Bigg Boss Telugu 5 Unseen: గేమ్ ప్లాన్ మార్చిన RJ కాజల్.. వామ్మో నేను తట్టుకోలేను అంటూ

బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య పరిస్థితులు ఎప్పటికప్పుడు ఊహించని విధంగా మారుతున్నాయి. మొదటి వారం ఎలిమినేషన్ అనంతరం కంటెస్టెంట్స్ లలో గట్టిగానే ఎమోషన్స్ పెరిగాయి. ఏ మాత్రం తగ్గకుండా ఎగబడి పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సారి కూడా నామినేషన్ పోరు చాలా గట్టిగానే జరిగింది. కోపాలతో ట్రిక్కులతో నామినేట్ చేసుకోవడం హాట్ టాపిక్ గా నిలిచింది. ఇక నాగార్జున ఫస్ట్ వీక్ అయితే ఎవరిని కూడా ఏమీ తిట్టలేదు. కానీ రెండవ వారం నుంచి ఆయన డోస్ పెంచే అవకాశం అయితే ఉంది.

ఇక కంటెస్టెంట్స్ గేమ్ స్ట్రాటజీని కూడా గట్టిగానే ఫాలో అవుతున్నారు. ఇక అందరి కంటే RJ కాజల్ తనదైన శైలిలో ప్రణాళికలు రచిస్తోంది. ఇక ఈసారి ఆమె మరొక షాకింగ్ నిర్ణయం తీసుకుంది. కానీ అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చెప్పలేము. మొత్తానికి ప్రణాళిక రచించినట్లు తెలుస్తోంది. లహరితో మాట్లాడుతూ ఆమె ఒక విషయాన్ని అయితే గట్టిగానే చెప్పేసింది.

గేమ్ స్ట్రాటజీ..

గేమ్ స్ట్రాటజీ..

బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం నామినేషన్స్ లో ఉన్న వారు ఎవరు బయటకు వెళ్తారో చెప్పడం ఊహలకు అందడం లేదు. ఎవరికి వారు చాలా బలంగా పోటీలో నిలుస్తున్నారు. కంటెస్టెంట్స్ ను ఎదుర్కోవడంలో ఎవరు తగ్గడం లేదు. నిన్నా. మొన్నటి వరకు బ్రదర్, సిస్టర్ అని అనుకున్న వాళ్ళు కూడా గట్టిగా మాట్లాడుతూ కోపాలను చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. హౌస్ లో ఎవరు ఎలా ఉన్నా కూడా స్ట్రాటజీని ఫాలో అవ్వడం మరొక లెవెల్ లో ఉంటుందని చెప్పవచ్చు. కానీ అది రిస్క్ అనే చెప్పాలి. ఏ మాత్రం దొరికిపోయినా కూడా పరువుతో పాటు ఇతరులు కూడా నమ్మడానికి కాస్త కష్టంగానే ఉంటుంది.

తెలియకుండానే ప్లాప్

తెలియకుండానే ప్లాప్

స్ట్రాటజీ ఫాలో అయిన కంటెస్టెంట్స్ చివరి వరకు కూడా ఇతరులతో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎవరికీ నమ్మడానికి వీలు లేదు కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి. అలా చేస్తే ఒక విధంగా ఎలిమినేషన్స్ లో కొంత హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికే యాంకర్ రవి ఆ విషయంలో ఒక స్టేజ్ అయితే దాటిపోయాడు. కానీ కొందరు మాత్రమే అతని ట్రాక్ లోకి వస్తున్నారు. తెలిగిగా గేమ్ ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ కొన్నిసార్లు అవి తెలియకుండానే ప్లాప్ అవుతున్నాయి.

దొరికిపోతున్న రవి

దొరికిపోతున్న రవి

రీసెంట్ గా జశ్వంత్ జెస్సి తో కాస్త తెలివిగా మాట్లాడేందుకు రవి ప్రయత్నాలు గట్టిగానే చేశాడు. అతని మంచిగా చేసుకోవాలని ఎలిమినేషన్ లో కూడా తప్పించుకోవాలని అనుకొన్నాడు. కానీ రవి బ్యాడ్ లక్ ఏమిటో గాని జెస్సి అతన్ని నామినేట్ చేయడం విశేషం. అలాగే లోబో కూడా తన స్నేహితుడు కాబట్టి నామినేట్ అవ్వకూడదు అని అనుకున్నాడు. కానీ లోబో కూడా ఈ వారం రవిని కాస్ట్ డేంజర్ జోన్ లో పడేశాడు. అలాగే మరో వైపు నట్రాజ్ మాస్టర్ కూడా అతని గుంట నక్క అని ఇన్ డైరెక్ట్ గా కామెంట్ చేయడం మరింత వైరల్ గా మారింది.

