Bigg Boss Unseen ఆ పనులు చేస్తే దరిద్రంగా ఉంటుంది.. కొన్ని మానేద్దాం.. సిరి హన్మంతుతో షణ్ముక్ జస్వంత్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలోని కంటెస్టెంట్లకు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటిని సందర్శిస్తున్నారు. ఈ సందర్భంగా సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్ మధ్య రొమాన్స్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. సిరి హన్మంతు తల్లి బహిరంగంగానే వారిద్దరి ముద్దుల, కౌగిలింతలపై ఘాటైన కామెంట్స్ చేసింది. దాంతో సిరి, షన్ను మధ్య యాంకర్ రవితో ఆసక్తికరమైన చర్చ జరిగింది. తమ రొమాన్స్‌పై వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే..

Photos Courtesy: Star MAA and Disney+Hotstar

నా లవర్ రాలేదని బెంగతో ఉన్నా

నా లవర్ రాలేదని బెంగతో ఉన్నా

సిరి తల్లి కామెంట్లపై షన్ముఖ్ జస్వంత్ స్పందిస్తూ.. ఇక ఈ రోజు నుంచి మేము దాదాపు క్లారిటీతో ఉన్నాం. నిన్న దడేల్ మే ఫిడేల్ అయింది కాబట్టి హడల్ ఎత్తింది. ఇక ముందు జాగ్రత్తగా ఉంటాం అని షణ్ముఖ్ అన్నాడు. దాంతో చోటు (లవర్) రాలేదనే బెంగ నాలో ఉంది. ఇక నా లైఫ్ చాప్టర్ క్లోజ్ అనే ఫీలింగ్‌లో ఉన్నాను. దాంతో మా మదర్ వచ్చి అలాంటి మాటలు అనడంతో బాత్రూమ్‌లోకి వెళ్లి ఏడ్చాను అని సిరి హన్మంతు చెప్పడం కనిపించింది.

దీప్తి సునైనా రాకపోతే ఫీలయ్యానా?

దీప్తి సునైనా రాకపోతే ఫీలయ్యానా?

నా బాయ్ ఫ్రెండ్ రాలేదని నేను బాధలో ఉంటే.. మరోవైపు షన్ముఖ్ వచ్చి పెంట పెట్టాడు అని సిరి అన్నది. దాంతో నేను ఎప్పుడు? ఏమన్నాను? అని షణ్ముఖ్ అడిగాడు. దాంతో ఉదయం నీవు చేసిన కామెంట్ ఎలా ఉందో ఆలోచించావా? చోటు రాకపోతే అదే అనుకొన్నాం. అది నీకు తెలుసు కదా అని సిరి అంటే.. దీపు రాకపోతే నేను అలా ఫీలయ్యానా? అని షన్ముఖ్ జస్వంత్ అన్నాడు.

మనం కొన్ని చేష్టలు మానుకొందాం

మనం కొన్ని చేష్టలు మానుకొందాం

దీప్తి సునైన రాకపోవడం గురించి షణ్ముఖ్ మాట్లాడుతూ.. ఆమె రాకపోతే నేను ఫీలయ్యానా? నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వెళ్లి మాట్లాడుకోలేవా? అని అన్నాడు. ఇకనైనా మనం కొన్ని మానుకోవాలి. అన్నీ చేస్తే దరిద్రంగా ఉంటుంది. దాంతో మీ పార్ట్‌నర్స్ మీద మీకు నమ్మకం ఉండాలి. అవగాహన ఉండాలి అని యాంకర్ రవి అన్నాడు. దాంతో మనం మన క్యారెక్టర్లు ఇప్పటికైనా మార్చుకొందాం అని సిరి అంటే.. క్యారెక్టర్లు మార్చుకోవద్దు అంటూ షణ్ముఖ్ సలహా ఇచ్చాడు.

మీ మదర్ క్లియర్‌గా స్టేట్‌మెంట్ షణ్ముఖ్

మీ మదర్ క్లియర్‌గా స్టేట్‌మెంట్ షణ్ముఖ్


అయితే ముద్దులు, కౌగిలింతలు పెట్టుకోవద్దు అంటూ సిరి హన్మంతు తల్లి చెప్పిన మాటలను షణ్ముఖ్ చెబుతూ.. మీ మదర్ క్లియర్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చింది. అంతకు మించి ఏమీ చెప్పలేరు అని షణ్ముఖ్ అన్నాడు. ఆ తర్వాత పింకి మీద టాపిక్ వారి మధ్య నడిచింది. ఇక నుంచి మానస్, వీజే సన్నీతో ప్రియాంక కూర్చోదు. వాళ్ల అమ్మ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆమె వెళ్తూ నాలుగైదు సార్లు సారీ చెప్పింది అంటూ షణ్ముక్ అన్నాడు.

మానస్ పాట గురించి షన్ను

మానస్ పాట గురించి షన్ను

ఇక మానస్ తల్లి వచ్చిపోయిన తర్వాత ఆయన అదో రకంగా ఉన్నాడు. అమ్మా లేదు.. నాన్న లేదు అంటూ ఒంటరిగా పాటలు పాడుకొంటున్నాడు. నేను కూడా ఆ పాటను పాడుతూ కనిపించాను అని షణ్ముఖ్ అన్నాడు. ఇక నుంచి ఆయనతో కూర్చుంటాను. వద్దన్నా వెళ్లి ఒళ్లో కూర్చుంటానని చెబుతాను అని షణ్ముక్ అంటూ కనిపించాడు.

Recommended Video

Bigg Boss Telugu 5 : Siri తల్లి ఇచ్చిన వార్నింగ్ కి కంటతడి పెట్టుకున్న Shanmukh || Filmibeat Telugu
ప్రియాంక ఎలిమినేట్ అవుతుందా?

ప్రియాంక ఎలిమినేట్ అవుతుందా?

ఇదిలా ఉండగా, బిగ్‌బాస్‌లో 12వ వారం ఎలిమినేషన్ ప్రక్రియపై శనివారం (27వ తేదీ) క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇంటిలోని ఏడుగురు సభ్యులు నామినేషన్‌లో ఉన్నారు. ఈ వారం ప్రియాంక ఎలిమినేషన్ జోన్‌లో ఉంది. లేదంటే కాజల్ ఎలిమినేషన్‌ గురయ్యే అవకాశాలు లేకపోలేవు. టాప్ కంటెస్టెంట్లు అందరూ నామినేషన్‌లో ఉండటంతో ఎవరు బయటకు వెళ్తారనే విషయం ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X