Bigg Boss Telugu 5 Week 2 Nomination list: రెండోవారం నామినేషన్‌లో ఆరుగురు.. ఆ కంటెస్టెంట్లపై ఎలిమినేషన్ కత్తి!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 రియాలిటీ షో తొలివారాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. అయితే మొదటి వారం ఇంటి నుంచి 7 ఆర్ట్స్ సరయు రాయ్‌ని ఎలిమినేట్ చేసి గేమ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చారు. అయితే తొలివారం అలా ముగిసిందో లేదో.. రెండోవారానికి సంబంధించిన ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియను బిగ్‌బాస్ ఇంటిలో పూర్తయింది. అయితే ప్రస్తుత వారం అంటే రెండోవారానికి ఇంటి నుంచి బయటకు పంపించిన వారి జాబితాలో ఎవరెవరు ఉన్నారంటే..

18 మందిని రెండు జట్లుగా
బిగ్‌బాస్ ఇంటిలో రెండో వారం నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తూ.. మొత్తం 18 మంది కంటెస్టెంట్లను రెండు జట్లుగా విడదీశారు. అలా రెండు రకాల డ్రెస్‌తో ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడగొట్టారు. బిగ్‌బాస్ ఇంటిలో ఉండటానికి ఎవరు అర్హులు కాదో.. వారి పేర్లు చెప్పి.. వారి ముఖాలకు ఎరుపు రంగు పూయాలి. అలా ఎక్కువగా ఎవరి ముఖానికి రంగు పూస్తారో వారు నామినేట్ అవుతారు అని బిగ్‌బాస్ రూల్స్ చెప్పారు.

నామినేషన్ సందర్భంగా మాటల యుద్ధం
నామినేషన్ల ప్రక్రియ మొదలైన తర్వాత ఎప్పటి మాదిరిగానే ఇంటి సభ్యుల మధ్య ఘాటుగా ఘాటుగా వాదోపవాదాలు చోటుచేసుకొన్నాయి. రవి, లోబో మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇక శ్వేతా వర్మ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇంటి సభ్యులందర్నీ పాయింట్ అవుట్ చేస్తూ అపరకాళి అవతారం ఎత్తింది. ఎవరైనా మాట్లాడితే.. వారిని అడ్డుకొంటూ శ్వేతా వర్మ నానా రచ్చ చేసింది.

హమీదాపై శ్వేతా వర్మ ఎటాక్
శ్వేతా వర్మ చేసిన రచ్చకు ఇంటి సభ్యులు దారుణంగా హర్ట్ అయినట్టు కనిపించింది. అయితే ఓ దశలో హమీదాపై దురుసుగా ప్రవర్తించింది. అయితే చాలా గట్టిగా హమీదా ముఖంపై రంగు కొట్టడం అందర్నీ షాక్ గురిచేసింది. నామినేషన్ల ప్రక్రియ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు గానీ.. శ్వేత వర్మ ఓ షాక్‌లో ఉన్నట్టు కనిపించింది. అయితే శ్వేతా వర్మకు బిగ్‌బాస్ ఏమైనా శిక్ష విధించాడా అనే విషయం రాత్రికి ప్రసారం కాబోయే ఫుల్ ఎపిసోడ్‌లో చూస్తే తప్ప అసలు విషయం బయటపడదు.

రెండో వారంలో నామినేట్ అయింది వీరే..
ఇదిలా ఉంటే, రెండోవారం ఎలిమినేషన్ల కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత రెండో వారంలో కూడా ఆరుగురు నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన వారిలో కార్తీకదీపం ఫేమ్ ఉమ, ప్రియ, అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, లోబో, ఆర్జే కాజల్ నామినేట్ అయ్యారు. దీంతో వచ్చే వారం ఎలిమినేషన్ ఆసక్తిగా మారింది.

ఎవరు ఎలిమినేట్ అవుతారంటూ..
శ్వేతా వర్మ, లోబో, విశ్వ ఘాటైన పదాలను ఉపయోగించడంతో ఇంటి సభ్యుల మధ్య వైరం ఈ వారం మరింత ఊపందుకొనే అవకాశం ఉంది. అయితే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం క్రేజీగా మారింది. అయితే ఘాటు, నాటు కంటెంట్ ఇచ్చే అవకాశం ఉన్న సరయు తొందరగానే ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కొందరు బిగ్‌బాస్ అభిమానులు నిరాశకు గురైనట్టు కనిపించింది.


Click it and Unblock the Notifications











