Bigg Boss 5 Telugu 12th week elimination ఆ ముగ్గురికి ఎలిమినేషన్‌ ముప్పు.. టాప్ 5లో ఆ ఐదుగురు అంటూ..

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ముగింపు అంకానికి చేరుకొంటున్నది. ఇప్పటికే 11 వారాలపాటు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇక బిగ్‌బాస్ సీజన్ 5కి కీలకంగా మారిన 12వ వారంలో ఏం జరుగబోతుందనే విషయం ఆసక్తిగా మారింది. ఇంటిలోని 8 మంది సభ్యుల్లో ఎవరు ఎలిమినేట్ అవుతున్నారనే విషయం అభిమానుల్లో ఉత్కంఠను రేపింది. గతవారం బిగ్‌బాస్ ఇంటిలో చోటుచేసుకొన్న విషయాలు, ఈ వారం ఎలిమినేషన్ నిర్వహించిన సర్వేపై ఫిల్మీబీట్ పాఠకులు వెల్లడించిన అభిప్రాయాలు మీ కోసం..

 12వ వారంలో నామినేషన్‌లో వీరే

12వ వారంలో నామినేషన్‌లో వీరే

గత 11వ వారాల్లో ఇంటి నుంచి 11 మంది ఇంటి సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. 12వ వారం ఎలిమినేషన్ కోసం దాదాపు కెప్టెన్ మానస్ మినహాయించి 7 గురు సభ్యులు నామినేట్ అయ్యారు. వీజే సన్నీ, యాంకర్ రవి, షణ్ముఖ్ జస్వంత్, సిరి హన్మంతు, ప్రియాంక సింగ్, ఆర్జే కాజల్, సింగర్ శ్రీరామచంద్ర నామినేషన్‌లో ఉన్నారు. అయితే ఈవారం టాప్ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ప్రాసెస్‌లో ఉండటం చర్చనీయాంశంగా మారింది.

అని మాస్టర్ ఎలిమినేషన్ గురించి

అని మాస్టర్ ఎలిమినేషన్ గురించి

బిగ్‌బాస్‌ తెలుగు 5లో 11వ వారం అనీ మాస్టర్ ఎలిమినేషన్ అవ్వడం తెలిసిందే. ఈ ఎలిమినేషన్ సరైనదా అంటూ అడిగిన ప్రశ్నకు 70.19 మంది అవును అని, 26.92 మంది కాదు అని, 2.88 శాతం మంది చెప్పలేం అంటూ సమాధానం ఇచ్చారు.

 ఆర్జే కాజల్ నిర్ణయం కరెక్టే..

ఆర్జే కాజల్ నిర్ణయం కరెక్టే..

11వ వారంలో ఎలిమినేషన్ ఫ్రీ టాస్క్‌లో సందర్భంగా సిరి హన్మంతు, ప్రియాంక సింగ్‌లో ఒకరిని ఆర్జే కాజల్ సేవ్ చేయకుండా వీజే సన్నీకి ఆ పాస్ లభించేలా చేయడంపై ఫిల్మీబీట్ అడిగిన ప్రశ్నకు భారీగా స్పందించారు. కరెక్టే అంటూ 53.28 శాతం ఓటుగా వేయగా, కాదు అంటూ 40.98 మంది, చెప్పలేం అంటూ 5.74 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

యాంకర్ రవి ఫేక్ అనేది నిజమే

యాంకర్ రవి ఫేక్ అనేది నిజమే

ఇక 12వ వారం నామినేషన్ ప్రక్రియ సందర్భంగా జరిగిన వాగ్వాదంలో యాంకర్ రవిపై వీజే సన్నీ ఘాటుగా కామెంట్లు చేశాడు. రవి ఫేక్ అంటూ వీజే అనడంపై ఫిల్మీబీట్ సర్వే నిర్వహించింది. వీజే సన్నీ చేసిన వ్యాఖ్యలు సరైనవి అంటూ 60.98 శాతం మంది ఓటు వేయగా, 34.96 శాతం మంది కాదు అని, చెప్పలేం అంటూ 4.07 శాతం మంది తమ అభిప్రాయాన్ని చెప్పారు.

ముగ్గురికి ఎలిమినేషన్ ముప్పు

ముగ్గురికి ఎలిమినేషన్ ముప్పు

బిగ్‌బాస్ తెలుగు ఇంటిలో నామినేట్ అయిన 7 గురు కంటెస్టెంట్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అడిగిన ప్రశ్నకు పాఠకులు భారీగా సమాధానం ఇచ్చారు. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అర్హత ఉన్న వారిలో ప్రియాంక సింగ్ (29.45 శాతం), ఆర్జే కాజల్ (21.23 శాతం), సిరి హన్మంతు (21.23 శాతం)తో ముప్పును ఎదుర్కొంటున్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఇంటి నుంచి వెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది.

Recommended Video

Bigg Boss Telugu 5 : Siri తల్లి ఇచ్చిన వార్నింగ్ కి కంటతడి పెట్టుకున్న Shanmukh || Filmibeat Telugu
షణ్ముఖ్, సిరి హన్మంత్ రొమాన్స్ అభ్యంతరకరం

షణ్ముఖ్, సిరి హన్మంత్ రొమాన్స్ అభ్యంతరకరం

ఇంటిలో టాప్ కంటెస్టెంట్లు సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్ ముద్దులు, హాగ్స్‌తో సందడి చేస్తున్నారు. వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ, రొమాన్స్‌పై బిగ్‌బాస్ అభిమానుల అభిప్రాయాన్ని కోరగా, అభ్యంతరకంగా ఉంది అంటూ 74.4 శాతం, బాగుంది అంటూ 17.6 శాతం, చెప్పలేం అంటూ 8 శాతం ఓట్లు వేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X