కాజల్ కూడా అదే తరహాలో

కాజల్ కూడా అదే తరహాలో

మొత్తానికి రవి ఎంతోకొంత తన గేమ్ స్ట్రాటజీతో ముందుకు సాగుతూ ఉండగా కాజల్ కూడా అదే తరహాలో వెళ్లాలని మొదటి నుంచి అడుగులు వేస్తోంది. కానీ ఆమె దురదృష్టం ఏమిటో గాని ఇన్వాల్వ్మెంట్ అవుతున్న ప్రతిసారి కూడా ఈజీగా దొరికిపోతుంది. మిగతా కంటెస్టెంట్స్ ఆమెను ఏ మాత్రం ఒప్పుకోవడం లేదు. ప్రతిసారీ ఏదో ఒక విషయంలో అనవసరంగా ఇన్వాల్వ్ అవుతోందని ఇదివరకే కొంతమంది డైరెక్ట్ గా కామెంట్స్ చేశారు. ఆ విషయం పై RJ కాజల్ కూడా బాగానే ఆలోచించింది. అయితే ఆ తరహాలో కాదని ఆమె అందరితో కాకుండా ఒక్కొక్కరిని ట్రాప్ లోకి తేవాలని అనుకుంటోంది.

చాలా ఇబ్బందిగా ఉంది

చాలా ఇబ్బందిగా ఉంది

ప్రస్తుతం కొనసాగుతున్న కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కాజల్ ఒక్కొక్కరితో సెపరేట్ గా మాట్లాడుతుంది. ఇటీవల కూడా ఆమె లహరితో మాట్లాడిన విధానంతో మరో కొత్త ఫార్ములా ఫాలో అవుతుంది అని అర్థం అవుతోంది. అందరూ తననే టార్గెట్ చేస్తున్నారని ఈ విషయంలో కూడా వెనక్కి తగ్గబోతున్నట్లు చెప్పింది. టాస్క్ లో కూడా ఎక్కువగా అందరూ ఒకేసారి కావాలని ఎగబడుతుండడం, అది చాలా ఇబ్బందిగా ఉందని తట్టుకోలేకపోతున్నాను తెలియజేసింది. కాజల్ మాటలను లహరి అదేపనిగా నమ్మేసింది. అయితే కాజల్ మాత్రం ఇదివరకే కొంతమందితో అదే తరహాలో మాట్లాడడం విశేషం.

Recommended Video

Bigg Boss Telugu 5 : Uma బూతుల దెబ్బకు.. Week 2 Nominations || Oneindia Telugu
కాజల్ ట్రాక్ లోకి లహరి..

కాజల్ ట్రాక్ లోకి లహరి..

కాజల్ లహరితో ఇదే తరహాలో మాట్లాడుతూ నమ్మించింది. ఒక విధంగా వాళ్లంతా కూడా కాజల్ ట్రాక్ లోకి వస్తున్నారని చెప్పాలి. ఒకరు ఇద్దరు వస్తే మాట్లాడగలం కానీ అందరూ ఒకేసారి కావాలని ఎగబడుతూ ఉంటే ఏమి మాట్లాడ లేని పరిస్థితిలో ఉన్నాం. నేను కేవలం ఆట మొదలైనప్పుడు మాత్రమే అందరితో ఉండిపోతాను.

కానీ ప్రత్యేకంగా ఎవరితోనూ మాట్లాడదలచుకోవాలని అనుకోవడం లేదు. కాజల్ గుంపులో కాకుండా కేవలం ఒక దగ్గర కూర్చుని ఉండిపోయింది. ఇక లహరి ఆమెకు కాస్త బూస్ట్ ఇచ్చే విధంగా మాట్లాడినప్పటికీ కాజల్ అస్సలు తగ్గలేదు. నేను ఎవరితోనూ మాట్లాడాలని అనుకోవడం లేదని ఓపెన్ గా చెప్పేసింది. మరి లహరి కాజల్ ట్రాక్లోకి వచ్చిందో లేదో తెలియాలంటే ఈ వారం మొత్తం ఎదురు చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X