Bigg Boss Telugu 5 Elimination: మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు ఎలా ఓటు వేయాలంటే..
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో తొలివారం ఘనంగా ముగిసింది. మొదటి వారం ఇంటి నుంచి సరయు రాయ్ ఎలిమినేట్ అయ్యారు. అయితే రెండో వారం ఇంటి నుంచి బయటకు పంపించేందుకు నామినేషన్ల ప్రక్రియను కూడా ముగించేశారు. రెండోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్లలో ఎవరెవరూ ఉన్నారంటే..

రెండోవారం నామినేషన్‌లో ఉన్నది వీరే..
బిగ్‌బాస్ ఇంటిలో రెండో వారంలో నామినేషన్ల ప్రక్రియ వివాదస్పదంగాను, హాట్ హాట్‌గా సాగింది. అయితే నామినేష్ల పూర్తి అయిన తర్వాత ఆర్జే కాజల్, కార్తీకదీపం ఉమాదేవి, అనీ మాస్టర్; నటరాజ్ మాస్టర్, లోబో, ప్రియాంక సింగ్ రెండోవారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయ్యారు. అయితే మీకు నచ్చిన కంటెస్టెంట్లను రక్షించుకోవాలంటే అభిమానులు ఎలా ఓటింగ్ చేయడానికి రెండు రకాల ఓటింగ్ పద్దతులను బిగ్‌బాస్ నిర్వాహకులు కేటాయించారు.

రెండు పద్దతుల ద్వారా ఓటింగ్
బిగ్‌బాస్ తెలుగు 5 షోలో రెండోవారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారికి ఓటు వేయడానికి నిర్వాహకులు రెండు రకాల పద్దతులను అనుసరిస్తున్నారు. డిస్నీ+హాట్ స్టార్ యాప్ నుంచి ఓటు చేయడం ఒక పద్దతి అయితే.. కంటెస్టెంట్లకు కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మిస్ కాల్ ఇవ్వడం రెండో పద్దతిగా నిర్ణయించారు.

డిస్నీ+హాట్ స్టార్ యాప్ ద్వారా
బిగ్‌బాస్ తెలుగు 5 నామినేషన్లలో ఉన్న కంటెస్టెంట్లకు ఓటు వేసి సేవ్ చేయడానికి డిస్నీ+హాట్ స్టార్ యాప్‌ను మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. యాప్‌లో బిగ్‌బాస్ తెలుగు షోకు సంబంధించిన వివరాలు ఉంటాయి. బిగ్‌బాస్ కు సంబంధించిన లేటేస్ట్ ఎపిసోడ్ క్లిక్ చేస్తే అందులో Vote ని కనిపిస్తుంది. Voting for Today is now open అనే మెసేజ్ కనిపిస్తుంది. దానికి క్లిక్ చేస్తే మీరు కొత్త యూజర్ అయితే లాగిన్ చేసుకోమని అడుగుతుంది. అల్రెడీ మీరు యూజర్ అయి ఉంటే.. మీకు డైరెక్ట్‌గా నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఫోటోలు కనిపిస్తాయి. మీకు ఇష్టం ఉన్న వ్యక్తులను ఎంచుకొని ఓటు చేయాల్సి ఉంటుంది.

టోల్ ఫ్రీ నంబర్‌తో మిస్ కాల్ ద్వారా
ఇక రెండో పద్దతిన నేరుగా మీ మొబైల్ ద్వారా ఆయ కంటెస్టెంట్లకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్లకు మిస్ కాల్‌కు ఇవ్వవచ్చు.
1. ఆర్జే కాజల్‌కు ఓటు వేయాలంటే.. 8886658217 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
2. ఉమాదేవికి ఓటు వేయాలంటే.. 8886658215 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
3. లోబోకు ఓటు వేయాలంటే.. 8886658206 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
4. ప్రియాంక సింగ్‌కు ఓటు వేయాలంటే.. 8886658209 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
5. అని మాస్టర్‌కు ఓటు వేయాలంటే 8886658205 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
6. నటరాజ్ మాస్టర్‌కు ఓటు వేయాలంటే 8886658212 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.


Click it and Unblock the Notifications











