Bigg Boss Telugu 5 Vs EMK Rating నాగార్జున, ఎన్టీఆర్ నువ్వా నేనా.. బుల్లితెరపై స్టార్ హీరోల హోరాహోరీ

తెలుగు టెలివిజన్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇద్దరు అగ్ర నటుల షోలో నువ్వానేనా అనే విధంగా కొనసాగుతున్నాయి. ఇటీవల ప్రారంభమైన ఎవరు మీలో కోటీశ్వరుడు, బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ వేటికి అవే పోటీ పడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను ఈ రెండు కార్యక్రమాలు ప్రేక్షకులను టెలివిజన్ సెట్లకు హత్తుకుపోయేలా చేస్తున్నాయి. అయితే బుల్లితెర మీద ఈ రెండు షోలు ఏ రేంజ్ రేటింగ్‌‌ను సొంతం చేసుకొన్నాయంటే..

బుల్లితెరపై ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున

బుల్లితెరపై ఎన్టీఆర్ వర్సెస్ నాగార్జున

గతంలో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన మీలో ఎవరు కోటీశ్వరుడు స్టార్ మా టెలివిజన్‌లో నిరాటకంగా సాగింది. అయితే ఈ షోను ఎవరు మీలో కోటీశ్వరులు‌గా పేరు మార్చి జెమినీలో అట్టహాసంగా మార్చారు. ఇక ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను ప్రస్తుతం నాగార్జున హోస్ట్ చేస్తుండటం విశేషంగా మారింది. నాగార్జున, ఎన్టీఆర్ తమ షోలను మార్చుకొని బుల్లితెర మీద మ్యాజిక్ సృష్టిస్తున్నారు.

బిగ్‌బాస్ రికార్డు రేటింగ్‌తో

బిగ్‌బాస్ రికార్డు రేటింగ్‌తో

ఇప్పటికే ఎవరు మీలో కోటీశ్వరులు ఆరంభ వేడుక రికార్డు స్థాయి రేటింగ్ సాధిస్తే.. అదే బాటలో నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ ఓపెనింగ్ వేడుక రికార్డు స్థాయి రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది. దాదాపు 4.30 గంటలపాటు సాగిన ఈ వేడుక హెచ్‌డీ, ఎస్‌డీ రేటింగ్ కలుపుకొని 18 పాయింట్లు సాధించింది. టెలివిజన్ చరిత్రలో ఇది సరికొత్త రికార్డుగా చెప్పుకోవచ్చు.

వారం రోజులు ఎవరు మీలో కోటీశ్వరులు రేటింగ్

వారం రోజులు ఎవరు మీలో కోటీశ్వరులు రేటింగ్

ఇక వీక్ డేస్ రేటింగ్ విషయానికి వస్తే.. ఎన్టీఆర్ హోస్ట్‌గా ఎవరు మీలో కోటీశ్వరులు షో క్రమంగా మంచి రేటింగ్‌ను అందుకొంటున్నది. 35వ వారంలో అర్బన్ ప్రాంతంలో 6.48 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 3.54 రేటింగును నమోదు చేసింది. ఇక 36వ వారానికి వస్తే.. అర్బన్‌లో 7.30 రేటింగును, రూరల్‌లో 4.03 రేటింగును సాధించింది. గతవారంతో పోలిస్తే రేటింగును మెరుగు పరుచుకొంటున్నట్టు కనిపించింది.

వారం రోజల్లో బిగ్ బాస్ తెలుగు రేటింగ్

వారం రోజల్లో బిగ్ బాస్ తెలుగు రేటింగ్

ఇక నాగార్జున హోస్ట్‌గా ప్రసారమవుతున్న బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ వారం రోజుల రేటింగ్ గొప్పగా ప్రారంభం కాలేదు. మొదటి వారం తర్వాత రేటింగ్ పరిశీలిస్తే.. అర్బన్‌లో 6.67 రేటింగ్, రూరల్‌లో 4.05 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అయితే ప్రారంభం కావడంతో ఈ రేటింగ్ ఓ మోస్తారుగా నమోదు చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రానున్న రోజుల్లో మరింత క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

Recommended Video

Nee Jathaga Movie Official Teaser
ఊరిలో వినాయకుడు షోకు భారీ రేటింగ్

ఊరిలో వినాయకుడు షోకు భారీ రేటింగ్

ఇక ఈ రెండు షోలను మినహాయిస్తే.. వినాయక చవిత పండుగను పురస్కరించుకొని ప్రముఖ ఛానెల్ ఈటీవీలో ప్రసారమైన ఊరిలో వినాయకుడు ప్రత్యేక కార్యక్రమం భారీ రేటింగును సొంతం చేసుకొన్నది. టెలివిజన్, జబర్దస్త్ కళాకారులతో రూపొందించిన ఈ షో అర్బన్‌ ప్రాంతంలో 11.27 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 9.93 రేటింగ్ సాధించడం విశేషంగా పేర్కొన్నవచ్చు. అలాగే స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమైన గణేష్ చవితి స్పెషల్ ప్రోగ్రాం పండుగే పండుగ కూడా మంచి రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. అర్బన్ ప్రాంతంలో 9.09 రేటింగు, రూరల్ ప్రాంతంలో 7.97 రేటింగ్ సొంతం చేసుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X