Bigg Boss: షోలో దారుణమైన సంఘటన.. ఆనీ మాస్టర్‌పై నోరు జారిన సన్నీ.. ఒకేసారి అంత మాట అనడంతో!

అసలు తెలుగులో బిగ్ బాస్ సక్సెస్ అవుతుందా? ఇలాంటి కంటెంట్‌ను ఇక్కడి ప్రేక్షకులు ఇష్టపడతారా? ఇలాంటి అనుమానాలతో మన బుల్లితెరపైకి వచ్చింది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అవుతూ.. ఎప్పటికప్పుడూ సరికొత్త టాస్కులను తీసుకొస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాన్స్ ఇలా అన్నీ చూపిస్తూ భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది.

తద్వారా నేషనల్ లెవెల్‌లో భారీ రేటింగ్ అందుకున్న కార్యక్రమంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక, ఐదో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ షోలో దారుణ సంఘటన జరిగింది. ఆ వివరాలు మీకోసం!

మరింత పెంచేందుకు సరికొత్త ప్లాన్లు

మరింత పెంచేందుకు సరికొత్త ప్లాన్లు

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్‌కు మాత్రమే భారీ రేటింగ్ వస్తుంది. దీంతో ఐదో సీజన్‌పై అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. అందుకు అనుగుణంగానే ఐదింతల ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని నిర్వహకులు చెప్పారు. ఇందులో భాగంగానే 19 మంది కంటెస్టెంట్లను దింపడంతో పాటు ఆరంభంలోనే గొడవలు, బూతులు, రొమాన్స్ ఇలా పలు రకాలుగా మజాను పంచారు. దీంతో ప్రారంభ ఎపిసోడ్‌కు 18 రేటింగ్ వచ్చింది. ఈ ఉత్సాహంతోనే షోను మరింత రంజుగా మార్చుతూ నిర్వహకులు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇది కూడా గతంలో వాటిలానే సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది.

సాదాసీదా వచ్చి సత్తాను నిరూపించి

సాదాసీదా వచ్చి సత్తాను నిరూపించి

ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన ఐదో సీజన్‌లోకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్‌ అయ్యారు. వారిలో వీజే సన్నీ ఒకడు. సాదాసీదా కంటెస్టెంట్‌లా ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఆరంభంలోనే బాగా హైలైట్ అయ్యాడు. ఫలితంగా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అతడు.. అద్భుతమైన ఆటతో సత్తా నిరూపించుకున్నాడు.

ఎప్పుడూ గొడవలే.. అందరికీ టార్గెట్

ఎప్పుడూ గొడవలే.. అందరికీ టార్గెట్

ప్రస్తుతం జరుగుతోన్న బిగ్ బాస్ సీజన్‌లో ఉన్న కంటెస్టెంట్లు అందరిలో వీజే సన్నీకి కోపం ఎక్కువ అన్న విషయం తెలిసిందే. అందుకే అతడు తరచూ గొడవల్లో భాగం అవుతున్నాడు. మరీ ముఖ్యంగా సిరి హన్మంత్, ప్రియతో జరిగిన గొడవల్లో అతడు హద్దు మీరినట్లు కనిపించాడు. దీంతో హౌస్‌లో చాలా మంది ఈ కంటెస్టెంట్‌ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో పలుమార్లు నామినేషన్స్‌లోకి కూడా వెళ్లాడు. అయితే, నిజాయితీగా ఉండడంతో పాటు తప్పులు సరిదిద్దుకుంటున్నాడు. దీంతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూ ఎలిమినేషన్ అధిగమిస్తున్నాడు.

