Bigg Boss Telugu 5 Elimination: బూతురాణి అవుట్.. బిగ్‌బాస్ నుంచి మరో లీక్?

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో తొలివారం ఎలిమినేషన్‌కు హోస్ట్ నాగార్జున అక్కినేని తెరలేపారు. ఇంటి సభ్యులతో తొలిసారి మాట్లాడుతూ వారి బలాలను, బలహీనతలను నాగార్జున చెబుతూ షోను ఎంటర్‌టైన్ చేశారు. ప్రతీ సభ్యుడిని ఏదో రకంగా ప్రశంసిస్తూనే షోను ఫీల్‌గుడ్‌గా మార్చారు. ఎపిసోడ్ ఆరంభానికి ముందే ఇంటి సభ్యులకు క్లాస్ పీకేది లేదని స్పష్టంగా చెప్పిన కింగ్.. మొదటివారం ఎలిమినేషన్ ప్రారంభించారు. అయితే ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా సాగిందంటే....

శనివారం రాత్రి ఎపిసోడ్‌లో నాగార్జున

శనివారం రాత్రి ఎపిసోడ్‌లో నాగార్జున

శనివారం రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో ఇంటి సభ్యులకు నచ్చిన వ్యక్తి ఎవరు? నచ్చని వ్యక్తి ఎవరు అనే టాస్క్‌ను నాగార్జున ఇచ్చారు. ప్రతీ ఒక్కరు తనకు నచ్చిన వ్యక్తి పేరు చెబుతూ.. ఎందుకు నచ్చారు అనే విషయాన్ని, అలాగే ఎందుకు నచ్చలేదంటూ అందుకు కారణాలు చెబుతూ షోను కొనసాగించారు. బిగ్‌బాస్ ఇంటిలో అందరికి నచ్చిన వ్యక్తి ప్రియాంక సింగ్ కావడం గమనార్హం.

 నీ నోటి వెంట బూతులు ఏవి?

నీ నోటి వెంట బూతులు ఏవి?

అయితే కంటెస్టెంట్లను పలకరించే క్రమంలో ఇంటిలో ఉంటున్న హాట్ హాట్‌గా కనిపించే సభ్యురాలు 7 ఆర్ట్స్ సరయు రాయ్‌‌ని పలకరించారు. సరయు ఏంటి? నీ నోటి వెంట బూతులు వినిపించలేదు. నీవు ఏదో బూతులు మాట్లాడుతావంటే కనిపించకుండా పోయావు అంటూ నాగార్జున అడిగాడు. అందుకు సరయు సమాధానం చెబుతూ.. సార్ మీరు కోపగించుకొంటారని నేను అలా మాట్లాడలేదు అంటూ సరయు చెప్పింది. దాంతో మీరు మీలా ఆడండి. గేమ్ కోసం మీరు మారకండి అంటూ నాగార్జున సూచించాడు.

ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి

ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించి

ఇంటి సభ్యులతో మాట్లాడుతూ.. టాస్క్‌లు ఇస్తూ ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. తొలి వారానికి నామినేట్ అయిన ఆరుగురు యాంకర్ రవి, సరయు రాయ్, ఆర్జే కాజల్, జస్వంత్, మానస్, హమీదాను లాన్‌లో నిలబెట్టారు. నామినేషన్లకు ఉపయోగించిన డస్ట్ బీన్, ప్లాస్టిక్ ప్యాకెట్లనే వాడుతూ ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. చెత్త ప్యాకెట్‌లో అన్ సేఫ్, సేఫ్ అనే కార్డులు ఉంటాయి. ఎవరికి అన్ సేఫ్ కార్డు వస్తే.. వారు ఎలిమినేషన్‌లో ఉన్నట్టు తెలిపారు.

తొలి రౌండ్‌లో యాంకర్ రవి, హమీదా సేఫ్

తొలి రౌండ్‌లో యాంకర్ రవి, హమీదా సేఫ్

బిగ్‌బాస్‌లో బలమైన కంటెస్టెంట్ తొలి రౌండ్‌లో యాంకర్ రవి ఎలిమినేషన్ నుంచి సేఫ్ అవ్వడంతో అందరూ హ్యాపీగా ఫీలయ్యారు. ఆ తర్వాత నిర్వహించిన ఎలిమేనేషన్ ప్రక్రియ సందర్భంగా ఓ టేబుల్‌పై గ్లాస్ పెట్టి.. దాని కింద బాల్ ఉంటే సేఫ్ అయినట్టు అని నాగార్జున చెప్పారు. అలా గేమ్ ప్రారంభించిన తర్వాత హమీదా గ్లాస్ కింద బాల్ ఉండటంతో హమీదాను సేఫ్ అంటూ ప్రకటించారు. దాంతో ఆమె ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.

నలుగురిలో నుంచి ఒకరు

నలుగురిలో నుంచి ఒకరు

ఆదివారం నాడు జరిగే వీకెండ్ ఎపిసోడ్‌లో మిగిలిన నలుగురిలో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారనే విషయం తేలనుంది. 7 ఆర్ట్స్ సరయు రాయ్, ఆర్జే కాజల్, జస్వంత్, మానస్ నలుగురు మిగిలారు. ఈ నలుగురిలో నుంచే ఒకరు తొలివారం ఎలిమినేషన్‌లో కాబోతున్నారు.

Recommended Video

Bigg Boss Telugu 5 Episode 7 Analysis..RJ Kajal the ultimate target for housemates
బిగ్‌బాస్ నుంచి సరయు రాయ్ అవుట్

బిగ్‌బాస్ నుంచి సరయు రాయ్ అవుట్

ఇక తాజా సమాచారం ప్రకారం తొలివారం ఇంటి నుంచి ఎలిమినేట్ అయిన వ్యక్తి సరయు రాయ్ అని తేలింది. ఆదివారం నిర్వహించిన ఎపిసోడ్‌లో అతి తక్కువ ఓట్లు సంపాదించిన సరయు రాయ్‌ని ప్యాక్ ది బ్యాగ్స్ అంటూ ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. దాంతో ఆమె తన లగేజ్‌ను సర్దుకొని ఇంటి నుంచి తొలివారం బయటకు వచ్చినట్టు తెలుస్తున్నది. సరయు విషయానికి 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. ఆ ఛానెల్‌లో అడల్డ్ కంటెంట్, సెక్స్‌కు సంబంధించిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు, పరిష్కారం ఇస్తూ పాపులర్ అయింది. తద్వారా బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలోకి అడుగుపెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X