bigg Boss 5: కప్పు గెలవడంలో ఎలాంటి డౌట్ లేదు.. విన్నర్ నేనే.. మరోసారి తేల్చి చెప్పిన కంటెస్టెంట్

బిగ్ బాస్ లో అసలు ఆట మొదలైంది. సోమవారం నాటితో 100వ ఎపిసోడ్ లోకి అడుగు పెట్టిన బిగ్ బాస్ సీజన్ 5 చివరి అడుగులో ఉంది. అయితే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక రకాల కామెంట్స్ వేలువడుతున్నాయి. పబ్లిక్ పోల్స్ లలో కూడా ఎక్కువగా ఒక వ్యక్తి పేరు బలంగా వినిపిస్తోంది. అతను మరెవరో కాదు VJ సన్నీ. ప్రస్తుతం ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ లలో అతనికి ఎక్కువమంది మద్దతు ఇస్తున్నట్లు అనిపిస్తోంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కోసం ప్రస్తుతం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో సన్నీ ఆసక్తికరమైన విషయాన్ని చెప్పాడు.

తీవ్రంగా కష్టపడుతూనే..

తీవ్రంగా కష్టపడుతూనే..

జర్నలిస్టుగా మొదలైన అతని ప్రయాణం ఆ తరువాత అనేక రకాలుగా తిరిగి ఇప్పుడు బిగ్ బాస్ వరకు వచ్చింది. ఈ అవకాశంతో ఎలాగైనా తనను తాను ప్రపంచానికి విజేతగా చూపించుకోవాలని సన్నీ తీవ్రంగా కష్టపడుతూనే ఉన్నాడు. అసలైతే మధ్యలోనే అతను ఇంట్లో నుంచి వెళ్లిపోతాడాని అందరూ అనుకున్నారు. కానీ సన్నీ తన తెలివితో మొండి ధైర్యంతో అందరిని ఎదుర్కొంటు ముందుకు సాగారు.

ఏ రంగు మార్చకుండా

ఏ రంగు మార్చకుండా

ఇక మొదట్లో అతనితో స్నేహాంగా ఉన్నవారు ఆ తరువాత రంగులు మార్చి సన్నీ పై నిందలు మోపాలని చూశారు. కానీ అతను మాత్రం ఏ రంగు మార్చకుండా దైర్యంగా స్టాండ్ తీసుకున్నాడు. తన స్నేహితుల కోసం కూడా గట్టిగానే పోరాడాడు. ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అదే అతనికి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది.

నిందలు మోపే ప్రయత్నం

నిందలు మోపే ప్రయత్నం

మధ్యలో సిరి కారణంగా అతని క్యారెక్టర్ బ్యాడ్ అయ్యేది. ఎక్కడో టచ్ చేశాడని నిందలు మోపే ప్రయత్నం చేసింది. ఆ తరువాత విడియోల్ అతని తప్పేమీ లేదని తెలియడంతో అందరి మనసులను గెలగుకున్నాడు. ఆ విషయంలో సన్నికి అభిమానుల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభించింది.

బరాబర్‌ కప్పు ఇస్తా..'

బరాబర్‌ కప్పు ఇస్తా..'

ఇక అనుకున్నట్టు గానే టాప్ 5 లో నిలిచిన సన్నీ బిగ్ బాస్ టైటిల్ గెలుస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశాడు. బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ టాప్ 5లో సన్నీతో పాటు సిరి, మానస్‌, శ్రీరామ్‌, షణ్ను ఉన్నారు. ఇక గ్రాండ్‌ ఫినాలే కోసం అందరూ రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఇక మానస్‌- సన్నీ కప్పు గురించి మాట్లాడుకున్నారు. టెన్షన్‌గా ఉంది, ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్‌ గెలవాలి, మా అమ్మకు గిఫ్ట్ గా ఇస్తరా బయ్‌.. ఇది ఫిక్స్‌.. ఏదైనా కానీ.. బరాబర్‌ కప్పు ఇస్తా..' అని తేల్చి చెప్పారు.

Recommended Video

Harnaaz Sandhu Miss Universe 2021 Journey || Filmibeat Telugu
బిగ్ బాస్ సర్‌ప్రైజ్‌

బిగ్ బాస్ సర్‌ప్రైజ్‌

ఇక బిగ్ బాస్ అందరి జర్నీని ఒకసారి గుర్తు చేస్తూ వారి పోరాట పటిమ గురించి చెప్పేందుకు రెడీ అయ్యాడు. ముందుగా ఫస్ట్‌ ఫైనలిస్టు శ్రీరామ్‌ నిలువుగా అతన్ని బిగ్ బాస్ సర్‌ప్రైజ్‌ చేశాడు. గార్డెన్‌ ఏరియాలోకి వచ్చిన అనంతరం ఇప్పటివరకు జరిగిన పరిణామాలను అలాగే టాస్కుల తాలూకు వస్తువులను జ్ఞాపకాలను గుర్తు చేసి ఎమోషనల్ సీన్స్ ను క్రియేట్ చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X