Bigg Boss Telugu 5లో కీలక మార్పులు.. అంత దాకా తెచ్చుకోకుండా, అలా ప్లాన్!

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్న విషయం ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అని చెప్పక తప్పదు. భారతదేశంలో మొట్టమొదట గా హిందీ లో మొదలైన ఈ బిగ్ బాస్ అక్కడ మంచి క్రేజ్ తెచ్చుకుంది ఇప్పటికే చాలా షోలు పూర్తి చేసుకుంది. తెలుగులో కూడా ఈ బిగ్ బాస్ ఎంటర్ కావడమే కాక ఇప్పటికే దాదాపు నాలుగు సీజన్లలో విజయవంతంగా పూర్తి అయ్యాయి.. ఈ ఏడాది బిగ్ బాస్ ఐదో సీజన్ జరగాల్సి ఉంది. అయితే ఈ సీజన్ మీద కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడేటట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. నిజానికి తెలుగులో సీజన్ ఫోర్ మీద కరోనా ఎఫెక్ట్ గట్టిగా పడుతుందని హౌస్ లో ఎవరో ఒకరికి కరోనా సోకడంతో ఇబ్బందులు పడే అవకాశం ఉందన్న ప్రచారం జరిగినా అలాంటిదేమీ లేకుండానే బయటపడ్డారు.. అయితే మిగతా అన్ని భాషల్లో మాత్రం గత ఏడాది కరోనా ఎఫెక్ట్ గట్టిగానే పడింది.

అయితే ఇప్పుడు కరోనాతో హెచ్చరికల నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ లు సహా అనేక మార్పులు చేర్పులు చేయడానికి ఆర్గనైజర్లు ఆలోచిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.. నిజానికి గత ఏడాది కన్నడ బిగ్ బాస్ షో విషయంలో పెద్ద రచ్చ జరిగింది. సగంలో షో రద్దు చేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు పంపించేశారు. అలాగే అలా ఇళ్ల కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత హౌస్ లోకి వచ్చి షో కంటిన్యూ చేయించి మమ అనిపించారు.. మలయాళం బిగ్ బాస్ షో కూడా దాదాపు ఇదే పరిస్థితి ఎదుర్కొన్న సంగతి మనం చూశాం. ఇక్కడ అయితే ఏకంగా మలయాళ బిగ్ బాస్ సెట్ తమిళనాడులో వేయడంతో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడం లేదని చెబుతూ మధ్యలో ఆపేసి మరీ ప్రాపర్టీ మొత్తాన్ని సీజ్ చేశారు.

 crucial changes in bigg boss telugu 5

అలా ఇన్ని హెచ్చరికల నేపథ్యంలో ఈ ఏడాది తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కి ఎవరూ ఊహించని విధంగా మార్పులు చేర్పులు చేస్తున్నారని అంటున్నారు. మరీ ముఖ్యంగా బయట వారితో నేరుగా కాంట్రాక్టు లేనివిధంగా ఈ షోను డిజైన్ చేస్తున్నారు అని అంటున్నారు. అలాగే గతంలో షోకి సంబంధించిన కెమెరామెన్ లు, ఎడిటర్లు కూడా బయటకు వెళ్ళి వచ్చేవారు కానీ ఈసారి వాళ్లను కూడా హౌస్ దగ్గర్లోనే నివాసం ఉంచేలా ఏర్పాట్లు చేయబోతున్నారని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఒక్కసారి షో మొదలైన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయటి నుంచి లోపలి వారికి సంబంధాలు లేకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. దీని మీద అయితే ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు కానీ ఎక్కడ షో నిలిపివేసే పరిస్థితులు మాత్రం తెచ్చుకోకుండా ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది నాగార్జున హోస్ట్ గా వ్యవహరించగా ఈసారి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటిదాకా వెలువడలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X