Bigg Boss 10th Week Elimination: డేంజర్ జోన్‌లో మిస్టర్ ఫర్‌ఫెక్ట్, నాగిని.. ఆ ఇద్దరి జాతకం తేల్చేది అదే!

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో పదోవారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. నామినేషన్ ప్రక్రియ ముగియడంతో కంటెస్టెంట్లను కాపాడుకొనేందుకు అభిమానులు, కుటుంబ సభ్యులు, సోషల్ మీడియా గ్రూపులు ఓటింగ్‌కు సిద్దమయ్యాయి. దాంతో అభ్యర్థుల జాతకాలు తారుమారు అవుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పదోవారం ఓటింగ్ వివరాల డేటా ఆసక్తిని రేపుతున్నది. పదో వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారనే విషయం ఆసక్తిగా మారింది. తాజా ఓటింగ్ వివరాలు, ఎవరు డేంజర్ జోన్‌లో ఉన్నారనే విషయంలోకి వెళితే..

సోషల్ మీడియా గ్రూపులతో ఓటింగ్ స్ట్రాటెజీ

సోషల్ మీడియా గ్రూపులతో ఓటింగ్ స్ట్రాటెజీ

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోను పరిశీలిస్తే.. గత సీజన్లకంటే ఎక్కువగానే ప్రస్తుత 5వ సీజన్ భిన్నంగా కనిపిస్తున్నది. గత సీజన్లలో కంటెస్టెంట్ల ఎలిమినేషన్ బేరీజు వేసుకొన్న తాజా కంటెస్టెంట్లు ఇంటిలోకి వెళ్లడానికి ముందే భారీగా సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఓటింగ్ చేయించుకొనేందుకు స్ట్రాటేజీలను రూపొందించారు. దాంతో ఇంట్లో టాస్క్‌లు ఆడకుండానే ఎలిమినేషన్ నుంచి బయటపడుతామనే ధీమాలో ఉన్నారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

10వ వారం నామినేషన్‌లో ఉంది వీరే

10వ వారం నామినేషన్‌లో ఉంది వీరే

ఇక పదోవారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి మొత్తం ఐదుగురు కంటెస్టెంట్లు నామినేషన్‌లో ఉన్నారు. ఈ వారం నామినేషన్‌లో ఆర్జే కాజల్, సిరి హన్మంతు, యాంకర్ రవి, వీజే సన్నీ, మానస్ ఉన్నారు. దాంతో ఎలిమినేషన్ ప్రక్రియ అత్యంత క్లిష్టంగా మారే అవకాశం ఉంది.

టాప్ పోజిషన్‌లో వీజే సన్నీ

టాప్ పోజిషన్‌లో వీజే సన్నీ

ఇదిలా ఉండగా, పదోవారం ఓటింగ్ రంజుగా సాగుతున్నట్టు తెలిసింది. ఈ వారం ఓటింగ్ ప్రక్రియలో గతవారం మాదిరిగానే వీజే సన్నీ భారీగా ఓట్లు రాబట్టుకొన్నట్టు సమాచారం. ప్రస్తుతం వారంలో దాదాపు 30 శాతానికిపైగా ఓట్లను రాబట్టి టాప్ పోజిషన్‌లో నిలిచారు.

భారీగా ఓట్లు సంపాదించుకొన్న సిరి, రవి

భారీగా ఓట్లు సంపాదించుకొన్న సిరి, రవి

ఇక వీజే సన్నీ తర్వాత అత్యధికంగా సిరి హన్మంతు ఓట్లు సంపాదించుకొన్నట్టు సమాచారం. సిరి హన్మంతుకు 25 శాతానికి పైగా ఓట్లు వచ్చాయని తెలుస్తున్నది. ఇక ఆ తర్వాత యాంకర్ రవి సుమారు 20 శాతం ఓట్లు, మానస్, ఆర్జే కాజల్ 15 శాతం వరకు ఓట్లు సంపాదించుకొన్నట్టు తెలిసింది. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం ఆర్జే కాజల్‌కు కొంత సానుకూలమైన ఓటింగ్ జరుగుతున్నట్టు తెలుస్తున్నది.

సిరికి షణ్ముఖ్.. ఆర్జే కాజల్‌కు..

సిరికి షణ్ముఖ్.. ఆర్జే కాజల్‌కు..

తాజా ఓటింగ్‌లో షణ్ముఖ్ ఓట్లు సిరి హన్మంతు షేర్ చేసుకొంటున్నట్టు తెలుస్తున్నది. షణ్ముఖ్ నామినేషన్‌లో లేకపోవడం సిరికి అదృష్టంగా మారింది. ఇక ఆర్జే కాజల్‌కు సొంత యూట్యూబ్, సోషల్ మీడియా నెట్‌వర్క్ ఉండటంతో ఆమెకు కొంత సానుకూలమైన ఓటింగ్ ఉన్నట్టు తెలుస్తున్నది. అలాగే కాకుండా యూట్యూబ్ ఛానెల్స్ గ్రూప్స్‌ ఆర్జే కాజల్‌కు మద్దతుగా నిలుస్తున్నట్టు తెలిసింది. ఇక సన్నీ, మానస్ ఇద్దరూ నామినేషన్‌లో ఉండటంతో ఇద్దరు ఒంటరి పోరాటం చేస్తున్నట్టు తెలుస్తున్నది.

Recommended Video

Sound Movie Opening | Arjun Varahi | Nirosha
డేంజర్ జోన్‌లో మానస్, ఆర్జే కాజల్

డేంజర్ జోన్‌లో మానస్, ఆర్జే కాజల్

అయితే ప్రస్తుత ఓటింగ్ ప్రకారం మానస్, ఆర్జే కాజల్ డేంజర్‌ జోన్‌లో ఉన్నారు. వచ్చే ఎలిమినేషన్‌లో వీరిద్దరిలో ఒకరు ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. డిస్నీ హాట్ స్టార్ యాప్ ఓటింగ్ మినహాయిస్తే.. ఈ వారం కూడా కంటెస్టెంట్ల జాతకాన్ని తేల్చేది మిస్డ్ కాల్ డేటానే అని వెల్లడిస్తున్నారు. అయితే మిస్డ్ కాల్ డేటా మానస్, ఆర్జే కాజల్ ఇద్దరిలో ఒకరి భవిష్యత్‌ను తేల్చే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X