For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss Telugu 5: 'ఆమె' గుంట నక్క.. ఏడుగురిని చెడగొట్టింది.. నటరాజ్ సంచలనం.. ఆవిడనే టార్గెట్ చేశారా?

  |

  తెలుగు ప్రేక్షకుల అభిమాన బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలై ఒక వారం పూర్తయింది ఇప్పటికే మొదటి వారానికి సంబంధించిన ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ కాగా ఆమె ఎలిమినేట్ అవుతూ బయటకు వెళ్లి చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆ సంగతి పక్కన పెడితే ఇప్పుడు రెండో వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ నిన్న జరిగింది. ఎవరూ ఊహించని విధంగా హౌస్ లోని సభ్యులు ఒకరిమీద ఒకరు తమ శత్రుత్వాన్ని కనబరిచారు. ఉమా దేవి బూతులతో రెచ్చిపోగా నటరాజ్ మాస్టర్ అయితే గుంటనక్క అంటూ రెచ్చిపోయారు. మరి నటరాజ్ మాస్టర్ ఎవరిని టార్గెట్ చేశారు? ఏంటా కథ? అనే వివరాల్లోకి వెళితే

  Photo Courtesy: Star మా and Disney+Hotstar

  రచ్చ రచ్చ

  రచ్చ రచ్చ


  రెండో వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవరికి వాళ్లు రెచ్చిపోయి తమ పర్ఫామెన్స్ చూపించారు. దమ్ము ధైర్యం ఉంటే రండి ఎవరి బలం ఏంటో తెలుసుకుందాం అంటూ ఉమా దేవి సవాలు చేయగా అంతకుముందు విశ్వ తనను నామినేట్ చేసిన సమయంలో బూతుల పంచాంగం విప్పింది. ఆమె మాట్లాడిన బూతులు దెబ్బకు హౌస్ మేట్స్ అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. అలాగే శ్వేతా వర్మ కూడా చాలా వైలెంట్ గా కనిపించింది. తనను గేమ్ ఆడడం లేదు అంటున్నారు అనే ఏకైక కారణంతో లోబో అలాగే హమీద ఇద్దరి మీద రంగులు కళ్ళలో పడేలాగా పూసి శాడిజం చూపించింది.

  హాట్‌గా హాట్‌గా బాలయ్య హీరోయిన్ .. మరో ప్రస్థానంలో గ్లామరస్‌గా

  ప్రియ vs నటరాజ్ మాస్టర్

  ప్రియ vs నటరాజ్ మాస్టర్

  ఇక నటరాజ్ మాస్టర్ వ్యవహారం మాత్రం సంచలనంగా మారింది. ముందుగా ప్రియా సన్నీ అలాగే నటరాజ్ మాస్టర్ ఇద్దరిని నామినేట్ చేసింది.. సన్నీ తమ్ముడు అంటూనే సన్నీ తనతో కనెక్ట్ కాలేకపోయాను అంటున్నాడని కానీ మొదటి రోజు నుంచి సన్నితో తాను బాగా కనెక్ట్ అయ్యాను అని తనకు అనిపించిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆ తరువాత నటరాజ్ మాస్టర్ ను నామినేట్ చేసిన ప్రియా నాగార్జున గారితో మీరు చెప్పిన రీజన్ విన్న తర్వాత అసలు నేనేం తప్పు చేస్తున్నాను అనే విషయం తెలుసుకోవాలని ప్రయత్నించానని కానీ మీరు అందరి ముందు చెప్పలేనని అన్నారు అని చెప్పుకొచ్చింది. జరిగింది అందరి ముందే కాబట్టి తను అందరి ముందు చెప్పాలని కోరానని కానీ మీరు అందుకు సంసిద్ధంగా లేక ఇలా తనని నామినేట్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది.

