twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss telugu 5 voting: టాప్ లో షణ్ముఖ్ హవా.. తిట్టినోళ్లు పాతాళానికి.. ఫేక్ ఓట్లు కూడా?

    |

    బిగ్ బాస్ హౌస్ లో 5వ వారం గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ కొనసాగుతున్నట్లు అర్థమవుతోంది. ఎప్పటిలాగా రొటీన్ గా కాకుండా ఈ వారం బిగ్ బాస్ కాస్త విభిన్నంగా నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. సోది లేకుండా జెట్ స్పీడ్ లోనే కంటెస్టెంట్స్ నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఎదురుగా ఉన్నప్పుడు ఒకలా నామినేట్ చేస్తున్నారు. వెనకాల ఉన్నప్పుడు మరొకలా ప్రవర్తిస్తున్నారు అనే విషయం తెలుసుకునేందుకే బిగ్ బాస్ చాలా కొత్తగా ఆలోచించినట్లు అర్థమవుతుంది.

    అయితే జనాల ఓట్లు కూడా ఈ నామినేషన్ లో చాలా ముఖ్యమైనవని అందరికీ తెలిసిన విషయమే. ఇక ఆ విషయంలో షణ్ముఖ్ టాప్ లో ఉన్నాడని తెలుస్తోంది. ఇక అతనితో గొడవలు పెట్టుకున్న వారి నెంబర్ అయితే పాతాళానికి పడిపోయింది. అంతేకాకుండా కొన్ని ఫేక్ ఓట్లు కూడా వస్తున్నాయని సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వస్తోంది.

    నిద్ర లేచిన షన్ను

    నిద్ర లేచిన షన్ను

    బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటివరకు షణ్ముఖ్ జస్వంత్ తన కోపాన్ని అయితే పెద్దగా చూపించలేదు. కూల్ గా సోఫాలో కూర్చుంటూ ఒకరి గురించి మరొకరికి చెబుతూ కాస్త సైలెంట్ గా నే దాటుకుంటూ వచ్చాడు. అయితే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో చాలామంది అబ్బాయిలు టార్గెట్ చేశారు. జెస్సీ తప్పితే మిగతా అబ్బాయిలు మొత్తం కూడా షన్నుని నామినేట్ చేయడం అందరినీ షాక్ కు గురి చేసింది. అసలు ఆ రేంజ్ లో నామినేట్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు. ఇక ఆ దెబ్బతో షన్ను అయితే ఒక్కసారిగా నిద్ర లేచినట్లు ప్రవర్తించాడు.

    ఫేక్ ఓట్లు వచ్చాయా?

    ఫేక్ ఓట్లు వచ్చాయా?

    ఇక ఇప్పటి నుంచి తన అసలైన ఆట చూస్తారు అంటూ చాలా ధీమాగా వ్యక్తం చేశాడు. అయితే మొదటి రోజు బిగ్ బాస్ ఓటింగ్ ప్రక్రియ లో జనాలు ఎక్కువగా అతనికే మద్దతు తెలిపినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఎప్పటిలానే ఓటింగ్ ప్రక్రియపై విమర్శలు కూడా వస్తున్నాయి. దాదాపు 25 వేల వరకు ఫేక్ ఓట్లను బిగ్బాస్ నిర్వాహకులు క్యాన్సిల్ చేసినట్లుగా టాక్ అయితే వస్తోంది.

    అందరి టార్గెట్ షన్ను

    అందరి టార్గెట్ షన్ను

    ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక లిస్టు ద్వారా అయితే టాప్ లో ఉన్నట్లు అర్థమవుతోంది. ఈ వారం నామినేషన్ లో షణ్ముఖ్ సన్నీ మానస్, రవి, ప్రియ, జెస్సి, లోబో, అమిత విశ్వ ఉన్నారు. అది తొమ్మిది మందిలో కూడా షన్ను టాప్ లో ఉండడం విశేషం. తెలివిగా అతన్ని ఎక్కువమంది టార్గెట్ చేసి నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఒకే సారి ఇంట్లో ఉన్న 8 మంది అబ్బాయిలు అతన్ని నామినేట్ చేయడం జరిగింది.

    Recommended Video

    #BiggBossTelugu ఇతను Eliminate అవడం పక్కా.. టాప్ 5 వీరే!! || Filmibeat Telugu
    నెంబర్ వన్ లో షణ్ముఖ్

    నెంబర్ వన్ లో షణ్ముఖ్

    ఇక బిగ్ బాస్ లో షణ్ముఖ్ జస్వంత్ కొనసాగాలని చాలా మంది కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పోలైన ఓటింగ్ లో షన్ను దాదాపు 44.60 శాతం ఓట్లను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. రెండవ స్థానంలో సన్నీ 18.29 ఓట్లను దక్కించుకున్నట్లు సమాచారం. ఆ తరువాత మానస్ 8.76% యాంకర్ రవి 7.18% ప్రియా 6. 21%, జెస్సీ 5.02% లోబో 4.8%, హమీదా 2.99% ఒక విశ్వ 2.74% తో చివరి స్థానంలో ఉన్నాడు. మరి ఈ ఓటింగ్ వలన ఎవరెవరు ముందుగా సేవ్ అవుతారో చూడాలి.

    English summary
    Bigg boss telugu 5 latest voting Shanmukh Jaswanth in top place
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X