twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss: సన్నీని ఇరికించిన బెస్ట్ ఫ్రెండ్.. ఆ పవర్ వచ్చినా సంతోషం లేకుండా.. పాపం మరీ దారుణంగా!

    |

    ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల కార్యక్రమాలు పరిచయం అయ్యాయి. అయితే, అందులో కొన్నింటిని మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ షో ఒకటి. పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి భారీ రెస్పాన్స్ దక్కింది. అందుకే మన షో జాతీయ స్థాయిలో గుర్తింపును అందుకుంది. ఈ ఉత్సాహంతోనే నిర్వహకులు సీజన్ల మీద సీజన్లను పూర్తి చేస్తున్నారు.

    ఈ క్రమంలోనే ఇప్పుడు ఐదో సీజన్‌ను కూడా ఎంతో ఆసక్తికరంగా నడుపుతున్నారు. ఇక, ఈ సీజన్ చివరి దశకు చేరుకోవడంతో బిగ్ బాస్ విచిత్రమైన టాస్కులు ఇస్తున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో వీజే సన్నీకి ఓ పవర్ దక్కింది. అంతలోనే విమర్శలూ వచ్చాయి. ఆ వివరాలు మీకోసం!

    వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా

    వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా

    గతంలో తెలుగులో నాలుగు సీజన్లు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఐదో సీజన్ వాటికి మించిన రేటింగ్‌తో దూసుకుపోతోంది. ప్రీమియర్ ఎపిసోడ్‌ నుంచే రికార్డు స్థాయి స్పందనను అందుకుంటోన్న ఈ సీజన్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో నిర్వహకులు కూడా ప్రేక్షకులకు నచ్చే అంశాలనే ఎక్కువగా ఫోకస్ చేసి చూపిస్తున్నారు.

    మరీ ముఖ్యంగా గొడవలు, లవ్ ట్రాకులు, రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఊహించని కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నారు. దీంతో వారం రోజులతో పాటు వారంతాల్లోనూ మంచి స్పందనను అందుకుంటూ సాగుతోంది.

    లవర్‌తో కలిసున్న ఫొటో లీక్ చేసిన శృతి హాసన్: అతడు అడగ్గానే అంత పని చేసేసిన బ్యూటీలవర్‌తో కలిసున్న ఫొటో లీక్ చేసిన శృతి హాసన్: అతడు అడగ్గానే అంత పని చేసేసిన బ్యూటీ

    ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ సరికొత్తగా

    ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ సరికొత్తగా

    ఈ వారం చివర్లో ఇంట్లో ఉన్న సభ్యులందరికీ 'ఎవిక్షన్ ఫ్రీ పాస్' టాస్కును ఇచ్చాడు బిగ్ బాస్. దీనికి 'నిప్పులే శ్వాసగా.. గుండెలో ఆశగా' అనే పేరు పెట్టారు. దీని ప్రకారం.. బజర్‌ మోగిన వెంటనే ఎవరైనా ఇద్దరు ఇంటి సభ్యులు వెళ్లి.. ఫైర్‌ ఇంజిన్‌ వ్యాన్‌లో కూర్చోవాలి. వాళ్లకు ఎదురుగా ఇద్దరు కంటెస్టెంట్ల ఫొటోలు ఉంటాయి. అందులో నుంచి ఒక దాన్ని నిప్పుల్లో కాల్చేయాలి. ఇందుకోసం వ్యాన్‌లో కూర్చున్న ఇద్దరు సభ్యులు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. అలా చివరి వరకూ ఎవరి ఫొటో కాలకుండా ఉంటుందో వాళ్లకే పాస్ సొంతం అవుతుందని చెప్పాడు.

    వాళ్లిద్దరు మాత్రమే పాస్ వద్దంటూ

    వాళ్లిద్దరు మాత్రమే పాస్ వద్దంటూ


    టాస్కులో భాగంగా మొదట ఫైర్ ఇంజ‌న్ అలార‌మ్ మోగ‌గా ర‌వి, ష‌ణ్ముఖ్ వ్యాన్ ఎక్కారు. వీరికి మాన‌స్‌, శ్రీరామ్‌ ఫొటోలు వ‌చ్చాయి. వీళ్లిద్దరూ కలిసి మాన‌స్ ఫొటోను మంట‌ల్లో కాల్చేశారు. తర్వాతి రౌండ్‌లో స‌న్నీ, మాన‌స్ వ్యాన్ ఎక్కారు. వీరికి ర‌వి, ఆనీ మాస్ట‌ర్ ఫొటోలు రాగా.. ఏకాభిప్రాయంతో ర‌వి ఫొటోను కాల్చేశారు. తర్వాత సిరి హన్మంత్, షణ్ముఖ్ జస్వంత్ వంతు వచ్చింది. వీళ్లిద్దరూ కలిసి సన్నీని సేవ్ చేసి పింకీ ఫొటోను కాల్చేశారు. అనంతరం ఆనీ, శ్రీరామ్ వ్యాన్ ఎక్కారు. వీళ్లకు సిరి, షన్నూ ఫొటోలు వచ్చాయి. వీళ్లిద్దరిలో సిరిని మాత్రమే సేఫ్ చేసి షన్నూ ఫొటో కాల్చారు.

    పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

    ముగ్గురు మిగలడంతో రసవత్తరం

    ముగ్గురు మిగలడంతో రసవత్తరం

    ఈ టాస్కులో భాగంగా తర్వాతి రౌండ్‌లో కాజల్, పింకీ వ్యాన్ ఎక్కారు. అప్పుడు సిరి, శ్రీరామ్ ఫొటోలు రాగా.. లేడీ కంటెస్టెంట్‌కే ఓటు వేశారు. తర్వాత పింకీ, ఆనీకి సన్నీ, కాజల్ ఫొటోలు వచ్చాయి. వీళ్లిద్దరూ చాలా చర్చల అనంతరం కాజల్ ఫొటోను కాల్చేశారు. చివర్లో మానస్, కాజల్ వ్యాన్ ఎక్కగా.. సిరి, ఆనీ ఫొటోలు వచ్చాయి. కానీ, ఇద్దరికీ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ టాస్కును తర్వాతి ఎపిసోడ్‌కు వాయిదా వేశారు. దీంతో సిరి, ఆనీ, సన్నీ ఫొటోలు మాత్రమే మిగిలాయి. ఈ ముగ్గురిలో ఎవరు ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను అందుకుంటారో అన్నది రసవత్తరంగా మారిపోయింది.

    ఏకాభిప్రాయానికి రాని ఆ ఇద్దరు

    ఏకాభిప్రాయానికి రాని ఆ ఇద్దరు

    మానస్, కాజల్ వ్యాన్ మీద ఉన్న సమయంలో ఇద్దరికీ ఎంతకూ ఏకాభిప్రాయం కుదరలేదు. అతడేమో సిరి ఫొటోను కాల్చేద్దాం అంటే.. కాజల్ ఆనీ మాస్టర్ ఫొటోను కాల్చాలని అనుకుంది. ఈ విషయంలో ఇద్దరి మధ్య చాలా సేపు చర్చలు జరిగాయి. కానీ ఎంతకూ ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. ఈ టాస్కులో మానస్ నిజాయితీగానే ఆడినట్లు కనిపించినా.. కాజల్ మాత్రం ఏవేవో స్ట్రాటజీలు ప్లే చేసినట్లు అర్థం అయింది. ఎంత చెప్పినా వినకపోయే సరికి మానస్ ఓ మెట్టు దిగాడు. అప్పుడు ఆనీ మాస్టర్‌ ఫొటోనే కాల్చేద్దాం అని ఆమె నిర్ణయంతో ఏకీభవించాడు.

    బ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణంబ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణం

    సన్నీ కోసం స్ట్రాటజీగా ఆడింది

    సన్నీ కోసం స్ట్రాటజీగా ఆడింది

    కాజల్ చెప్పినట్లే చేయడానికి మానస్ ఒప్పుకున్నాడు. కానీ, ఆమె మాత్రం మరో మెలిక పెట్టింది. 'మనిద్దం ఏకాభిప్రాయానికి రాకుండా ఉంటే ఇద్దరి ఫొటోలు కాలిపోతాయి. అప్పుడు సన్నీ విజేతగా నిలుస్తాడు. వాడికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ వస్తుంది' అని చెప్పుకొచ్చింది. అందుకు అనుగుణంగానే వాళ్లిద్దరి ఫొటోలు కాలిపోయాయి. ఆ తర్వాత ఈ టాస్క్ మొత్తంలో ఒక్కసారి కూడా ఫొటో కాలిపోకుండా ఉన్న సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను గెలుచుకున్నాడు. దీంతో ఆనీ, సిరి కోపంతో రగిలిపోయారు. ఆ సమయంలో కాజల్‌ను విమర్శిస్తూ తీవ్ర స్థాయిలో కామెంట్లు కూడా చేశారు.

    Recommended Video

    అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
    సన్నీ గెలిచిన సంతోషం లేకుండా

    సన్నీ గెలిచిన సంతోషం లేకుండా

    ఈ టాస్కులో సన్నీ పాస్‌ను గెలుచుకున్నా.. అది ప్లాన్ ప్రకారమే ఆడడం వల్లే దక్కిందని హౌస్‌లోని మరో వర్గం విమర్శలు చేసింది. ఒక సందర్భంలో యాంకర్ రవి 'ఇప్పుడు ఆడోళ్లను అడ్డం పెట్టుకుని గేమ్‌ ఆడింది సన్నీ కాదా' అంటూ హౌస్‌మేట్స్‌ను మరింత రెచ్చగొట్టాడు. దీన్నే అదునుగా చేసుకుని షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంత్ అభిమానులు సన్నీని సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. దీంతో కాజల్ చేసిన పని వల్ల సన్నీ విమర్శలను ఎదుర్కొంటున్నాడు. దీంతో అతడు పాస్ గెలిచినా సంతోషం లేకుండా పోయినట్లు అయింది.

    English summary
    Bigg Boss 5th Season Running Successfully. In Recent Episode.. VJ Sunny Won Eviction Free Pass with RJ Kajal Help.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X