  గుంటనక్క

  గుంటనక్క

  ఇక ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ రంగంలోకి దిగాడు. ముందుగా ఎవరిని నామినేట్ చేయకుండానే ఈ బిగ్ బాస్ ఇంట్లోకి ఒక మేక ముసుగు వేసుకున్న గుంట నక్క వచ్చి మొత్తం ఏడుగురు సభ్యులను చెడగొట్టింది అని, ఆ గుంట నక్క తన నామినేట్ అయ్యేలా చేసింది అని చెప్పుకొచ్చాడు. అయితే నటరాజ్ మాస్టర్ పేర్లు చెప్పకున్నా అది ప్రియను ఉద్దేశించే అంటున్నారని అందరూ భావిస్తున్నారు. ఇలా చెబుతున్న సమయంలో ప్రియ అభ్యంతరం వ్యక్తం చేయడమే కాక అంటే మిమ్మల్ని నామినేట్ చేయకపోతే మంచి వాళ్ళు చేస్తే గుంటనక్కలు అని మాట్లాడతారా అంటూ ఎమోషనల్ అయ్యింది. అయితే దానికి నటరాజ్ మాస్టర్ స్పందిస్తూ నేను ఎవరిని అనడం లేదు నేను నా అంతరంగాన్ని కెమెరా ముందు ఉంచుతున్నాను అని చెబుతూ కెమెరా ముందే మాట్లాడుతూ వాళ్లంతా మంచి వాళ్ళని అనుకున్నాను అని ఇక్కడికి వచ్చే ముందు అందరూ మనుషులు గానే ఉండే వాళ్ళు కానీ ఆ గుంటనక్క వాళ్లందరినీ గొర్రెలు గా మార్చిందని అంటూ ఘాటు కామెంట్స్ చేశాడు.

  మోచేతి నీళ్లు తాగుతూ

  మోచేతి నీళ్లు తాగుతూ

  వాళ్లంతా మోచేతి నీళ్లు తాగుతూ ఫలానా వాళ్ళని నామినేట్ చేయాలని ముందే అనుకుంటూ టార్గెట్ చేశారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ప్రియా, ప్రియాంక ఇద్దరినీ నామినేట్ చేశారు. ప్రియ ను నామినేట్ చేస్తూ ఎప్పటిలాగే సిల్లీ రీజన్స్ చెప్పగా ప్రియాంక సింగ్ విషయంలో కూడా తాను ప్రేమతోనే కొవ్వు వేసి వండాలనే మాట అన్నానని, అది చాలా సరదాగా అన్నాను కాని దానిని కూడా నువ్వు సీరియస్ గా తీసుకుంటామని అనుకోలేదని నువ్వు ఆట మెరుగుపరుచుకుంటే అనే ఉద్దేశ్యంతో ఇలా నామినేట్ చేస్తున్న అంటూ ప్రియాంకను నామినేట్ చేశారు.

  Vijay Raja Interview With YouTube Star Alankrutha | Gem Movie
  ఏకంగా ఏడుగురు

  ఏకంగా ఏడుగురు


  ఇక రెండవ వారంలో ముందు నుంచి లీకులు వస్తున్నట్టు గానే దాదాపు ఏడుగురు సభ్యులు నామినేట్‌ అయ్యారు. వోల్ఫ్‌ టీమ్‌ నుంచి ఉమాదేవి, నటరాజ్‌ మాస్టర్‌, కాజల్‌, ఈగల్‌ టీమ్‌ నుంచి లోబో, ప్రియాంక సింగ్‌, అనీ మాస్టర్‌, ప్రియా రెండో వారం ఎలిమినేషన్‌ కోసం నామినేట్‌ అయ్యారు. ఈ వారం మొత్తం ఇంటి సభ్యులు రెండు టీములగానే గేమ్‌ ఆడబోతున్నారని కమింగ్ అప్ లో చూపారు. సిరి కెప్టెన్‌ కావడంతో ఈ వారం ఆమె నామినేషన్‌ నుంచి తప్పించుకున్నారు., ఇక రెండో వారం హౌస్ కెప్టెన్ అయ్యే ఛాన్స్ కోసం గట్టి పోటీనే జరగబోతోంది. పంతం నీదా నాదా అంటూ రగ్బీ లాంటి గేం ఏదో ఆడుతున్నట్టు అయితే కనిపిస్తోంది. మరి చూడాలి ఈ టాస్క్ లో ఏ జట్టు గెలవబోతోంది, ఏ జట్టు సభ్యుడు హౌస్ కెప్టెన్ గా ఎన్నికవనున్నాడు అనే విషయాలు.

  English summary
  Bigg Boss Telugu 5 Week 2 Nominations went violent. Nataraj master targets priya indirectly and calls her wolf.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X