Bigg Boss Telugu 5 Week 11th Nominations: నువ్వు వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయి.. హాట్ హాట్‌గా గొడవలు
బిగ్‌బాస్ తెలుగు 5 షోలో 11వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియ మళ్లీ గందరగోళంగా మారింది. ఇంటి సభ్యుల మధ్య వాదోపవాదాలు, విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. నామినేషన్ ప్రక్రియను మొదలుపెడుతూ ఇంటి సభ్యులకు బిగ్‌బాస్ ఓ సందేశం వినిపించారు. అందరికీ మనసులో నిజాలను బయటపెట్టే ధైర్యం ఉండాలి. నిజాలతో నిర్బయంగా నిలదీసే అవకాశమే ఈ నామినేషన్ ప్రక్రియ ముఖ్య ఉద్దేశం అని చెప్పాడు. దాంతో 11వ వారానికి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ సందర్భంగా ఇంటి సభ్యులు తమలోని నిజాలను ఎలా బయటపెట్టారంటే...
Recommended Video

బ్యాడ్ బిహేవియర్‌పై వీజే సన్నీ ఘాటుగా
ఆదివారం హోస్ట్ నాగార్జున ముందు యాంకర్ రవి మాట్లాడుతూ... వీజే సన్నీది బ్యాడ్ బిహేవియర్ అని చెప్పడంపై వీజే సన్నీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వాదనను నామినేషన్ ప్రక్రియలో పాయింట్ అవుట్ చేస్తూ.. నీ తప్పు నీకు చెబితే.. అది నీకు ఫేక్ ఎలా అవుతుందో అర్ధం కాలేదు అని యాంకర్ రవి అన్నారు. నీవు అందరి ముందు బ్యాడ్ బిహేవియర్ అంటే నేను తీసుకోలేకపోయాను అని వీజే సన్నీ అన్నారు. దాంతో మనిషికి అర్ధం కావాలంటే.. పెద్ద సప్పుడు అయితే గానీ అర్ధం కాదు. అది అర్ధం కావడానికే నేను అలా చెప్పాను అని యాంకర్ రవి అన్నారు. దాంతో నా జోలికి రానంత వరకు నేను బరస్ట్ కాను అని వీజే సన్నీ అన్నాడు. అయితే ఇప్పటికీ నేను ఫేక్ కాదని ఒప్పుకొంటావా అంటే.. అది నా ఒపీనియన్. మారదు అంటూ వీజే సన్నీ ఘాటుగా స్పందించారు.

ఇంటి నుంచి వెళ్లిపోతే గొడవలు ఉండవు
ఆ తర్వాత షన్ను నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ ఆర్జే కాజల్ ఉద్దేశించి.. నీవు ఇంటి నుంచి బయటకు వెళితే.. గొడవలు తగ్గుతాయి అని అంటే.. వావ్ అని కాజల్ ఘాటుగా స్పందించింది. అలా కాజల్‌ను షన్ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత కాజల్, యాంకర్ రవి మధ్య గట్టిగానే వాగ్వాదం జరిగింది. వీజే సన్నీ, సిరి, షన్నుకు మధ్య వాగ్వాదం జరుగుతుంటే.. నీ ఫ్రెండ్ సన్నీని రెచ్చగొడుతూ.. తగ్గేదేలే అంటూ ఎలా అంటావు అని కాజల్‌ను రవి ప్రశ్నించాడు. అయితే నేను ఆ మాటలు అనలేదు. నీ ప్రతీసారి ట్విస్ట్ చేస్తుంటావు. నీకు అలవాటే కదా అంటూ కాజల్ ఘాటుగా స్పందించింది.

నా వల్ల ఇంటిలో గొడవలా?
ఆ తర్వాత కాజల్ నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ షన్ముఖ్ జస్వంత్‌తో మాట్లాడుతూ.. నేను ఇంటిలోని నుంచి వెళ్లిపోతే గొడవలు తగ్గుతాయి అనడాన్ని నేను ఒప్పుకోవడం లేదు.. నా వల్ల ఇంటిలో గొడవలు ఎప్పుడైనా అయ్యాయా? అంటే ఎదురుగా ఉన్న అని మాస్టర్ పక్కున నవ్వింది. దాంతో కాజల్ చిరాకు పడింది.

నీ దగ్గరే పెట్టుకో అంటూ సిరి హన్మంతు
ఆర్జే కాజల్‌ను సిరి టార్గెట్ చేసింది. నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటూ ఒకవేళ నన్ను నామినేషన్ చేయాలంటే స్ట్రాంగ్ కారణం చెప్పాలి. అలా సిల్లీ రీజన్ చెప్పవద్దు అని సిరి అంటే.. అది సిల్లీ రీజన్ కాదు.. అది ఒక పాయింట్ అని కాజల్ సమాధానం చెప్పింది. అయితే ఆ పాయింట్‌ను నీ దగ్గరే పెట్టుకో అంటూ సిరి హన్మంతు నామినేట్ చేసింది. దాందో సడెన్‌గా వైబ్స్ మారుతాయి. మాట్లాడటానికి ప్రయత్నిస్తే.. మాట్లాడరు.. ఎందుకు మాట్లాడరో అర్థం కాదు అని కాజల్ అంటే.. నాకు నీ మీద ఇష్టం లేదు. నాకు ఎఫెక్షన్ లేదు. అందుకే నేను మాట్లాడను అంటూ సిరి ఘాటుగా చెప్పింది.

ఆర్జే కాజల్ వర్సెస్ అనీ మాస్టర్
ఇక అనీ మాస్టర్, ఆర్జే కాజల్ మధ్య భారీ వాగ్వాదం జరిగింది. నీతో నాకు నెగిటివ్ వైబ్ వచ్చింది అంటూ అనీ మాస్టర్ అంటే.. నీకు అలా అభిప్రాయం ఉందని తెలియదు అంటే.. వచ్చింది.. దానిని ఎవరు మార్చలేరు అంటే.. కాజల్ మధ్యలో జోక్యం చేసుకొన్నది. దాంతో అనీ మాస్టర్ వెక్కిరించడంతో కాజల్ హర్ట్ అయినట్టు కనిపించింది. నీవు అలా వెక్కిరించడం రెస్పెక్టా.. నీవు చేసే పనుల వల్ల నేను ఎలా ఫీల్ అవుతున్నానో నాకు తెలుసు అంటూ కాజల్ ఎమోషనల్‌గా కనిపించింది.
11వ వారంలో నామినేట్ అయింది వీరే...
ఇదిలా ఉండగా, 11 వారం ఎలిమినేషన్ కోసం 8 మంది సభ్యులు నామినేషన్ అయ్యారు. యాంకర్ రవి కెప్టెన్ కావడంతో నామినేషన్ ప్రక్రియ నుంచి తప్పించుకొన్నారు. 11వ వారం నామినేట్ అయిన వారిలో ఆర్జే కాజల్, వీజే సన్నీ, సిరి హన్మంతు, మానస్, షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, ప్రియాంక సింగ్, అనీ మాస్టర్ ఉన్నారు. అయితే ఈ నామినేషన్ లిస్టును సవరిస్తారా? లేదా వీరినే కొనసాగిస్తారా అనే విషయం ఫుల్ ఎపిసోడ్‌లో తెలుస్తుంది.


Click it and Unblock the Notifications











