Bigg Boss 5 Telugu Elimination: ఈ వారం ఎలిమినేషన్‌లో ఆ ఇద్దరు.. బిగ్‌బాస్‌లో రికార్డుస్థాయి ఓటింగ్‌

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో మూడో వారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నది. ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారడంతో ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్తారనే విషయం హాట్ టాపిక్‌గా మారింది. మూడోవారంలో తమ నచ్చిన కంటెస్టెంట్లను సేవ్ చేసుకోవడానికి అభిమానులు జోరుగా ఓటింగ్‌కు పాల్పడుతున్నట్టు సమాచారం. అయితే ఇప్పటి వరకు అందిన ట్రెండ్స్ ప్రకారం ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉందనే విషయంలోకి వెళితే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

 మూడో వారానికి ఎలిమినేషన్‌లో

మూడో వారానికి ఎలిమినేషన్‌లో

మూడోవారం ఎలిమినేషన్ కోసం ఐదుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ఇందులో శ్రీరామచంద్ర, లహరి, ప్రియ, ప్రియాంక, మానస్ ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఎందుకంటే ఈ వారం నామినేషన్‌లో ఉంది టాప్ కంటెస్టెంట్లు, టైటిల్ రేసులో ముందున్న వారే కావడం ఆసక్తికరంగా మారింది.

రికార్డు స్థాయి ఓటింగ్

రికార్డు స్థాయి ఓటింగ్

గత రెండు రోజులుగా ఓటింగ్ ప్రక్రియ జోరుందుకొన్నదని, అలాగే రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైందనే విషయం తాజా ట్రెండ్స్ ప్రకారం తెలిసింది. శ్రీరామచంద్ర, ప్రియాంక, మానస్‌కు భారీగా ఓటింగ్ నమోదైందనేది తాజా సమాచారం. అలాగే ప్రియ, లహరికి కూడా గట్టిగానే ఓట్లు పడుతున్నట్టు తెలిసింది. దాంతో ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది.

 ప్రియ, లహరి షారి వివాదంతో

ప్రియ, లహరి షారి వివాదంతో

మూడోవారం ఎలిమినేషన్‌లో ప్రియ, లహరి షారి ప్రత్యేక ఆకర్షణగా మారే అవకాశం ఉంది. లహరి షారిని ప్రియ టార్గెట్ చేసి యాంకర్ రవితో కౌగిలింతల వ్యవహారం వివాదంగా మారింది. అప్పటి వరకు ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉన్న ప్రియ ఈ వారం నెగిటివ్ జోన్‌లోకి వెళ్లినట్టు కనిపిస్తున్నది. అయితే ప్రియ తనపై వచ్చిన నెగిటివిటిని ఏ విధంగా తప్పించుకోబోతున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది.

 లహరి షారికి సానుభూతి పెరిగి...

లహరి షారికి సానుభూతి పెరిగి...

ప్రస్తుత వారంలో నామినేట్ అయిన ఐదుగురిలో లహరి షారికే తక్కువగా ఫాలోయింగ్ ఉందనేది వాస్తవం. అయితే ప్రియాతో జరిగిన వివాదంతో లహరికి కొంత సానుభూతి పెరిగినట్టు సోషల్ మీడియాలో కనిపిస్తున్నది. ఒకవేళ లహరి షారికి ప్రియతో వివాదం సానుకూలంగా మారితే.. ఆమె ఈ వారం బయటపడే అవకాశం కనిపిస్తున్నది.

డేంజర్ జోన్‌లో ప్రియ, లహరి షారి

డేంజర్ జోన్‌లో ప్రియ, లహరి షారి

ఇప్పటి వరకు నమోదైన ఓట్ల ప్రకారం.. ప్రియ, లహరి షారి డేంజర్‌ జోన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నది. అయితే ఇంకా రెండు రోజులు సమయం ఉండటంతో ఓటింగ్ శాతం తారుమారు అయ్యే అవకాశం లేకపోలేదు. మిగితా వారితో పోలిస్తే ప్రియ, లహరి సేవ్ కావడానికి ఎక్కువ కష్టపడాల్సి ఉందనే కాదనలేని వాస్తవంగా కనిపిస్తున్నది.

ఓటింగ్ ఇలా చేయవచ్చు.

ఓటింగ్ ఇలా చేయవచ్చు.


డిస్నీ+హాట్ స్టార్ యాప్ నుంచి ఓటు చేయడం ఒక పద్దతి అయితే.. కంటెస్టెంట్లకు కేటాయించిన టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మిస్ కాల్ ఇవ్వడం రెండో పద్దతిగా నిర్ణయించారు. మీ మొబైల్ ద్వారా ఆయ కంటెస్టెంట్లకు సంబంధించిన టోల్ ఫ్రీ నంబర్లకు మిస్ కాల్‌కు ఇచ్చి ఓటు వేయాల్సి ఉంటుంది.
1. ప్రియకు ఓటు వేయాలంటే.. 8886658217 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
2. శ్రీరామచంద్రకు ఓటు వేయాలంటే.. 8886658215 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
3. మానస్‌కు ఓటు వేయాలంటే.. 8886658206 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
4. ప్రియాంక సింగ్‌కు ఓటు వేయాలంటే.. 8886658209 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.
5. లహరి షారికి ఓటు వేయాలంటే 8886658205 మొబైల్ నంబర్‌కు డయల్ చేసి మిస్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X