Bigg Boss Unseen..ఆ కంటెస్టెంట్‌ తల్లికి లైన్ వేసి అడ్డం బుక్కైన లోబో.. బక్రా చేసిన రవి, శ్రీరామచంద్ర

బిగ్‌బాస్ ఇంటిలో ఫుల్లుగా వినోదాన్ని పండించే విధంగా సభ్యులు నాటికను ప్రదర్శించారు. ఇందులో అందరూ కలిసి లోబోను బకరా చేశారు. లోబోతో శ్వేతా వర్మ పెళ్లి చూపులు, లవ్ మ్యాటర్ విషయంపై ఓ చిన్న స్కిట్ ప్రదర్శించగా అందులో నటించిన వాళ్లు తమ పాత్రను పూర్తిగా పండించి ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తే విధంగా యాక్టింగ్ చేశారు. లోబో, శ్రీరామచంద్ర, శ్వేతా వర్మ లవర్లుగా, శ్వేతా వర్మ తల్లిగా అనీ మాస్టర్, లోబో ఫ్రెండ్‌గా యాంకర్ రవి నటించారు. ఈ సరదా ఎపిసొడ్‌లో ఏం జరిగిందంటే..

లోబో నా బాయ్‌ఫ్రెండ్ అంటూ

లోబో నా బాయ్‌ఫ్రెండ్ అంటూ

శ్వేత వర్మతో లవ్ ట్రాక్ నేపథ్యంలో.. అమ్మ.. ఈయన లోబో అంటూ అనీ మాస్టర్‌కు పరిచయం చేసింది. ఈయన నా ఫ్రెండ్ అని శ్వేతా వర్మ చెబితే.. ఏంటి స్టైలిష్‌గా ఉన్నావు అంటూ అనీ మాస్టర్ విష్ చేసింది. ఈయన నీ స్కూల్ ఫ్రెండా అంటే.. చాలా ఎక్కువ వయసు కనిపిస్తున్నది అని ఆనీ మాస్టర్ అడిగితే.. చాలా క్లాసులు ఫెయిల్ అయ్యాడు. నాకు స్కూల్, కాలేజ్‌లో ఫ్రెండ్ అంటూ పరిచయం చేసింది. అయితే ఏదైనా టీ, కాఫీ తగుతారా? నిమ్మరసం తాగుతారా? లేదా ఇంకా ఏదైనా తీసుకొంటారా? ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటివి తీసుకోరు అంటూ అనీ మాస్టార్ కనిపించింది.

శ్వేతావర్మను ఇష్టపడి అంటూ

శ్వేతావర్మను ఇష్టపడి అంటూ

లోబోతో అని మాట్లాడుతూ.. ఎంత వరకు చదువుకొన్నావు అంటే.. బీకాం అని బదులిచ్చాడు. ఐదేళ్ల క్రితం శ్వేతాను చూశాను. అప్పటి నుంచి ఆమె క్లాస్ మేట్ కావడానికి ఐదేళ్లు ప్రతీ క్లాస్ ఫెయిల్ అయ్యాను అని లోబో అంటే.. మీకు డబ్బులు ఎక్కువగా ఉన్నాయా? ఇలాంటి వెటకారం చేయడానికి అంటూ అనీ మాస్టర్ సెటైర్ వేసింది. అందుకు కాదు.. శ్వేతను చూసి ఇష్టపడ్డాను. ప్రతీ రోజు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్ నూన్ అంటూ టచ్‌లో ఉన్నాను అంటూ లోబో చెప్పాడు.

గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటే తప్పేమిటి?

గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటే తప్పేమిటి?

లోబో నసుగుతుంటే.. ఏం పని మీద వచ్చావు అంటే.. మీ వీధిలో వర్మ వాళ్లు ఉన్నారు కదా.. వారి అబ్బాయి శ్రీరామచంద్ర నాకు ఫ్రెండ్. అతడిని కలువడానికి వచ్చాను అని లోబో చెప్పాడు. దాంతో శ్రీరామ్ మంచి అబ్బాయి. మా అమ్మాయిని అతడితో పెళ్లి చేయడానికి మాట్లాడుతున్నాం అంటూ అని మాస్టర్ షాక్ ఇచ్చింది. అయితే శ్రీరాం మంచివాడు. అతడు బాగా పాటలు పాడుతాడు. చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారు అంటూ అనీ మాస్టర్‌కు లోబో చెబితే.. ఈ రోజుల్లో అబ్బాయిలకు చాలా మంది గర్ల్‌ఫ్రెండ్స్ ఉంటున్నారు. అందులో తప్పేమీ లేదు అంటూ అనీ మాస్టర్ చెప్పారు.

