అర్ధరాత్రి బాత్రూంలో లహరిని యాంకర్ రవి కౌగిలించుకొంటే తప్పా? ప్రియపై వీజే సన్నీ ఫైర్

బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా యాంకర్ రవి, లహరి షారిపై యాక్టర్ ప్రియ చేసిన కామెంట్లు అగ్గిని రాజేశాయి. ప్రియ చేసిన వ్యాఖ్యలపై ఇంటి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్ధరాత్రి బాత్రూంలో యాంకర్ రవి, లహరి ఇద్దరు కౌగిలించుకొన్నారు. అది నేను చూశాను అంటూ ప్రియ కామెంట్‌పై యాంకర్ రవి, లహరితోపాటు వీజే సన్నీ కూడా అభ్యంతరం వ్యక్తం చేశాడు. అయితే ప్రియ, వీజే సన్నీ మధ్వ జరిగిన భారీ వాగ్వాదం ఏమింటంటే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

వాడు వీడు అంటూ ప్రియ కామెంట్స్

వాడు వీడు అంటూ ప్రియ కామెంట్స్

తనపై కామెంట్ చేసిన ప్రియపై లహరి షారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మీరు మాట్లాడే పద్దతి బాగాలేదు. మగవాళ్లను కూడా వాడు వీడు అంటూ సంబోధిస్తున్నారు. మీరు మాట్లాడే ముందు కంట్రోల్ చేసుకొని మాట్లాడు. వీజే సన్నీని వాడు వీడు అంటూ మాట్లాడటం నేను, ఆయన కూడా గమనించాం అని లహరి షారి అనగానే.. ఆ విషయం గురించి నేను తర్వాత మాట్లాడుతాను అంటూ వీజే సన్నీ చెప్పాడు.

నీవు మాట్లాడే తీరు బాగాలేదు

నీవు మాట్లాడే తీరు బాగాలేదు

ప్రియ మాటలను అభ్యంతరం చెబుతూ.... నీవు మాట్లాడే తీరు బాగాలేదు. ఆనీ మాస్టర్. ప్రియాంక, ఇలా అందరూ ఆడపిల్లలే. కానీ ఒక ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పడు బాగా ఆలోచించుకొని మాట్లాడాలి. సిరి, లహరి కానివ్వండి. మీరు మాట్లాడిన తీరు బాగా లేదు. నీవు ఆడపిల్లవే అంటూ వీజే సన్నీ ఏదో చెప్పబోతుండగా.. నీ పాయింట్ నీవు మాట్లాడు.. కానీ వేరే వాళ్ల పాయింట్‌తో సేఫ్ గేమ్ ఆడకు అంటూ ప్రియ ఏదో చెప్పబోతుంటే.. వీజే సన్నీ మరింత ఫైర్ అయ్యాడు.

హగ్ చేసుకొంటే తప్పు కాదు... అంటూ

హగ్ చేసుకొంటే తప్పు కాదు... అంటూ

ఇంటిలో ఒకరిని హగ్ చేసుకొంటే తప్పుకాదు. అర్ధరాత్రి, బాత్రూం అంటూ మీరు చేసిన కామెంట్లు బాగాలేవు. ఓ హగ్‌ను రాంగ్‌గా ఎలా ట్రీట్ చేస్తారు? అని వీజే అంటే... అవును మీరు ఆ విషయాన్ని అలా ఎలా చెబుతారు. మీరు సేఫ్ ఆడాలంటే.. మీరు ఆడుకోండి. కానీ ఒకరిపై అబ్యూజ్ చేయకండి. మీకు ఆడ పిల్లలు ఉన్నారు. ఒక ఆడపిల్లను బ్లేమ్ చేయడం సరికాదు అంటూ యాంకర్ రవి అన్నారు. దాంతో నామినేషన్లలో గందరగోళం ఏర్పడటంతో ఆ ప్రక్రియను ఆపేశారు.

వీజే సన్నీపై ప్రియ ఫైర్

వీజే సన్నీపై ప్రియ ఫైర్

ఆ తర్వాత వీజే సన్నీతో ప్రియ మాట్లాడుతూ.. నేను పక్కన ఉండగా.. మీరు ఇద్దరు బెడ్‌పై మగవాళ్ల గురించి ఏదో మాట్లాడుతూ చేసిన కామెంట్లు నాకు ఇబ్బందిగా మారాయి అని ప్రియ అంటే... నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడలేదు అని వీజే సన్నీ అంటే.. అలా మహిళ పక్కన ఉన్నప్పుడు అభ్యంతరకరంగా మాట్లాడవచ్చా అంటూ ప్రియ ప్రశ్నించింది. అయితే తాను నా ఫ్రెండ్ గురించి మాత్రమే మాట్లాడాను. ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదు అంటూ వీజే సన్నీ చెప్పారు. దాంతో ఆ విషయంపై మరింత గొడవ జరిగింది. ప్రియాంక, ఇతర సభ్యులు వారి గొడవను ఆపేందుకు ప్రయత్నించారు.

Recommended Video

Love Story Pre Release Event | Ap Govt కి చిరు విన్నపాలు!!
మాది సిస్టర్, బ్రదర్ రిలేషన్ మాత్రమే

మాది సిస్టర్, బ్రదర్ రిలేషన్ మాత్రమే

అయితే ప్రియ, వీజే సన్నీ గొడవ కూడా యాంకర్ రవి, లహరిపై చేసిన కామెంట్ మీదే జరిగింది. సిరి, శ్వేతా, కాజల్‌తో ఉన్న రిలేషన్ మాత్రమే లహరి షారి తో ఉంది. మా మధ్య ఒక సిస్టర్, బ్రదర్ రిలేషన్ మాత్రమే ఉంది. దానిని మీరు తప్పుగా ప్రొజెక్ట్ చేయడం బాగాలేదు అని యాంకర్ రవి గట్టిగా మందలించారు. మీ మైండ్ సెట్ బాగాలేదు. మీరు ఏదో ఏదో మాట్లాడుతున్నారు అంటూ యాంకర్ రవి వార్నింగ్ ఇచ్చారు. అయితే గొడవ కంట్రోల్ తప్పుతున్నదని గ్రహించిన ప్రియ క్షమాపణలు చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X