వరస్ట్ పెర్ఫార్మర్‌.. రెండోసారి జైలుకు

వరస్ట్ పెర్ఫార్మర్‌.. రెండోసారి జైలుకు

గత వారానికి సంబంధించి వరస్ట్ పెర్ఫార్మర్లను ఎంచుకునే ప్రక్రియలో వీజే సన్నీ.. జెస్సీ చేతిలో ఉన్న బ్యాగ్‌ను తన్నాడని, కోపంగా వ్యవహరించాడని పలువురు అతడిని నామినేట్ చేశారు. అంతే మంది కాజల్‌కు కూడా ఓటు వేశారు. దీంతో మరో గొడవ జరిగింది. అప్పుడు సన్నీ కూడా సిరి కత్తి పట్టుకుని వచ్చిన విషయాన్ని గుర్తు చేసి గొడవ చేశాడు. కాజల్‌కు, సన్నీకి చెరో మూడు ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరిలో ఎవరు వరస్ట్‌ అన్నది కెప్టెన్ తేల్చాలని బిగ్ బాస్ చెప్పడంతో అతడు సన్నీ పేరు సూచించాడు. తర్వాత ఆనీ తన ఓటును సన్నీకి వేయడంతో జైలుకెళ్లాడు.

పూరీల టాస్కులో రచ్చ జరగడంతో

పూరీల టాస్కులో రచ్చ జరగడంతో

ఈ వారం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ పూరీల టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఆనీ, శ్రీరామ్, లోబో, విశ్వ, రవి, శ్రీరామ్‌లు ఒక టీమ్‌గా.. జెస్సీ, కాజల్, ప్రియాంక, మానస్, సిరిలు రెండో జట్టుగా విడిపోయారు. ఇక, దీనికి సంచాలకుడిగా హౌస్ కెప్టెన్ షణ్ముఖ్ జస్వంత్ ఉన్నాడు. ఈ టాస్కులో భాగంగా ఒక టీమ్ 50 పూరీలు చేయాల్సి ఉండగా.. కాజల్ టీం సభ్యులు తొందరగా కంప్లీట్ చేశారు. అయితే వాళ్లు తయారు చేసిన పూరీలు సరిగా లేవని చెప్పిన సంచాలకుడు.. ఆనీ మాస్టర్ జట్టును విజేతగా ప్రకటించాడు. దీంతో పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. ఇందులోకి సన్నీ కూడా ఎంటర్ అయ్యాడు.

సన్నీ వర్సెస్ ఆనీ.. నోరు జారాడుగా

సన్నీ వర్సెస్ ఆనీ.. నోరు జారాడుగా

ఆనీ మాస్టర్ టీమ్‌ను షణ్ముఖ్ విజేతగా ప్రకటించడంతో జైలులో ఉన్న సన్నీ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో సంచాలకుడికి అతడికి కాసేపు వాగ్వాదం జరిగింది. అప్పుడు ఆనీ మాస్టర్ ఎంట్రీ ఇచ్చి స్నేహితులు ఉన్నారని అలా మాట్లాడొద్దు అని సన్నీకి సూచించింది. అప్పుడతను 'ఈమెకు తెలుగు సరిగా అర్థం కాదనుకుంటా నేర్పించండి. నార్త్ ఇండియాలో చపాతీ ఫేమస్ మాస్టర్' అంటూ ఆనీ మాస్టర్‌ను ఉద్దేశించి నోరు జారాడు. దీనికి ఆమె 'నేను పుట్టింది తెలంగాణలో.. నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఏంటి? ఇదంతా ఇండియా' అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయింది.

నాగార్జునతో చీవాట్లు తిన్న సన్నీ

నాగార్జునతో చీవాట్లు తిన్న సన్నీ

ఆనీ మాస్టర్‌ను ఉద్దేశించి సన్నీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఓ రియాలిటీ షోలో ప్రాంతీయ విభేదాలు చూపించడం ఏంటని చాలా మంది అంటున్నారు. ఇది చాలా దారుణం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం జరిగిన ఎపిసోడ్‌లో హోస్ట్ అక్కినేని నాగార్జున దీనిపై స్పందించారు. ఏకంగా సన్నీ ఫొటోను చింపేసి అతడిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. షో అంటే అందరూ సమానమేనని.. ప్రాంతీయ విధ్వేషాలు రెచ్చగొట్టొద్దని అతడిని సూచించారు. దీంతో తన తప్పు తెలుసుకున్న సన్నీ ఇకపై అలా చేయనని చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X