Bigg Boss: షో చరిత్రలో ఇలా జరగడం తొలిసారి.. టాప్ కంటెస్టెంట్ చెత్త రికార్డు.. ఆమె వల్లే ఇలా!
అంతకు ముందెన్నడూ చూడని కాన్సెప్టుతో ప్రసారం అవుతూ.. ఎప్పటికప్పుడూ సరికొత్త టాస్కులను తీసుకొస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. గ్రూపు తగాదాలు.. ప్రేమ కహానీలు.. అప్పుడప్పుడూ రొమాన్స్ వీటన్నింటి చూపిస్తూ భారీ స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటోంది. తద్వారా జాతీయ బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకున్న కార్యక్రమంగా రికార్డులు క్రియేట్ చేసింది. ఇక, ఇటీవలే మొదలైన ఐదో సీజన్ కూడా ఆసక్తికరంగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బాస్ షోలో ఊహించని పరిణామం జరిగింది. దీంతో ఓ కంటెస్టెంట్ పేరిట చెత్త రికార్డు నమోదైంది. ఆ వివరాలు మీకోసం!
Photo Courtesy: Star మా and Disney+Hotstar

గతంలో వాటికి మించేలా కంటెంట్
తెలుగులో నాలుగు సీజన్లు ఒకదానికి మించి ఒకటి సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఎన్నో అంచనాల నడుమ ఇటీవలే ఐదో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు అంగరంగ వైభవంగా మొదలు పెట్టారు. ఇప్పుడు పాత సీజన్లను మరిపించేలా కొత్తగా మొదలైన దానిలో సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ప్రేక్షకులకు మరింత మజాను పంచుతూ ఆసక్తికరంగా నడిపిస్తున్నారు.

అంచనాలు లేకుండా వచ్చి సత్తాతో
తాజా సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో ఎక్కువ మంది పాపులర్ అయిన వాళ్లే ఉన్నారు. తమ తమ విభాగాల్లో పలువురు మంచి గుర్తింపును దక్కించుకున్న వాళ్లు వచ్చారు. అందులో కొందరు మాత్రమే స్పెషల్ అట్రాక్షన్ అయ్యారు. వారిలో వీజే సన్నీ ఒకడు. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన అతడు.. అద్భుతమైన ఆటతో సత్తా చాటుతున్నాడు.

తరచూ గొడవలు.. టార్గెట్ చేస్తూనే
వీజే సన్నీకి కోపం ఎక్కువ అన్న విషయం తెలిసిందే. అందుకే అతడు తరచూ గొడవల్లో భాగం అవుతున్నాడు. చాలా మంది ఈ కంటెస్టెంట్‌ను టార్గెట్ చేస్తున్నారు. దీంతో పలుమార్లు నామినేషన్స్‌లోకి కూడా వెళ్లాడు. అయితే, నిజాయితీగా ఉండడంతో పాటు తప్పులు సరిదిద్దుకుంటున్నాడు. దీంతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటూ ఎలిమినేషన్ తప్పించుకుంటున్నాడు.

కెప్టెన్సీ టాస్కులో వాళ్లతో గొడవలు
'వెంటాడు.. వేటాడు' టాస్కుకు జెస్సీని సంచాలకుడిగా నియమించాడు బిగ్ బాస్. ఇక, ఇది జరుగుతోన్న సమయంలో మొదట సన్నీ, శ్రీరామ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆ తర్వాత మానస్ విషయంలో జెస్సీ తీసుకున్న నిర్ణయంతో అతడిపై సన్నీ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యాడు. అంతేకాదు, అక్కడే ఉన్న థర్మాకోల్ బ్యాగ్‌ను కాలితో ఎగిరి తన్నడంతో మరో గొడవ జరిగింది.

వరస్ట్ పెర్ఫార్మర్‌గా ఎంచుకోవడం
ఎనిమిదో వారానికి సంబంధించి చెత్త కంటెస్టెంట్లను ఎంచుకునే ప్రక్రియ శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది. ఇందులో వీజే సన్నీ బ్యాగ్‌ను తన్నాడని, కోపంగా వ్యవహరించాడని పలువురు అతడిని నామినేట్ చేశారు. అంతే మంది కాజల్‌కు కూడా ఓటు వేశారు. దీంతో మరో గొడవ జరిగింది. అప్పుడు సన్నీ కూడా సిరి కత్తి పట్టుకుని వచ్చిన విషయాన్ని గుర్తు చేసి గొడవ చేశాడు.

ఆమె యూటర్న్.. జైలు పాలైన సన్నీ
కాజల్‌కు, సన్నీకి చెరో మూడు ఓట్లు వచ్చాయి. దీంతో ఇద్దరిలో ఎవరు వరస్ట్ అన్నది కెప్టెన్ తేల్చాలని బిగ్ బాస్ చెప్పడంతో అతడు సన్నీ పేరు సూచించాడు. ఆ సమయంలో వాళ్లిద్దరికీ పెద్ద గొడవ జరిగింది. దీంతో మొదట ప్రియాంక సింగ్‌కు ఓటు వేసిన ఆనీ మాస్టర్.. తన నిర్ణయాన్ని మార్చుకుని సన్నీ పేరు చెప్పింది. దీంతో అతడు వరస్ట్ పెర్ఫార్మర్ అవడంతో జైలుకు వెళ్లాడు.

వీజే సన్నీ చెత్త రికార్డు.. జెస్సీ కూడా
ఎనిమిదో వారానికి సంబంధించి చెత్త కంటెస్టెంట్‌గా ఎంపికై జైలు పాలైన సన్నీ పేరిట ఓ అవసరం లేని రికార్డు నమోదైంది. ఒకే సీజన్‌లో రెండు సార్లు జైలుకు వెళ్లిన కంటెస్టెంట్‌గా అతడు నిలిచాడు. గతంలో ఇలాగే జెస్సీ కూడా రెండు సార్లు జైలుకు వెళ్లాడు. దీంతో ఒకే సీజన్‌లో ఇద్దరు వరస్ట్ పెర్ఫార్మర్లుగా ఎంపిక అయినట్లైంది. బిగ్ బాస్ షో చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు.


Click it and Unblock the Notifications