ప్రేమించిన ఏకైక వ్యక్తి శ్వేతా

ప్రేమించిన ఏకైక వ్యక్తి శ్వేతా

అయితే శ్రీరామచంద్ర గురించి చెడుగా చెప్పడానికి ప్రయత్నిస్తూ... ఆయనకు ఓ ప్రియురాలు ఉన్నారు అంటూ లోబో చెబితే.. ఈ వయసులో అలాంటివి కామన్. నువ్వు ఎవరిని ప్రేమించలేదా? అంటే.. ఇప్పటి వరకు నేను కళ్లు తెరిచి చూసింది ఒకే అమ్మాయినే అని లోబో అంటే.. ఎవరా అమ్మాయి.. అంత అదృష్టవంతులు ఎవరు? అని అనీ మాస్టర్ అడిగింది. దాంతో ఇంకెవరు.. నేను ప్రేమించిన ఏకైక వ్యక్తి మీకు కూతురు శ్వేతా వర్మ అంటూ లోబో సమాధానం చెప్పాడు.

లోబో పొట్టను ఏం చేద్దాం అంటూ..

లోబో పొట్టను ఏం చేద్దాం అంటూ..

లోబో ప్రేమ వ్యవహారం బయటపెట్టడంతో కంగారు పడిపోయిన అనీ మాస్టర్.. ఏంటి శ్వేత అంటూ అరిచింది. దాంతో నాకు ఇప్పుడే లోబో ప్రేమ గురించి తెలిసింది అంటూ శ్వేతా వర్మ నసిగింది. నాకు మంచి ఫ్రెండ్ అంటూ ఏదో చెప్పబోతే.. చూడటానికి బాగానే ఉన్నాడు. ఓవర్ డ్రస్పింగ్ ఉంది. పొట్ట కూడా ఎక్కువగానే ఉంది. పొట్టను ఏం చేద్దాం అంటూ అనీ మాస్టర్ అంటే.. నేను ఫ్రెండ్‌గానే చూశా అంటూ అని మాస్టర్‌కు శ్వేతా వర్మ సమాధానం ఇచ్చింది.

శ్వేత తల్లికి లైన్ వేస్తున్నావు కదా..

శ్వేత తల్లికి లైన్ వేస్తున్నావు కదా..

శ్వేతా వర్మపై మనసు పడ్డ లోబోకు అనీ మాస్టర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. నీవు చాలా మంచి వాడివి. క్యూట్‌గా ఉన్నావు. నీకు మంచి అమ్మాయిని నేనే చూసి పెడుతా. నీవు ఏం జాబ్ చేస్తావో.. ఇలా ప్రేమిస్తున్నానని వెటకారం చేయకు అంటూ అని మాస్టర్ అంటుండగా.. అక్కడికి శ్రీరాంచంద్ర వచ్చాడు.. హాయ్ శ్వేతా.. డేటింగ్‌కు వెళ్దామని అన్నావు అంటుండగా.. పక్కనే లోబో కనిపిస్తే.. ఏం ఇక్కడు ఉన్నావు అంటూ శ్రీరామచంద్ర ప్రశ్నించాడు. అంతేకాకుండా శ్వేత తల్లి అంటే ఇష్టం కదా.. నీవు ఆమెకు లైన్ వేస్తున్నావు కద అంటూ లోబోను ఇరుకున పెట్టారు.

Recommended Video

Most Eligible Bachelor Trailer | Akhil Akkineni | Pooja Hegde
నీ కూతురు ఏడుస్తున్నదంటూ యాంకర్ రవి

నీ కూతురు ఏడుస్తున్నదంటూ యాంకర్ రవి


లోబోను శ్రీరామచంద్ర ఆడుకొంటున్న సమయంలోనే యాంకర్ రవి వచ్చి.. ఏందిరా ఇక్కడ ఉన్నావు.. ఇంట్లో నీ బిడ్డ ఏడుస్తున్నది అని చెప్పగానే.. అందరూ షాక్ అయ్యారు. నీకు కూతురు కూడా ఉందా? నీకు ఇదివరకే పెళ్లి అయిందా? నీ పొట్ట చూడగానే పెళ్లి అయిందని అనిపించింది అంటూ అని మాస్టర్ లోబోను ప్రశ్నించింది. దాంతో లోబో ఇదేంటి అంటూ శ్వేతా వర్మ చెప్పింది. అయితే కూతురు సీన్ నాకు చెప్పకుండా నాకు షాకిచ్చారు. కూతురు అని చెప్పకుండా .. ఇషా అని కూడా చెప్పడం ఏమిటంటూ లోబో అంటే.. అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. ఇంటిలో చిన్న నాటకాన్ని వినోదంగా పండించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X