Bigg Boss : కాజల్ దెబ్బకు మైండ్ బ్లాక్.. పిచ్చెక్కినట్టు ఊగిపోయిన అనీ మాస్టర్.. మామూలు రచ్చ కాదుగా!
బిగ్ బాస్ సీజన్ 5 లో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ బీబీ హోటల్‌లో సరదాగా ఉన్న కంటెస్టెంట్లు కెప్టెన్సీ టాస్క్ టవర్‌లో ఉంది పవర్‌లో మాత్రం కొట్లాటకు దిగారు. తాజా ఎపిసోడ్ లో సిరి, సన్నీ, కాజల్, రవి కెప్టెన్సీకి పోటీ పడగా మిగతా ఇంటిసభ్యులు వారికి మద్దతిచ్చారు. ఈ క్రమంలో కాజల్ అనీ మాస్టర్ మధ్య పెద్ద రెచ్చే జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే

నలుగురి మధ్య పోరు
కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా.. టవర్‌లో ఉంది పవర్ అనే టాస్క్ ఇవ్వగా బీబీ హోటల్ టాస్క్‌లో ప్రతిభ కనపరిచిన సిరి, సన్నీ, కాజల్‌లు కెప్టెన్సీ పోటీదారులుగా నిలవగా రవి కూడా సీక్రెట్ టాస్క్ విజయవంతంగా పూర్తి చేయడంతో ఆయన కూడా పోటీలో నిలిచాడు. ఇక ఈ నలుగురి మధ్య 'టవర్‌లో ఉంది పవర్' పోరు ఆద్యంతం ఆసక్తికరంగా నడిచింది.

‘టవర్‌లో ఉంది పవర్'
ఇక ఈ టాస్క్ రూల్స్ ప్రకారం బ్రిక్స్ తో టవర్‌ని కట్టడంతో పాటు ఆ టవర్‌ని పడిపోకుండా కాపాడుకోవడం పోటీదారుల టాస్క్.. మరోపక్క మిగిలిన ఇంటి సభ్యులు ఆ టవర్‌ని పడగొట్టడానికి బాల్స్‌తో ఎటాక్ చేస్తూ ఉంటారు. చివరికి ఎవరి టవర్ అయితే పడిపోకుండా ఉంటుందో వాళ్లే హౌస్‌కి కెప్టెన్ అవుతారని ప్రకటించారు బిగ్ బాస్.

అనీ మాస్టర్‌కు కితకితలు
ఈ టాస్క్‌కి ఆనీ మాస్టర్‌ని సంచాలకురాలిగా బిగ్ బాస్ నియమించారు. అయితే ఫస్ట్ రౌండ్‌లో కాజల్ టవర్‌ని టార్గెట్ చేసి పడగొట్టేశారు ఒక గ్రూప్. ఇక రెండో రౌండ్‌లో సన్నీ ఔట్ అవగా చివరిగా మూడో రౌండ్‌కి సిరి, రవిలు మాత్రమే మిగిలారు. ఈ సమయంలో రవికి సపోర్ట్ చేస్తున్న అనీ మాస్టర్‌కు కితకితలు పెట్టి ఆమె ఆటను డిస్టర్బ్ చేయడానికి కాజల్ ప్రయత్నించింది. అనీ దీన్ని కూడా సీరియస్‌గానే తీసుకుంది.

అనర్హత వేటు వేస్తా
ఇలా చేశావంటే ఈ టాస్క్‌లో నీ మీద అనర్హత వేటు వేస్తానని కాజల్‌ను హెచ్చరించింది. అదే సమయంలో నువ్వు ఈ గేమ్‌లో ఓడిపోయాక ఎవరికి సపోర్ట్ చేస్తున్నావని అడిగితే రవికి అని సమాధానమివ్వడంతో షాకైన అనీ రవికి సపోర్ట్ అంటూనే అతడికి మద్దతుగా నిలబడ్డవాళ్లకు చక్కిలిగింతలు పెడతావా? అని నిలదీసింది. అయితే ఇందుకు కాజల్ నా గేమ్ అదే అని చెప్పింది.
Recommended Video

నాగిని డ్యాన్స్
ఈ సమాధానంతో షాకైన అనీ మాస్టర్ 'నన్ను టచ్ చేయకు, నా దగ్గరకు రాకు తల్లి' అంటూ ఆవేశపడుతూ నాగిని డ్యాన్స్ చేసింది. 'నా పైసలు దొంగిలించావు, ఒక్క గేమ్ నిజాయితీగా ఆడలేదు' అని కూడా ఆమె విమర్శించింది. నిజంగా చెప్పాలంటే సంచాలకురాలిగా ఉన్న ఆనీ మాస్టర్ పిచ్చెక్కినట్టు ప్రవర్తించిందనే చెప్పాలి. సంచాలకురాలుగా ఉన్న వ్యక్తి న్యూట్రల్ గా ఉండాలి కానీ ఒక టీంకి సపోర్ట్ చేస్తూఅనీ రెచ్చిపోయింది. నాగిని నాగిని అంటూ ఆనీ మాస్టర్ కాజల్ హేను ళన చేసి వెక్కిరించింది. ఆ తర్వాత సిరి-షణ్ముఖ్ అలాగే సన్నీ మధ్య గొడవ తీవ్రస్థాయిలో జరిగింది. అలా మొత్తం మీద నిన్నటి ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది.


Click it and Unblock the Notifications











