సిరి పెట్టిన చిచ్చు... సన్నీ, షణ్ముఖ్ మధ్య యుద్ధం.. ఎవరూ తగ్గేదేలే అంటూ కొట్టుకునే దాకా?

బిగ్ బాస్ సీజన్5 ఆసక్తికరంగా సాగుతోంది. ఒక పక్క హౌస్ లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ ఓ గేమ్ నిర్వహించారు. టవర్ లో ఉంది పవర్, అనే ఈ టాస్క్ లో కొందరు బ్లాక్స్ తో టవర్ నిర్మిస్తుంటే, వారి ఆపోజిట్ టీం సభ్యులు బాల్స్ తో దాన్ని కూల్చే ప్రయత్నం చేయాలి. ఈ టాస్క్ లో తనని ఆడకుండా సిరి అడ్డుపడడంతో సన్నీ పెద్ద ఎత్తున ఫైర్ అయ్యాడు. అయితే మధ్యలో కల్పించుకున్న షణ్ముఖ్ సన్నీతో గొడవపడగా సన్నీ అతనిమీద తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యాడు.. వివరాల్లోకి వెళితే

పెద్ద యుద్ధమే

పెద్ద యుద్ధమే

ఇక ఈ వారం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్‌లో సన్నీ, షణ్ముఖ్ మధ్య చిన్న పెద్ద యుద్ధమే జరిగిందనే చెప్పాలి. ఈ వారం కెప్టెన్సీలో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోని కంటెస్టంట్స్‌‌కు 'టవర్‌లో ఉంది పవర్' అనే టాస్క్ ఇచ్చాడు. అయితే సన్నీ టాస్క్‌ పూర్తి చేస్తుండగా సిరి మధ్యలో వచ్చి అతడిని అడ్డుకుంటుంది. దీంతో సన్నీ కోపంతో ఆటలో ఉన్న వాన్ని పట్టుకోవడమేంటని సిరిపై విరుచుకుపడతాడు.

అప్పడమైపోద్ది

అప్పడమైపోద్ది

దీనికి 'ఇది నా గేమ్‌ స్ట్రాటజీ' అని సిరి బదులివ్వగా.. ఇలాగే చేస్తే ' తంతాను.. అప్పడమైపోద్ది' అని సన్నీ ఫైర్ అయ్యాడు. 'అయితే...వెళ్లి అప్పడాలు అమ్ముకో' అంటూ సిరి సన్నీని ఎగతాళి చేస్తుంది. అక్కడితో అయిపోతుంది అనుకున్నారు కానీ అది మరింత ముదిరింది. ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతూ ఉండగా మధ్యలో ఎంటర్ అయిన షణ్ముఖ్‌ సిరికి సపోర్ట్‌గా మాట్లాడతాడు.

సిరిని ఏం చేయలేవు

సిరిని ఏం చేయలేవు


దీంతో సన్నీ, షణ్ముఖ్ మధ్య గొడవ రాజుకుంటుంది. 'నువ్వు సిరిని ఏం చేయలేవు' అని షణ్ముఖ్‌ అంటే...' ఏం..సిరిని కొడితే చూడాలని ఉందా? అలా చేయడానికి నాకు క్షణం పట్టదు అంటూ సన్నీ ఫైర్ అయ్యాడు ఆడపిల్లలను పంపించి మాట్లాడడం కాదు. దమ్ముంటే నీ ఆట నువ్వు ఆడాలి.. ఆడపిల్లల సహాయంతో గేమ్‌ ఆడొద్దు' అని సన్నీ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. దీంతో షణ్ముఖ్‌ కూడా రెచ్చిపోయాడు.

ఎవరిని అప్పడం చేస్తావ్‌?

ఎవరిని అప్పడం చేస్తావ్‌?

రేయ్ అని సన్నీ అనడంతో మర్యాదగా మాట్లాడాలనీ షన్ను పేర్కొన్నాడు. 'నీకెంట్రా...మర్యాద' అని సన్నీ షణ్ముఖ్‌ను గట్టిగానే వేసుకున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం మరింత పెరిగిపోతుంది. 'నువ్వు ఎవరిని అప్పడం చేస్తావ్‌? నువ్వు అప్పడం చేస్తే నేను ఊరుకోను అని షన్ను అంటే 'దమ్ముంటే గేమ్‌లోకి వచ్చి చూడు' అని సన్నీ అంటాడు. అయితే హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లు ఇద్దరిని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు.

Recommended Video

Pushpaka Vimanam Public Talk

కెప్టెన్ ఎవరంటే?


మరి సన్నీ, షణ్ముఖ్ గొడవ ఎంత దాకా వెళ్లిందో చూడాలంటే ఈరోజు ఎపిసోడ్‌ అయ్యే దాకా ఆడాల్సిందే. అయితే బిగ్ బాస్ లీక్స్ ప్రకారం సిరి, ఆర్జే కాజల్, యాంకర్ రవి, వీజే సన్నీ, కెప్టెన్సీ పోటీదారు టాస్క్ లో పాల్గొన్నారు. వీరిలో యాంకర్ రవి హౌస్ కెప్టెన్ గా ఎన్నికైనట్లు తెలుస్తోంది. మరి చూడాలి.ఇందులో నిజం ఎంత ఉందనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X