Bigg Boss: షోలోకి హమీదా రీఎంట్రీ.. గాయాలున్నా శ్రీరామ్ హగ్గులు ముద్దులు.. వీడియో షేర్ చేయడంతో!
పాశ్చత్య సంస్కృతికి అద్దం పడుతూ సాగే షోనే అయినా.. ఊహించని రీతిలో ప్రేక్షకాదరణను అందుకుని దూసుకెళ్తోంది బిగ్ బాస్. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్‌ను ప్రసారం చేస్తూ నిర్వహకులు మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ప్రతి సీజన్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక, ఇప్పుడు నడుస్తోన్న ఐదో సీజన్ కూడా అదే రీతిలో సాగుతోంది. ఇప్పుడిది చివరి దశకు చేరుకోవడంతో మరింత ఆసక్తికరంగా సాగుతోంది. అదే సమయంలో షోలో సరికొత్త పరిణామాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్‌లోకి హమీదా రీఎంట్రీ ఇచ్చింది. దీంతో శ్రీరామ్‌కు ఎక్కడలేని హుషారు వచ్చేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

ఫినాలేకు చేరువ కావడంతో ఆసక్తిగా
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఐదో సీజన్ ఆరంభం నుంచే ఆదరణను అందుకుంటోంది. మధ్యలో కొంచెం స్లో అయినప్పటికీ.. మళ్లీ చిన్నగా పుంజుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చివరి అంకానికి చేరడంతో షో ఆసక్తికరంగా సాగుతోంది. అందుకు అనుగుణంగానే షో నిర్వహకులు సరికొత్త టాస్కులు ఇస్తున్నారు. దీంతో చివర్లో కూడా మరింత రంజుగా సాగుతోంది.

టాప్ 5 గురించే మాట్లాడుతున్నారు
వచ్చే వారం నుంచి బిగ్ బాస్ ఐదో సీజన్ ఫినాలే వీక్ జరగనుంది. దీనికి ఐదుగురు మాత్రమే అర్హత సాధిస్తారు. ఇప్పుడు హౌస్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. అందులో 'టికెట్ టు ఫినాలే' టాస్కులో శ్రీరామ చంద్ర విజయం సాధించి ఫినాలేకు అర్హత సాధించాడు. మిగిలిన ఐదుగురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అవుతారు. మిగిలిన వాళ్లు ఫినాలేకు చేరుకుంటారు.

‘రోల్ ప్లే టాస్క్’తో బిగ్ బాస్ ప్లాన్
బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి వారం కావడంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు కంటెస్టెంట్లకు 'రోల్ ప్లే' టాస్క్‌ను ఇచ్చాడు బిగ్ బాస్. ఈ సీజన్‌లో హైలైట్ అయిన గొడవలకు సంబంధించిన సన్నివేశాలను ఇచ్చి.. అందులో ఎవరో ఒకరు తమకు నచ్చిన రోల్ చేయమని చెప్పాడు. ఇప్పటికే కంటెస్టెంట్లు 'అప్పడం', 'మానస్ పింకీ' రోల్స్‌ను ప్లే చేసి నవ్వించారు.

బిగ్ బాస్ షోలోకి హమీదా రీఎంట్రీ
తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో 'రోల్ ప్లే' టాస్కులో భాగంగా కంటెస్టెంట్లకు శ్రీరామ్ - జెస్సీ మధ్య జరిగిన గొడవను రీ క్రియేట్ చేయాలని చెప్పాడు. ఇందులో శ్రీరామ్ పాత్రను షణ్ముఖ్ చేయగా.. మిగిలిన వాళ్లు తలా ఒక రోల్‌ను తీసుకున్నారు. ఇక, వీజే సన్నీ అయితే ఏకంగా హమీదాలా గెటప్ వేసుకుని వచ్చాడు. దీంతో ఆమె షోలోకి రీఎంట్రీ ఇచ్చిందా అన్నట్లుగా యాక్టింగ్ చేశాడు.

శ్రీరామ చంద్ర హగ్గులు ముద్దులతో
వీజే సన్నీ హమీదా గెటప్ వేసుకున్నప్పటి నుంచి ఆమెను అనుకరించే ప్రయత్నం చేశాడు. నడవడికలోనే కాదు.. మాటతీరులోనూ ఆమెను దించేశాడు. ఇక, టాస్క్ మొదలయ్యే ముందు ఆ గెటప్ చూసిన శ్రీరామ చంద్ర కాళ్లకు గాయాలున్నా పట్టించుకోకుండా సన్నీ దగ్గరకు వచ్చాడు. అంతేకాదు, 'మిస్ యూ హమీదా' అంటూ హగ్ చేసుకుని ముద్దులు కూడా పెట్టేశాడు.

అలా అందరికీ షాకిచ్చిన వీజే సన్నీ
హమీదా గెటప్ వేసుకున్న సన్నీ.. తనదైన శైలితో అందరినీ అలరించాడు. మరీ ముఖ్యంగా అచ్చం ఆమెలాగే మాట్లాడేందుకు తెగ ప్రయత్నించాడు. అలాగే హావభావాలను కూడా చక్కగా పలికించాడు. దీంతో నిన్నటి ఎపిసోడ్‌లో అతడు బాగా హైలైట్ అయ్యాడు. ఇక, సన్నీ పెర్ఫార్మెన్స్‌తో హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లే కాదు.. ప్రేక్షకులు కూడా షాక్ అయిపోయారనే చెప్పాలి.
Recommended Video

ఆ వీడియోను షేర్ చేసిన హమీదా
రోల్ ప్లే టాస్కులో భాగంగా వీజే సన్నీ.. హమీదా పాత్రను అనుకరించడం హైలైట్ అయింది. దీంతో స్వయంగా దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ను హమీదానే తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. శ్రీరామ చంద్ర వచ్చి హగ్ చేసుకుని ముద్దు పెట్టే సన్నివేశాలు అందులో కనిపించాయి. దీనికి సోషల్ మీడియాలో భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఇది వైరల్ అయిపోయింది.


Click it and Unblock the Notifications











