Bigg Boss 5: సిరి విషయంలో ప్రియాంక సొంత తెలివితేటలు.. వార్నింగ్ ఇచ్చిన బిగ్ బాస్

బిగ్ బాస్ సీజన్ 5 మొత్తానికి ఫైనల్ స్టేజ్ కు దగ్గరలో ఉంది. టాప్ కంటెస్టెంట్స్ గా ఎవరు నిలుస్తారా అనేది ప్రస్తుతం ఎంతో ఆసక్తికరంగా మారింది. గతంలో ఎప్పుడు లేని విధంగా హౌస్ మెంట్స్ వారి శక్తికి మించి పోరాడుతున్నారు. అంతే కాకుండా బిగ్ బాస్ టాస్క్ ల విషయంలో డోస్ పెంచడంతో కంటెస్టెంట్స్ గాయలపాలవుతున్నారు. కొందరు అస్వస్థతకు లోనయ్యారు. ఇక ఆరోగ్యం విషయంలో ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం పై బిగ్ బాస్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సిరి విషయంలో ప్రియాంక కాస్త ముందడుగు వేసి అతి తెలివితేటలు చూపించినట్లు అనిపించడంతో వెంటనే బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాడు.

డోస్ పెంచిన బిగ్ బాస్

డోస్ పెంచిన బిగ్ బాస్

ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 5 మంచి రేటింగ్స్ తో ముందుకు సాగుతోంది. గత వారం కంటే ఈ వారం కాస్త ఎక్కువ స్థాయిలో రేటింగ్స్ వస్తున్నట్లు సమాచారం. గతంలో ఎప్పుడు లేని విధంగా కంటెస్టెంట్స్ అందరూ కూడా పోటాపోటీగా వారి బలాన్ని మొత్తం ఉపయోగిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విదంగా బిగ్ బాస్ కూడా టాస్క్ ల విషయంలో కాస్త డోస్ అయితే పెంచాడు. ఇక శ్రీరామ్, సిరి ఇద్దరు కూడా తరువాత ఛాలెంజ్ లను ఫేస్ చేయలేక అస్వస్థతకు గురయ్యారు.

రొటీన్ కెమిస్ట్రీ

రొటీన్ కెమిస్ట్రీ

సిరి అయితే మహానటి లెవెల్లో పెర్ఫెమెన్స్ ఇస్తుండడంతో షణ్ముఖ్ జస్వంత్ సమయానికి తగ్గట్టుగా ఆమెతో కెమిస్ట్రీని కంటిన్యూ చేస్తున్నాడు. ఎవరు ఏమనుకున్నా కూడా వీరిద్దరూ మాత్రం వారికి నచ్చినట్లుగా ముందుకు సాగుతున్నారు. కొన్నిసార్లు అయితే షణ్ముఖ్ సిరిని మొత్తంగా దూరం పెట్టేస్తున్నాడు. ఇక సిరి ఎప్పటిలనే కన్నీళ్ళు పెట్టుకొని అలగడం ఆ తరువాత షన్ను వచ్చి ఓదర్చడంతో ఇద్దరు కూడా ఒకే బెడ్ పై దుప్పటి కప్పుకొని కునుకు తీస్తున్నారు.

బిగ్ బాస్ హెచ్చరిక

బిగ్ బాస్ హెచ్చరిక

అయితే రీసెంట్ గా బిగ్ బాస్ ఐస్ లో నిలబెట్టిన ఛాలెంజ్ కు సిరి ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఆమె నడవలేని పరిస్థితిలో ఉన్నట్లు అనిపించింది. అలాగే మోషన్స్ ప్రభావం ఎక్కువగా ఉందని సిరి చెప్పడంతో ప్రియాంక సలహాలు ఇవ్వడానికి ప్రయత్నం చేసింది. ఇక వెంటనే బిగ్ బాస్ ఆమెకు వార్నింగ్ ఇచ్చాడు. నీ కోసం లేదా ఇతరుల కోసం సొంత వైద్యం చేయకూడదు అంటూ హెచ్చరిక చేయడంతో ఆమె ఒక్కసారిగా తక దించుకుంది.

Recommended Video

Bigg Boss Telugu 5 : BJP MLA Raja Singh Fires On Anchor Ravi Elimination || Filmibeat Telugu
చివరలో గెలిచిన శ్రీరామ్

చివరలో గెలిచిన శ్రీరామ్

ఇక టికెట్‌ టు ఫినాలే టాస్క్‌లో కంటెస్టెంట్స్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అక్యురెసీ అనే ఐదో ఛాలెంజ్‌ లో హౌస్‌మేట్స్‌ గట్టిగానే పోరాడారు. బోర్డుపై ఉన్న బల్బ్ లలో ఎవరైతే ఎక్కువ వాటిని ఆన్‌ చేస్తారో వారే ప్రథమస్థానంలో నిలుస్తారు. అయితే ఇంకా సెట్టవ్వని సిరి, శ్రీరామ్‌ ఇద్దరి తరపున షణ్ను రంగంలోకి దిగాడు. ఛాలెంజ్‌లో శ్రీరామ్‌, సన్నీ, సిరి, మానస్‌ వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచారు. ఇక చివరికి రెండు స్థానాల్లో ఉన్న సిరి, సన్నీ రేసు నుంచి తప్పుకున్నారు. అనంతరం మానస్‌, శ్రీరామ్‌ ఫినాలే టికెట్‌ కోసం పోటీపడ్డారు. ఇక చివరి రౌండ్‌లో శ్రీరామ్‌, మానస్‌ పోటీపడగా శ్రీరామ్‌ గెలిచి ఫినాలేలో అడుగుపెట్టాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X