Bigg Boss: షణ్ముఖ్‌ ఓట్ల కోసమే సిరి ఎలిమినేషన్ డ్రామా.. వామ్మో దీని వెనుక ఇంత ప్లాన్ జరిగిందా!

బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూ.. భారీ టీఆర్పీతో నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. దేశ వ్యాప్తంగా చాలా భాషల్లో ప్రసారం అవుతోన్నా.. తెలుగులో వచ్చేది మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్‌ను అందుకుంటోంది. ఫలితంగా నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే మొదలైన ఐదో సీజన్ కూడా అదే రీతిలో సాగుతూ ముగింపు దశకు చేరుకుంది.

ప్రస్తుతం జరుగుతోన్న ఫినాలే వీక్‌లో ఐదుగురు కంటెస్టెంట్లు విజయం సాధించాలని పాటు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిరి హన్మంత్‌తో ఎలిమినేషన్ డ్రామా ఆడారు నిర్వహకులు. ఈ నేపథ్యంలో తాజా ఎపిసోడ్‌లో జరిగిన వ్యవహారంపై సన్నీ ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు మీకోసం!

టాప్ - 5 కంటెస్టెంట్ల మధ్య పోటీ

టాప్ - 5 కంటెస్టెంట్ల మధ్య పోటీ

భారీ అంచనాల నడుమ ప్రారంభమైన ఐదో సీజన్‌లోకి ఏకంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరిలో వారానికి ఒకరు చొప్పున ఇప్పటి వరకూ 14 వారాలకు 14 మంది ఎలిమినేట్ అయిపోయారు. దీంతో మిగిలిన ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. అందులో శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, షణ్ముఖ్ జస్వంత్, మానస్, సిరి హన్మంత్‌లు టైటిల్ కోసం పోటీ పడ్డారు.

గ్రాండ్ ఫినాలేకు ముందు కొత్తగా

గ్రాండ్ ఫినాలేకు ముందు కొత్తగా

ఐదో సీజన్‌లో ప్రస్తుతం ఫినాలే వీక్ జరుగుతుంది. దీంతో ఈ వారం మొత్తం కంటెస్టెంట్లు సరదాగా గడిపేలా ప్లాన్ చేశారు. అదే సమయంలో, గ్రాండ్ ఫినాలే వరకూ ఏదో ఒక సర్‌ప్రైజ్ ఉంటూనే ఉంటుంది. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లో సైతం ఎన్నో సరికొత్త ప్లాన్లతో నిర్వహకులు సందడి చేస్తున్నారు. దీంతో ప్రేక్షకుల కావాల్సిన మజా ఈ వారం రోజుల్లోనే దొరికిందని చెప్పాలి.

జర్నీ వీడియోలు.. ఫొటో స్టోరీలు

జర్నీ వీడియోలు.. ఫొటో స్టోరీలు

మొదటి సీజన్ నుంచే ఫినాలేకు చేరుకున్న కంటెస్టెంట్లకు వాళ్ల వాళ్ల జర్నీ వీడియోలను చూపిస్తూ ఉంటారు. గతంలో మాదిరిగానే ఈ సీజన్‌లో సైతం ఫినాలే కంటెస్టెంట్లకు వాటిని చూపించారు. మూడు ఎపిసోడ్లలోనూ ఇదే చూపించింది బిగ్ బాస్ యూనిట్. ఆ తర్వాత రెండు ఫొటోలను ఎంచుకుని ఒకదాని గురించి మిగిలిన వాళ్లతో పంచుకునే టాస్క్ కూడా ఇచ్చేశారు.

టాస్కుల రీ క్రియేట్‌తో గొడవలు

టాస్కుల రీ క్రియేట్‌తో గొడవలు

బిగ్ బాస్ ఫినాలే వీక్‌లో భాగంగా గతంలో జరిగిన ఐదు టాస్కులను ప్రస్తుతం హౌస్‌లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్లతో ఆడించారు. అంతేకాదు, వీటిలో గెలిచిన వాళ్లకు స్పెషల్ గిప్టులు ఇస్తామని కూడా వెల్లడించారు. ఇవి సరదాగా జరిగిన టాస్కులే అయినా కంటెస్టెంట్లు అందరూ పోటాపోటీగా ఆడారు. ఈ క్రమంలోనే సిరి హన్మంత్, సన్నీ మధ్య తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది.

సిరి హన్మంత్ ఫేక్ ఎలిమినేషన్

సిరి హన్మంత్ ఫేక్ ఎలిమినేషన్

అంతకు ముందు ఎపిసోడ్‌లో గొడవ జరగడంతో నిన్న అంతా కంటెస్టెంట్లు ఎడముఖం పెడముఖంలా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సిరి హన్మంత్‌ను ఫేక్ ఎలిమినేట్ చేశారు నిర్వహకులు. దీంతో షణ్ముఖ్ జస్వంత్ ఎంతగానో ఏడ్చేశాడు. ఆ తర్వాత ఆమెను కాసేపు కన్ఫెషన్ రూమ్‌లో ఉంచిన నిర్వహకులు.. తిరిగి ఇంట్లోకి పంపించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సిరి ఎలిమినేషన్‌పై సందేహాలు

సిరి ఎలిమినేషన్‌పై సందేహాలు

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో సిరి హన్మంత్‌ను ఫేక్ ఎలిమినేషన్ చేయడంపై సన్నీ ఫ్యాన్స్‌తో పాటు కొందరు నెటిజన్లు తప్పుబడుతూ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 'సిరిని కంటెస్టెంట్లకు దూరంగా సీక్రెట్ రూమ్‌లోకి తీసుకెళ్లి కొన్ని సీక్రెట్స్ చెప్పినట్లు ఉన్నారు. అందుకే ఆమెను ఫేక్ ఎలిమినేట్ చేశారేమో. ఇప్పుడు ఎవరూ నమ్మరు' అంటూ కొందరు పోస్ట్ చేశారు.

Recommended Video

Vj Sunny Is Unstoppable | Bigg Boss Telugu 5 Grand Finale || Filmibeat Telugu
షణ్ముఖ్‌పై సింపతీ పెరగడానికే

షణ్ముఖ్‌పై సింపతీ పెరగడానికే

మరోవైపు, సిరి హన్మంత్ ఎలిమినేషన్‌తో షణ్ముఖ్‌పై సింపతీ పెంచే ప్రయత్నాలు చేశారని బిగ్ బాస్‌పై కొందరు ఆరోపిస్తున్నారు. 'చివరి రోజు ప్రోమో వదిలినప్పటి నుంచి షన్నూకు సానుభూతి పెంచి, ఓట్లు ఎక్కువగా వేయించాలని బిగ్ బాస్ ప్లాన్ చేసినట్లు డౌట్ వస్తుంది. సిరి లాస్ట్‌లో ఉందని, ఆమె ఫ్యాన్స్ కూడా షన్నూకు ఓట్లు వేసే అవకాశం కూడా ఉంది' అని మరికొందరు అభిప్రాయాలు వక్యం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X