Bigg Boss Telugu 5 Week 3 Nominations: నీవు మగాళ్లతో అలా బిజీ.. లహరిపై ప్రియ ఘాటుగా, రవి ఫైర్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో నామినేషన్లంటే ఇతరులపై ఆరోపణలు చేస్తూ తమకు తాము డిఫెండ్ చేసుకోవడమే. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు నోరుపారేసుకోవడం సాధారణంగా కనిపిస్తుంది. దాంతో ఇరువురు, వారికి సంబంధించిన వారి మధ్య గొడవలు ఓ రేంజ్‌లో చోటుచేసుకోవడం జరుగుతుంది. బిగ్‌బాస్ తెలుగు 5 షో మూడోవారంలో జరిగే ఎలిమినేషన్ కోసం ఇంటిలో భారీ రచ్చే జరిగింది. యాంకర్ రవి, ప్రియ, లహరి షారి మధ్య జరిగిన గొడవ నెక్ట్స్‌ లెవెల్‌లో కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే...

బద్దలు కొట్టి మీరే చెప్పాలి..

బద్దలు కొట్టి మీరే చెప్పాలి..

నామినేషన్ ప్రక్రియలో బద్దలు కొట్టి మీరే చెప్పాలి అనే కాన్సెప్ట్‌లో ఇంటి సభ్యులు రెచ్చిపోయారు. ఈ సందర్భంగా ప్రియతో లహరిషారి మాట్లాడుతూ.. నీవు ఎందుకు నాతో డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నావో నాకు అర్ధం కావడం లేదు అని అన్నారు. దాంతో ప్రియ స్పందిస్తూ.. ఎందుకంటే నీవు ఇంటిలో మగాళ్లందరితో బిజీగా ఉంటున్నావు కదా అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ప్రియ చేసిన కామెంట్‌కు లహరి షారి షాక్ తిన్నట్టు కనిపించింది.

యాంకర్ రవితో, మానస్‌తో నీవు అలా

యాంకర్ రవితో, మానస్‌తో నీవు అలా

ప్రియ మాటలకు క్లారిటీ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ.. నేను ఎవరితో బిజీగా ఉన్నానో ఓ సారి చెబుతావా ప్లీజ్ అంటూ లహరి షారి ప్రయత్నించింది. దాంతో నీవు యాంకర్ రవితో, మానస్‌తో బిజీగా ఉన్నావంటూ ప్రియ ఓపెన్ అయింది. దాంతో యాంకర్ రవితోపాటు అందరూ మరోసారి షాక్ తిన్నారు. దాంతో లహరి షారి ఓ వావ్.. సూపర్.. ఎక్స్‌ట్రార్డనరీ అంటూ క్లాప్స్ కొట్టింది. దాంతో ఇంట్లోని కొందరు కూడా చప్పట్లు కొడుతూ కనిపించారు.

సిరితో నా బంధం అలాంటింది...

సిరితో నా బంధం అలాంటింది...

ప్రియ, లహిరి మధ్య మాటల సందర్భంగా జోక్యం చేసుకొంటూ... నేను ఎవరికి దగ్గరయ్యానంటే అంటూ రవి మాట్లాడుతూ.. లహరి కంటే సిరితో నేను ఎక్కువగా క్లోజ్ అయ్యాను. సిరిని నేను ఫ్రెండ్‌గా, సిస్టర్‌గా భావిస్తాను కాబట్టి ఆ క్లోజ్ నెస్ ఉంది అని రవి అంటే.. మీరు అందరి సపోర్ట్ కోసం ప్రయత్నించకండి అంటూ ప్రియ గరం అయింది. దాంతో నేను సపోర్ట్ కోసమా అంటూ రవి తల పట్టుకొని దిగ్బ్రాంతికి గురయ్యాడు.

ప్రియపై భగ్గుమన్న యాంకర్ రవి

ప్రియపై భగ్గుమన్న యాంకర్ రవి

ప్రియ చేసిన వ్యాఖ్యలపై యాంకర్ రవి ఓ దశలో భగ్గుమన్నాడు. నీవు తప్పుడు స్టేట్‌మెంట్స్ ఇవ్వకూడదు.. నీవు అలాంటి మాటలు మాట్లాడకూడదు (యూ కాంట్ మేక్ రాంగ్ స్టేట్‌మెంట్స్. యూ కాంట్ యూజ్ సచ్ స్టేట్ మెంట్స్ లైక్ దిస్) అంటూ సీరియస్ అయ్యాడు. ప్రియపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ప్రియ, యాంకర్ రవికి మధ్య భారీ గొడవ చేసుకొన్నది.

ప్రియపై లహరి షారి ఫైర్

ప్రియపై లహరి షారి ఫైర్

అలాగే ఇంటిలోని మగవాళ్లతో బిజీగా ఉన్నావంటూ తనపై ఆరోపణలు చేసిన ప్రియపై కూడా లహరి షారి గొంతు చించుకొని అరిచింది. నా గురించి మీరు మాట్లాడే హక్కు మీకు లేదు అంటూ లహరి ఘాటుగా స్పందించింది. ఇలాంటి సన్నివేశాలను ప్రోమోలో చూస్తే భారీగానే గొడవ జరిగినట్టు కనిపించింది.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!

మూడో వారం నామినేషన్లలో ఐదుగురు

ఇదిలా ఉండగా, మూడోవారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్‌లో ఐదుగురు ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. అందులో శ్రీరామచంద్ర, లహరి, ప్రియ, ప్రియాంక, మానస్ ఉన్నారు. ఈ సారి టాప్ సెలబ్రిటీలు నామినేషన్‌‌కు గురికావడం చాలా ఆసక్తిగా మారింది. నామినేషన్ ప్రక్రియలో జరిగిన వాదోపవాదాలు వివరంగా చూడాలంటే.. సోమవారం రాత్రి 10గంటలకు ప్రసారమయ్యే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X