నట్టు అనిపిస్తున్నది. మూడు రోజుల గేమ్ తర్వాత ఇంటిలోని లహరి షారి, కార్తీకదీపం ఫేమ్ ఉమ, నటి ప్రియ ఇంటి సభ్యుల తీరు, వారి ప్రవర్తన, గేమ్ ప్లాన్ ఎలా ఉందనే విషయం గురించి చర్చించుకొంటూ కనిపించారు. ఇంటి సభ్యుల ఒక్కొక్కరి గురించి నటి ప్రియ చక్కగా విశ్లేషించింది. కంటెస్టెంట్ల గురించి నటి ప్రియ ఏం చెప్పిందంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

వీజే సన్ని గురించి

వీజే సన్ని గురించి

కంటెస్టెంట్ వీజే సన్నీని లహరి షారి పిల్లి అని కామెంట్ చేసింది. వెంటనే పక్కనే ఉన్న నటి ప్రియ స్పందిస్తూ.. అన్నీ తెలుసు అనుకొంటాడు. కానీ ఏమి తెలియదు. అందర్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. ఎప్పుడు గట్టిగా మాట్లాడాలో అప్పడు గట్టిగా మాట్లాడుతాడు. అందరూ నా మాట వింటారని అనుకొంటాడు. కానీ ఎవరు వినరు. కొన్నిసార్లు నేను వింటాను అని అన్నారు. అయితే అన్ని కాదు కానీ కొన్ని తెలుసు అని ఉమ కామెంట్ చేసింది.

 యాంకర్ రవి గురించి ప్రియ

యాంకర్ రవి గురించి ప్రియ

లోబో గురించి మాట్లాడుతూ.. ఉన్నట్టుండి నిద్ర లేస్తాడు. కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు అని ప్రియ చెప్పింది. ఇక యాంకర్ రవి గురించి మాట్లాడుతూ... ఉమ గారు చెప్పినట్టే.. ఆయనకు ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో బాగా తెలుసు. ఎక్కడ ఎలా ఉండాలి. ఎప్పుడు ఏం చేయాలనే విషయంలో క్లారిటీ ఉంది. బయట చాలా ఎక్స్‌పీరియెన్స్ ఉంది. కానీ బయటి అనుభవం బయటదే... ఇంట్లో అనుభవం వేరేలా ఉంటుంది. ఆ అనుభవం ఇంటిలో చాలా ఉపయోగ పడుతుంది అని ప్రియ అన్నారు.

ఆర్జే కాజల్, అనీ మాస్టర్ గురించి

ఆర్జే కాజల్, అనీ మాస్టర్ గురించి

ఆర్జే కాజల్ గురించి వస్తే.. బిగ్‌బాస్ గురించి అన్నీ తెలుసుకొన్నది. కానీ ఇక్కడ అవి ఏమీ పనిచేయవు. చాలా మెచ్యుర్డ్ అనుకొంటుంది కానీ.. అదేమీ లేదు అని ప్రియ చెప్పింది. ఇక సిరి హన్మంతు విషయానికి వస్తే.. చాలా స్మార్ట్. ఆ ఏజ్‌లో నాకు ఏమీ తెలియదు అని ప్రియ చెబితే.. తెలిసే లోపే జీవితం అయిపోతుంది అని ఉమ అంటే.. అవును అంటూ ప్రియ మద్దతు పలికింది. ఇక ఆనీ మాస్టర్ విషయానికి వస్తే.. పంతం. ఆమెకు ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొంటే కొన్ని విషయాల్లో సర్దుపెట్టుకోవచ్చు. ఆమెకు ప్రతీ ఒక్కరిపై ఒక అవగాహన ఉంది. ఎదుటి వ్యక్తుల నుంచి డేంజర్ ఉందనే విషయం తెలుసు. తన ఊహ ప్రకారం వెళ్తున్నది. అందరితో ఒకేలా బిహేవ్ చేయదు అని ప్రియ చెప్పారు.

శ్వేతా వర్మ ఎలాంటిదంటే..

శ్వేతా వర్మ ఎలాంటిదంటే..

శ్వేతావర్మ గురించి చెబుతూ.. ఎవరు ఏమి చెప్పినా అది చేసేస్తున్నది. ఆ అమ్మాయి చాలా స్ట్రాంగ్. అందర్నీ మంచి చేసుకోవాలని తాపత్రయం పడుతున్నది. అది కుదరదు. అందర్నీ మంచి చేసుకోవడం బిగ్‌బాస్ ఇంటిలో సాధ్యపడదు. కాకపోతే అందరితో మంచి చేసుకోవాలనే నైజం ఉండచ్చు అని ప్రియా చెప్పింది.

 ప్రియాంక సింగ్ ఎంతో జీవితాన్ని చూసిందంటూ.

ప్రియాంక సింగ్ ఎంతో జీవితాన్ని చూసిందంటూ.

ఇక ప్రియాంక సింగ్ గురించి మాట్లాడుతూ.. ప్రియాంక చాలా సెన్సిటివ్ అమ్మాయి. గేమ్ గురించి బాగా తెలుసు. అవన్నీ పక్కన పెడితే.. బయట ఎన్నో ఆటుపోట్లు తట్టుకొని ఇక్కడకు వచ్చింది. ఇవన్నీ ఒక లెక్క కాదు. చిన్న వయసులోనే ఎన్నో చూసింది. జెండర్ ఛేంజ్ గురించి ఎవరికి తెలియని రోజుల్లోనే ఆమె ధైర్యం చేసింది. అప్పుడు ఆమెను ఎన్ని మాటలు అని ఉంటారో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. అక్కడ ప్రపంచాన్నే ఎదుర్కొన్నది. మనమెంత అని ప్రియ చెప్పారు

సింపతి ట్యాగ్‌తో విశ్వ

సింపతి ట్యాగ్‌తో విశ్వ

విశ్వ గురించి చెబుతూ సింపతి ట్యాగ్ ప్లే చేస్తున్నాడు అని ప్రియా అంటే.. ఎప్పుడూ సానుభూతి పనిచేయదు అని ఉమ అంటే.. ఈ మూడు రోజుల్లో గమనించిన విషయాలను బట్టి ఇంటి సభ్యుల గురించి నేను చెబుతున్నాను. నా అభిప్రాయలు రేపైనా మారొచ్చు. చివరి రోజైనా మారొచ్చు అని ప్రియ అన్నారు.

Recommended Video

Maha Samudram Movie Team On 'Cheppake Cheppake' Song
సరయు చాలా స్ట్రాంగ్ అంటూ

సరయు చాలా స్ట్రాంగ్ అంటూ

ఇక సరయు గురించి చెబుతూ.. మంచి అవగాహన ఉన్న వ్యక్తి. మంచి బ్యాకప్ మైండ్‌తో చాలా స్ట్రాంగ్‌గా ఇంట్లోకి అడుగుపెట్టింది. తనకు బ్యాకప్ ప్లాన్ ఉంది అని ప్రియా చెప్పారు. హమీదా గురించి చెబుతూ.. నాకు ఎలాంటి ఇంప్రెషన్ కలుగలేదు. కానీ ఉమ చెప్పిన తర్వాత చాలా తెలివైనది అని ఉమ, లహరి షారితో కలిసి కూర్చొని ప్రియ ఇంటి సభ్యులొక్కక్కరి గురించి బేరిజు వేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X