twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హౌస్ మొత్తాన్ని చెడుగుడు ఆడేసిన సన్నీ.. పాపం షన్ను కన్నింగ్ ప్లాన్ కి బలి!

    |

    బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ఆసక్తికరంగా జరుగుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి కాగా ఆరో వారం శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యింది. ఇప్పటి దాకా ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వరుసగా ఎలిమినేట్ అయ్యారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో జరిగిన ఏడో వారం నామినేషన్స్ మాంచి వాడీవేడిగా సాగాయి. ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారు? సన్నీ ఎక్కువగా ఎందుకు నామినేషన్లు చేశారు? అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

    Recommended Video

    Bigg Boss Telugu 5: డేంజర్ జోన్‌లో ఫిమేల్ కంటెస్టెంట్లు... తక్కువ ఓట్లు | VJ Sunny| Filmibeat Telugu
    మునుపెన్నడూ లేనివిధంగా

    మునుపెన్నడూ లేనివిధంగా

    గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ వారం నామినేషన్స్ ప్రక్రియను చాలా డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న సన్ని, జెస్సీ, శ్రీరామ్‌లు వేటగాళ్లుగా ఉంటారు. మిగతా అందరూ కోతులుగా ఉంటారు. వేటగాళ్లు ఒక డేరాలో ఉంటారు. బయట సేవ్ ట్రీకి మిగిలిన ఇంటి సభ్యుల ముఖాలు అతికించి ఉన్న కోతుల బొమ్మల్ని వేలాడదీశారు.

    వేటగాళ్లు ముగ్గురూ తమకు కేటాయించిన డేరాలో నుంచి బయటకు వచ్చి కోతుల్ని చంపి నామినేట్ చేయడం.. కోతుల లక్ష్యం వేటగాళ్లని ఒప్పించి వారిని చంపకుండా కాపాడుకోగలగడం. ఇతరుల్ని నామినేట్ చేసేట్టు చేయడం అంటూ కొత్త టాస్క్ ఆసక్తికరంగా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ముగ్గురు వేటగాళ్లలో ఎక్కువ సార్లు డేరా నుంచి బయటకు వచ్చి.. ఎక్కువ కోతుల్ని వేటాడి నామినేట్ చేసిన వేటగాడు సేవ్ అవుతాడు.

    మిగిలిన ఇద్దరూ వేటగాళ్లు నామినేట్ అవుతారని పేర్కొన్నారు. అలాగే జంగిల్ సౌండ్ వచ్చిన ప్రతి సారి సోఫా ఏరియాలో పెట్టిన రెండు అరటి పండ్లను పట్టుకోవాల్సి ఉంటుంది. ఏ ఇద్దరూ అయితే ఆ అరటి పండ్లను పట్టుకుంటారో వాళ్లు వేటగాడితో చర్చించి.. ఒకర్ని నామినేట్ అయ్యేలా ఒప్పించవచ్చు.

    సిరి రాక్షస ప్రయత్నం

    సిరి రాక్షస ప్రయత్నం

    అయితే మొదట జంగిల్ సౌండ్ రాగానే సిరి, షణ్ముఖ్‌లు అరటి పండ్లను పట్టుకునీ బయటకు రాగా ఫస్ట్ జబర్ రాగానే డేరా నుంచి ఫస్ట్ సన్నీ బయటకు వచ్చాడు. అయితే షణ్మఖ్ మాట్లాడుతూ నేను ఆనీ మాస్టర్ ను నామినేట్ చేయాలని అనుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. ఆమె తన నామినేట్ చేసిన విధానం తనకు నచ్చలేదని చెప్పి చెప్పుకొచ్చాడు.

    అయితే షణ్ముక్ ఏదైతే పేరు చెప్పాడో సిరి కూడా నేను ఆ వేరే అనుకున్నాను అని చెప్పడంతో ఆనీ మాస్టర్ నామినేట్ అయ్యింది. అలా అక్కడ సిరి అరటి పండు వేస్ట్ అయింది. ఆ తరువాత రెండో బజర్ మోగేసరికి అరటిపండ్లు సిరి, ఆనీమాస్టర్‌లు తీసుకోవడం ఆనీ మాస్టర్ సిరిని నామినేట్ చేస్తున్నట్టు చెప్పగా సిరి మానస్‌ని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. ఆనీ మాస్టర్ చెప్పిన రీజన్ బాగుందని సిరి చెప్పిన కారణం బాలేదని, అప్పుడు నేను కూడా ఉన్నానని సిరిని కూల్ చేసే ప్రయత్నం చేశాడు.

    ఆనీ మాస్టర్ కారణంతో సిరిని నామినేట్ చేశాడు. అయితే మూడో సారి కూడా సన్నీ డెన్‌లో నుంచి దూసుకుని బయటకు వచ్చాడు. మూడో సారి కూడా అరటి పండు కూడా సిరికే దక్కింది. అయితే ఎలాగూ నేను చెప్పిన వాళ్లని సన్నీ నామినేట్ చేయడని తన ఫ్రెండ్స్ ను సేవ్ చేసుకుంటున్నాడు అని రచ్చ మొదలు పెట్టింది.

    కాజల్ కే ఓటు

    కాజల్ కే ఓటు

    మళ్లీ అదే రీజన్‌తో మానస్‌ని నామినేట్ చేయమని సిరి కోరగా సిరితో పాటు కాజల్ అరటి పండుని అందుకుని.. ఆమె ప్రియని నామినేట్ చేసింది. సంచాలక్‌గా ఏం పీకారు అని అనడం నాకు నచ్చలేదని కాజల్ చెప్పడంతో.. సన్నీ సిరి నామినేషన్‌ని పట్టించుకోకుండా కాజల్ అభిప్రాయంతో సమ్మతించి ప్రియను నామినేట్ చేశాడు.

