Bigg Boss Telugu 5 Week 3 Elimination: ఆ నలుగురు నామినేట్.. ప్రియ, లహరి షారి భారీ ఫైట్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో మరోసారి రచ్చ చోటు చేసుకొన్నది. మూడోవారం ఇంటి నుంచి బయటకు వెళ్లే సెలెబ్రిటీల ఎలిమినేషన్‌కు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ ఇంటి సభ్యులు మధ్య గందరగోళం సృష్టించింది. మూడోవారం నామినేషన్ల సందర్బంగా ఒకరిపై మరొకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకొన్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ వారం నలుగురు సెలబ్రిటీలు నామినేట్ అయ్యారని విషయం తెలిసింది. మూడో వారం ఎలిమినేషన్ ముప్పు ఉన్నది ఎవరంటే...

నామినేషన్ ప్రక్రియ ఇలా..

నామినేషన్ ప్రక్రియ ఇలా..

బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ల ప్రక్రియను గ్రానైట్ రాయిని పగలకొడుతూ.. ఓ పోస్టర్‌పై నామినేట్ చేయాలనుకొన్న వ్యక్తి పేరు ముద్ర వేసి తగిన కారణాలను చెప్పి నామినేట్ చేయాలని బిగ్ బాస్ నిబంధనలు చెప్పారు. దాంతో తమకు ఇష్టం లేని వ్యక్తుల పేర్లను వెల్లడిస్తూ నామినేషన్ల ప్రక్రియను మొదలుపెట్టారు. నామినేషన్ల ప్రక్రియ సందర్బంగా కాజల్, నటరాజ్ మాస్టర్ గ్లాస్ పగలకొడుతూ, అలాగే ముద్ర వేస్తూ కనిపించారు.

శ్రీ రామచంద్ర ఆగ్రహం.. వీజే సన్నీ ఫైర్

శ్రీ రామచంద్ర ఆగ్రహం.. వీజే సన్నీ ఫైర్

నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా సింగర్ శ్రీరామచంద్ర మాట్లాడుతూ.. నీకు, నాకు మధ్య, నీకు, నాకు మానస్ మధ్య ఇంత నెగిటివి అవసరం లేదు అంటూ తీవ్రంగా స్పందించారు. ఇక ప్రియ, వీజే సన్నీ మధ్య మాటల యుద్ధం భారీగానే జరిగినట్టు కనిపించింది. మీరు చెప్పిన మాటను నేను తీసుకోవడం లేదు అని వీజే సన్నీ అంటే... నేను ఏమన్నానో చెప్పండి అని ప్రియ అంటే.. నేను ఇప్పుడు ఆ మాటను చెప్పలేను అంటూ వీజే సన్నీ అన్నారు. దాంతో ప్రియ చప్పట్లు కొడుతూ కనిపించింది.

ప్రియతో లహరి షారి గొడవ

ప్రియతో లహరి షారి గొడవ

ఇక ప్రియ, లహరి షారి మధ్య కూడా వాగ్వాదం భారీగానే జరిగినట్టు తాజా ప్రమోలో కనిపించింది. వాట్ ఏ సేఫ్ గేమ్ అంటూ ప్రియ అంటే.. సేఫ్ గేమ్ ఆడటానికి ఇంకా చాలా మంది ఉన్నారు నామినేషన్ వేయడానికి అంటూ ఘాటుగా లహరి సమాధానం ఇచ్చింది. ఇక ప్రియాంక సింగ్, హమీదా మధ్య కూడా గొడవ బాగానే జరిగినట్టు ప్రోమోలో స్పష్టమైంది. పనికిమాలిన కారణాలు చెబుతున్నావు అని ప్రియాంక అంటే.. నీవు నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడావు అని హమీదా చెప్పింది. దాంతో నీవు చెప్పేవి అన్నీ పనికి మాలిన కారణాలు అంటూ ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేసింది.

నటరాజ్ మాస్టర్, జస్వంత్ మాటల యుద్దం

నటరాజ్ మాస్టర్, జస్వంత్ మాటల యుద్దం

అలాగే నటరాజ్ మాస్టర్, జస్వంత్ మధ్య కూడా మాటల యుద్దం కనిపించింది. నువ్వు ఎవడో చెబితే.. నాపై నామినేషన్ వేశావనే పాయింట్ నాకు తెలుసు అని నటరాజ్ మండిపడ్డారు. ఇక నటరాజ్‌పై విశ్వ మండిపడ్డారు. అమ్మాయి మాట్లాడుతుంటే... ఛాతి విరుచుకొని నిలబడుతావా అంటూ కామెంట్ చేశారు.

చిన్న చెడ్డీలు వేసుకొని అంటూ..

చిన్న చెడ్డీలు వేసుకొని అంటూ..

నామినేషన్ల ప్రక్రియలో జస్వంత్‌పై యాంకర్ రవి ఘాటుగా స్పందించారు. చిన్న చెడ్డీలు వేసుకొని నీకు తగిలిన దెబ్బలను బాగా చూపించుకొన్నావు. ఇంత పెద్ద ప్లాట్‌ఫామ్‌ను సరిగా ఉపయోగించుకోవడం లేదు అని జస్వంత్‌ను యాంకర్ రవి టార్గెట్ చేశాడు. అలాగే నటరాజ్ మాస్టర్ కూడా జస్వంత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. నువ్వు చిన్న పిల్లాడివి.. జుజ్జు అంటూ నటరాజ్ మాస్టర్ అంటే.. అవును నేను చిన్నపిల్లవాడినే అంటూ జస్వంత్ అన్నాడు. ఈ సందర్భంగా ఇద్దరు ముద్దులు పెట్టుకోవడం ఫన్నీగా అనిపించింది.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!

నామినేట్ అయిన ఐదుగురు వీరే...

మూడో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ల ప్రక్రియ ముగిసిన అనంతరం ఐదుగురు సభ్యులు ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. శ్రీరామచంద్ర, లహరి, ప్రియ, ప్రియాంక, మానస్ ఈ వారం నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో ఐదుగురు స్ట్రాంగ్ కావడంతో ఎవరు బయటకు వెళ్తారనే విషయం ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X