twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 5: మానవత్వం అంటే అదేనా.. హమీదాపై శ్వేతా వర్మ దాడి.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్

    |

    బిగ్‌బాస్ తెలుగు 5 షోలో రెండోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల పర్వంగా చాలా ఘాటుగా సాగింది. ఇంటి సభ్యుల్లో ఆవేకావేశాలు భగ్గుమన్నాయి. ఒకరిపై మాటల దాడి చేసుకోవడమే కాకుండా భౌతికంగా కూడా దాడులు చేసుకొనే వరకు వెళ్లినట్టు కనిపించింది. నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య జరిగిన రచ్చ ఎలా ఉందంటే..

    రెండు టీమ్‌లుగా సభ్యులను విడదీసి

    రెండు టీమ్‌లుగా సభ్యులను విడదీసి

    బిగ్‌బాస్ ఇంటిలోని 18 సభ్యులను రెండు టీమ్‌లుగా విడదీశారు. ఆ జట్లకు వూల్ఫ్స్, ఈగిల్ పేర్లు పెట్టారు. అయితే సిరి హన్మంతు కెప్టెన్ కావడంతో ఎవరూ నామినేట్‌ చేయకూడదని సూచించాడు. అలా ఒక జట్టులోని సభ్యులు మరో జట్టులోని సభ్యుడిని నామినేట్ చేయాలని అలాగే.. సొంత జట్టు సభ్యులను నామినేట్ చేసుకోవద్దని చెప్పారు. అలాగే పక్కనే ఉన్న రెండ్ కలర్‌ను ముఖంపై రాసి నామినేట్ చేయాలని సూచించారు.

    అని మాస్టర్‌ను నామినేట్ చేయడంతో

    అని మాస్టర్‌ను నామినేట్ చేయడంతో

    ఇంటి సభ్యుల్లోని అని మాస్టర్‌ను నామినేట్ చేయడంతో అసలు రచ్చ మొదలైంది. శ్వేతా వర్మ నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు తీవ్రంగా స్పందించారు. తన తల్లి లాంటి అని మాస్టర్‌ను కంటతడి పెట్టించారు. మీలో మానవత్వం లేదంటూ ఆవేశంగా ప్రసంగించారు. మధ్యలో ఎవరైనా మాట్లాడానికి వస్తే.. తాను మాట్లడుతున్పప్పుడు మధ్య రాకూడదని వార్నింగ్ ఇచ్చారు.

    హమీదాను ముఖంపై కొట్టడంతో

    హమీదాను ముఖంపై కొట్టడంతో

    ఇంటి సభ్యుల్లోని హమీదా ఖాతూన్‌ను నామినేట్ చేయడానికి వెళ్లి చేతుల్లోని కలర్‌ను ఏకంగా ముఖం మీద కొట్టేసింది. దాంతో ఆమె కళ్లలో కలర్ పోవడమే కాకుండా... దెబ్బ కూడా తగిలింది. దాంతో హమీదా ఒక్కసారిగా కూలబడిపోయింది. ఆమెను ఇంటి సభ్యులు జాగ్రత్తగా బాత్రూంలోకి తీసుకెళ్లి కడిగారు. అలాగే లోబోను కూడా కలర్‌తో ముఖం మీద కొట్టింది. లోబోను కూడా బాత్రూంలోకి తీసుకెళ్లి ముఖం కడిగారు.

    శ్వేతా వర్మ చేసిన పనిని తప్పుపడుతూ..

    శ్వేతా వర్మ చేసిన పనిని తప్పుపడుతూ..

    ఆ తర్వాత శ్వేతా వర్మ చేసిన పనిని తీవ్రంగా తప్పుపట్టారు. తాను ఆవేశంలో ఉన్న సమయంలో ఏం చేశానో నాకు తెలియదు. నేను కావాలని అలా చేయలేదు. కలర్ చేతిలో ఉండటంతో అలా కొట్టేశాను. నేను చేసిన పనికి చింతిస్తున్నాను. హమీదాకు బేషరతుగా క్షమాపణ కోరుతున్నాను. నీవు క్షమించికపోయినా నేను నీకు సారీ చెబుతున్నాను అంటూ తలను భూమికి పెట్టి సారీ చెప్పింది.

    మానవత్వం అంటే ఇదేనా?

    మానవత్వం అంటే ఇదేనా?

    శ్వేతా వర్మ చేసిన పనిని ప్రియతోపాటు అందరూ తప్పుపట్టారు. మీరు మానవత్వం గురించి మాట్లాడి.. మానవత్వం లేకుండా ముఖంపై కలర్‌తో కొడుతావా అంటూ నిలదీశారు. దాంతో ఆమె మౌనంగా నిలబడి పోయింది. శ్వేతా వర్మను అందరూ తప్పుపట్టడంతో ఆమె పశ్చాత్తాపంతో బాధపడింది. అయితే ఈ సంఘటన జరగగానే.. నెటిజన్లు సోషల్ మీడియాలో ఘాటుగా స్పందించారు. శ్వేతా వర్మ మానవత్వం గురించి మాట్లాడటం హస్యాస్పదం. ఆమె చేసిన తీరు దారుణంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

    రెండోవారం ఆరుగురు నామినేట్

    రెండోవారం ఆరుగురు నామినేట్

    బిగ్‌బాస్ తెలుగు 5 షోలో రెండోవారం ఎలిమినేషన్‌కు ఆరుగురు సభ్యులు నామినేట్ అయ్యారు. ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన వారిలో అని మాస్టర్, నటరాజ్ మాస్టర్, ప్రియాంక సింగ్, ఉమ, లోబో, ఆర్జే కాజల్ నామినేట్ అయ్యారు. ఈ నామినేషన్ ప్రక్రియ అత్యంత గందరగోళం మధ్య ముగిసింది.

    English summary
    Bigg Boss Telugu 5 Week 2 Nomination list: six members Nominated for Second week. As per Reports, Priya, Lobo, Uma, Nataraj Master, Anee Master, RJ Kajal nominted for second week nominations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X