    అయితే సిరి సన్నీ మళ్లీ రిజెక్ట్ చేయడంతో వేటగాళ్లలో మిగిలిన ఇద్దరు ఎందుకు? కూర్చుని ఉండమను.. ఇప్పటికే సన్నీ మూడుసార్లు వచ్చాడు అని చెప్పి తన బ్యాచ్ దగ్గర ఆట మొదలు పెట్టింది. ఇక నాలుగోసారి కూడా డెన్ నుంచి సన్నీ బయటకు రాగా ఈసారి అరటి పళ్లు సిరి, ప్రియలకు దక్కాయి.

    రెచ్చిపోయిన రవి, ప్రియాంక

    రెచ్చిపోయిన రవి, ప్రియాంక

    అయితే సిరి తన అరటిపండుని ప్రియాంకకు ఇచ్చింది. ప్రియాంక తీసుకుని కాజల్‌ని నామినేట్ చేస్తూ కొన్ని కారణాలు చెప్పగా. రెండో అరటిపండు అందుకున్న ప్రియ కావాలని రవిని నామినేట్ చేస్తూ రవి సోఫాలో టవల్ ఆరేయడం నాకు నచ్చడం లేదని అత్యంత చెత్త రీజన్ చెప్పింది. అయితే ప్రియ.. కాజల్‌ని ప్రియాంకతో నామినేట్ చేయించాలనే ఇలాంటి చెత్త రీజన్ చెప్పడంతో సన్నీ కావాలని వారికి షాక్ ఇచ్చాడు.

    మీరు నాతో గేమ్స్ ఆడుతున్నారు కదా.. శ్వేతా వెళ్లిపోతూ తాను ఎంత పెయిన్ అనుభవించిందో చెప్పిందని అందుకే ప్రియ రీజన్‌ని యాక్సెప్ట్ చేసి రవిని తాను నామినేట్ చేస్తున్నట్టు చెప్పాడు సన్నీ. ఆమాట చెప్పగానే రవి, ప్రియాంకలకు కోపం వచ్చింది. ఇలాంటి చెత్త రీజన్స్‌కి నామినేట్ చేస్తారా? అని చిందులు ప్రియాంక ఫైర్ అవగా రవి కూడా శ్వేతకి నేను సారీ చెప్పాను.. ఇది నా లైఫ్‌రా.. ఇలాంటి వాటికి నామినేట్ చేస్తావా? శ్వేతా నా వల్ల నామినేట్ అయ్యిందా? ఆలోచించు అన్నట్టు చాలా బతిమలాడాడు.

    ప్రియాంక ఏమో మీరు సేఫ్ గేమ్ ఆడుతున్నారు అంటూ రచ్చ చేసింది. కానీ సన్నీ మాత్రం మీరు సిల్లీ రీజన్ ఇచ్చి నాతో గేమ్ ఆడాలనుకున్నారు.. అసలు గేమ్ నేను ఆడాను ఇది ఫైనల్ అని ప్రియకి ఇచ్చిపడేశాడు సన్నీ. అయితే ఇదంతా తన ప్లాన్ లో భాగమేనని తరువాత షణ్ముఖ్ వెల్లడించాడు.

    చెడుగుడు ఆడేశిన సన్నీ

    చెడుగుడు ఆడేశిన సన్నీ

    ఐదోసారి కూడా సిరికి అరటిపండు దక్కడంతో మళ్లీ తీసుకుని వెళ్లి ప్రియాంకకి ఇచ్చింది.. ప్రియాంక మళ్లీ కాజల్‌నే నామినేట్ చేసింది. రెండో అరటిపండు రవి అందుకుని కాజల్‌ని నామినేట్ చేయడంతో అతని చెప్పిన రీజన్‌ని వాలిడ్‌గా పరిగణిస్తూ కాజల్‌ని నామినేట్ చేశాడు. ఇక్కడ తాము కావాలనే సన్నీని ప్రవొక్ చేస్తే ప్రవొక్ అయ్యాడనే విషయాన్ని చెప్పిన షణ్ముఖ్, ఇప్పటిదాకా సన్నీ, మానస్ కలిసి ఆడారు అని, సన్నీ సింగిల్ గా ఆడితే ఇలాగే ఉంటుందని వెల్లడించాడు.

    అలా సన్నీ షణ్ముఖ్ అండ్ కో ఉచ్చులో పడ్డాడు. కానీ సన్నీకి ఆ క్లారిటీ ఉంది. ఇక ఏడోవారం నామినేషన్స్‌లో కాజల్, రవి, సిరి, ఆనీ, ప్రియలను డైరెక్ట్ గా నామినేషన్లు జరగగా సన్నీ కారణంగా శ్రీరామ్, జస్వంత్‌లు కూడా లిస్టులో నిలిచారు. వేటగాళ్లుగా ఉన్న శ్రీరామ్, జస్వంత్‌లు ఒక్కసారి కూడా డెన్ నుంచి బయటకు రాకపోవడంతో వారు నేరుగా నామినేట్ అయ్యారు. ఈ ఏడుగురితో పాటు సీక్రెట్ రూంలో ఉన్న లోబో హోస్ట్ ద్వారా నేరుగా నామినేట్ అయ్యాడు. దీంతో ఈవారం నామినేషన్స్‌లో 8 మంది నిలిచారు.

    English summary
    In Bigg Boss Telugu 5 7th week nominations vj sunny became highlight.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X