Bigg Boss Telugu 5 Week 3 elimination: బిగ్‌బాస్ నుంచి అందాలభామ అవుట్.. దారుణం అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ఊహించని పరిణామం చోటుచేసుకొన్నది. అయితే ఈ వారం జరిగిన ఒక గొడవ కారణంగా ఎలిమినేషన్ ప్రక్రియపై ఆసక్తి పెరిగింది. అయితే అందరూ ఊహించని విధంగా ఓ ఇంటి సభ్యురాలు బయటకు వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. యాంకర్ రవి, ప్రియ మధ్య జరిగిన గొడవ కారణంగా సానుభూతిని సొంతం చేసుకొన్న కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయింది. అయితే ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ చేయడంపై సోషల్ మీడియాలో అప్పుడే ట్రోల్స్ మొదలయ్యాయి. తాజా ఎలిమినేషన్‌కు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్‌లో లహరి షారి..
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్‌లోకి వచ్చే వరకు లహరి షారి గురించి పెద్దగా ఎవరికి తెలియదు. అర్జున్ రెడ్డి, మల్లీ రావా, పటేల్ సార్, పేపర్ బాయ్, శ్రీనివాస కల్యాణం, తిప్పర మీసం, ఇటీవల వచ్చిన జాంబిరెడ్డి చిత్రాలతో వర్థమాన తారగా పేరు తెచ్చుకొంటున్నది. బిగ్‌బాస్‌లోకి రావడం వల్ల ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

ఫైర్ బ్రాండ్‌గా లహరి షారి
ఇక బిగ్‌బాస్ ఇంటిలో లహరి షారి ఫైర్ బ్రాండ్‌గా కనిపించింది. అవసరమైనప్పుడల్లా ఘాటుగా స్పందిచండం అలాగే... అందాల ఆరబోతతో ఆకట్టుకొనేందుకు ప్రయత్నించింది. ఇంటిలో పొట్టి దుస్తులుతోనే కాకుండా క్లీవేజ్ షోతో ఇంటిని వేడెక్కించింది. అలా ఇంటిలో సుధీర్ఘంగా సాగుతుందని అనుకొన్న లహరి షారి మూడోవారంలో అనూహ్యంగా నామినేట్ అయింది.

యాంకర్ రవి, లహరి షారి, ప్రియ మధ్య వివాదం
మూడో వారం నామినేషన్ సందర్భంగా యాంకర్ రవి, లహరి షారి ఇద్దరు అర్ధరాత్రి బాత్రూంలో ఒకరినొకరు కౌగిలించుకొన్నారు అంటూ ప్రియా చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. లహరి షారి ఎక్కువగా మగవాళ్లతోనే ఇంటిలో గడుపుతుంది. నాకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉండటం లేదని ప్రియా ఘాటుగా స్పందించింది.

ప్రియ సారీ చెప్పడంతో వివాదానికి చెక్
తన క్యారెక్టర్ డామేజ్ చేసేందుకు ప్రయత్నించిన ప్రియపై లహరి షారి ఫైర్ అయింది. అన్నాచెల్లెల్ల బంధం ఉన్న మా ఇద్దరిపై అలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంత వరకు సబబు అంటూ లహరిషారి ఘాటుగా స్పందించింది. అయితే ఆ తర్వాత నా ఉద్దేశం అది కాదు.. నువ్వు నాకు అందుబాటులో లేవని, నాతో ఎక్కువగా ఉండటం లేదన్న ఉద్దేశంతోనే అలా అన్నాను. ఏదైనా బాధపడితే నన్ను క్షమించండి అంటూ ప్రియ కామెంట్స్ చేసింది.

సోషల్ మీడియాలో లహరి షారికి మద్దతు
అయితే ప్రియతో వివాదం కారణంగా లహరి షారికి సోషల్ మీడియాలో భారీగా మద్దతు లభించింది. లహరి షారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రియను నెటిజన్లు ట్రోల్స్‌తో చీల్చి చెండాడారు. అయితే ఈ వారం ఓటింగ్ విషయంలో ప్రియ, లహరి షారికి పోటాపోటీగా ఓట్లు వచ్చాయని, మిస్డ్ కాల్ డేటాలో ప్రియ పైచేయి సాధించిందనే విషయం బయటకు వచ్చింది. అయితే చివరకు లహరిషారిని ఎలిమినేట్ చేసినట్టు వార్తలు బయటకు వచ్చాయి.

లహరి షారి ఎలిమినేషన్‌పై నెటిజన్లు ఘాటుగా
లహరి షారి ఎలిమినేట్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమన్నది. అయితే ఎవరిని ఎప్పుడు పంపిస్తారో తెలియదు అంటూ నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రియను ఇంటిలో ఉంచడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేనేజ్‌మెంట్ కొందరి పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నదంటూ బహిరంగంగానే కామెంట్లు పెడుతున్నారు.
Recommended Video

లహరి షారి ఎలిమినేషన్‌పై అనుమానాలు?
అయితే, లహరి షారిని ఎలిమినేట్ చేసిన తర్వాత ఆమెను సీక్రెట్ రూమ్‌కి పంపిస్తారా అనే అనుమానాన్ని కొందరు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లహరి షారి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కావడమే అలాంటి ఊహాగానాలు వస్తున్నాయనే వాదన వ్యక్తమైంది. ఆదివారం ఎపిసోడ్ ఇలాంటి అనుమానాలకు, ఊహాగానాలకు సమాధానం చెప్పే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











