Bigg Boss Telugu 5 : హీరో అనిపించుకున్న విశ్వ.. లాక్ డౌన్ లో గడ్డు పరిస్థితులు..మరి ఎంత సంపాదించాడో తెలుసా?

ఎంతో ఆసక్తికరంగా సాగుతున్న బిగ్ బాస్ షో చూస్తుండగానే 9 వారాలు పూర్తి చేసుకుంది. తాజాగా తొమ్మిది వారాలు పూర్తి కావడంతో తొమ్మిది మంది హౌస్ నుంచి ఎలిమినేట్ అయినట్లు అయింది. చివరిగా 9 వారంలో విశ్వ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని హౌస్ మేట్స్ అందరూ అలాగే ప్రేక్షకులు కూడా భావిస్తున్న విశ్వ ఎలిమినేట్ కావడం మాత్రం కాస్త షాకింగ్ విషయం అనే చెప్పాలి. అయితే ఈ తొమ్మిది వారాలు హౌస్ లో ఉన్నందుకు గాను విశ్వ ఎంత ఛార్జ్ చేశాడు? ఆయన రెమ్యూనరేషన్ ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే

 తొమ్మిది మంది

తొమ్మిది మంది

బిగ్ బాస్ షో ఇప్పటికి తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు హౌస్ నుంచి తొమ్మిది మంది హౌస్ సభ్యులు ఎలిమినేట్ అయి బయటికి వెళ్లారు.. ముందు వారంలో సరయూ తర్వాత ఉమాదేవి, లహరి, నటరాజ మాస్టర్, హమీద, శ్వేతా వర్మ, ప్రియా, లోబో హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా తాజాగా జరిగిన 9వ వారం ఎలిమినేషన్ లో విశ్వ ఎలిమినేట్ అయ్యారు.

హీరో అనిపించుకున్న విశ్వ

హీరో అనిపించుకున్న విశ్వ

అంతకు ముందు రోజే హౌస్ లో హీరో అనిపించుకున్న విశ్వ హౌస్ నుంచి ఎలిమినేట్ కావడం హౌస్ సభ్యులకు అయితే మింగుడు పడలేదు. ఇక విశ్వా అభిమానులైతే ఇంకా షాక్ లోనే ఉన్నారని చెప్పాలి. అయితే ఏ టాస్క్ ఇచ్చినా తన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి అందరి కంటే ముందు అక్కడ నిలబడి పోయే విశ్వ ఎలిమినేట్ కావడంతో అసలు ఎలా అలా జరిగింది అందరూ బుర్ర బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి.

ఎలా అయింది?

ఎలా అయింది?

ఫిజికల్ టాస్క్ అయినా, ఏ టాస్క్ అయినా సరే ముందు నిలబడి పోయే విశ్వ అన్ని విషయాల్లోనూ తనకు ఎవరు సాటిరారు అనే విషయాన్ని చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు. మరి ఎలా జరిగిందో? ఏం జరిగిందో? తెలియదు గానీ విశ్వ హౌస్ నుంచి అయితే బయటకు వచ్చేసాడు. అయితే హౌస్ లోపల ఉన్న సమయంలో లాక్ డౌన్ లో ఎన్నో ఇబ్బందులు పడ్డ అని విశ్వా చాలాసార్లు చెప్పుకున్నాడు.

వారానికి ఎంత అంటే?

వారానికి ఎంత అంటే?

మరి అన్ని ఇబ్బందులు ఎదుర్కొని ఎట్టకేలకు బిగ్ బాస్ అవకాశం దక్కించుకుని హౌస్ లోకి వచ్చిన విశ్వ బిగ్ బాస్ వల్ల ఎంత సంపాదించాడు? అతను బయటకు వెళ్ళాక పరిస్థితి ఏమిటి అనే విషయం గురించి ఆరా తీస్తే ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. విశ్వ రెమ్యునరేషన్ విషయం గురించి మాట్లాడాలి అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మేరకు విశ్వకి వారానికి రెండున్నర లక్షల వరకు రెమ్యూనరేషన్ వస్తుందట.. కరెక్ట్ గా ఎంత అనేది క్లారిటీ లేదు కానీ తొమ్మిది వారాల కు గాను 22 లక్షల దాకా రావచ్చని అంచనా వేస్తున్నారు.

Recommended Video

Manchi Rojulochaie Movie Team Theatre Visit | Blockbuster Celebrations
ముందు చేయాల్సింది అదే

ముందు చేయాల్సింది అదే

అయితే ఇందులో టాక్స్ లు గట్రా కట్ అవుతాయి అనుకోండి అది వేరే విషయం. ఐతే బిగ్ బాస్ షో పూర్తయిన తర్వాత కొన్ని రోజుల పాటు పూర్తిగా ఇంటర్వ్యూల వరకే పరిమితమయ్యే హౌస్ మేట్స్ ఆ తర్వాత మాత్రం మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఉన్నారు. విశ్వ కూడా మంచి అవకాశాలు దక్కించుకుని ఫ్యూచర్ లో మరిన్ని ప్రాజెక్టుల తో ప్రేక్షకుల ముందుకు రావాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X