Bigg Boss Telugu 5th Week nominations: ఏకంగా తొమ్మిది మంది నామినేట్.. ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటూ..
బుల్లితెరపై అత్యంత ప్రేక్షకదారణను సొంతం చేసుకొన్న రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 ఐదోవారంలోకి ప్రవేశించింది. గత నాలుగు వారాలుగా ఐదు రెట్ల వినోదాన్ని అందిస్తూ ఇంటి సభ్యులు టైటిల్ రేసులో పరుగులు పెడుతున్నారు. ఇక ఐదోవారం ఇంటి నుంచి బయటకు వెళ్లె సెలబ్రిటీలకు సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తి అయింది. ఐదోవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లే అవకాశం ఉన్న జాబితాలో ఎవరెవరూ చేరారంటే..

నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్
బిగ్‌బాస్ రియాలిటీ షోకు సంబంధించి ఆదివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో నటరాజ్ మాస్టర్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. సరయూ రాయ్, ఉమాదేవి, లహరి షారి గత మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఇక నాలుగో వారంలో పోటాపోటీగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కావడం అభిమానులకు షాకిచ్చినట్టు అయింది. ఇక తన భార్య డెలివరీకి సిద్ధంగా ఉన్న సమయంలో తనను భగవంతుడు ఆమె వద్దకు పంపిస్తున్నారని అనుకొంటున్నాను అంటూ నటరాజ్ మాస్టర్ వేదిక మీద నుంచి వ్యక్తం చేశారు.

సీక్రెట్ రూంలో నామినేషన్ ప్రక్రియ
ఇక నాలుగో వారం ఎలిమినేషన్ తర్వాత ఐదో వారం నామినేషన్స్ కోసం ఇంటిలో హడావిడి మొదలైంది. ఇంటి సభ్యులతో నేరుగా కాకుండా.. ప్రత్యేకమైన గదిలోకి కంటెస్టెంట్లను పిలిచి నామినేషన్స్ ప్రక్రియను బిగ్‌బాస్ మొదలుపెట్టారు. ఎదుటి కంటెస్టెంట్లను ఎందుకు నామినేట్ చేయాలనుకొంటున్నారు? ఎవరిని నామినేట్ చేస్తున్నారు? అందుకు గల కారణాలు చెప్పి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు సూచనలు చేశారు. దాంతో ఒక్కొక్కరు తమకు నచ్చని వారిని, ఇంటిలో పెద్దగా రాణించలేని వారిని సూచిస్తూ నామినేట్ చేశారు.

ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం
తాజా ప్రోమో ప్రకారం.. ప్రతీ ఇంటి సభ్యుడు ఇద్దరు వ్యక్తులను నామినేట్ చేయాలని బిగ్‌బాస్ సూచించడంతో.. ప్రతీ ఒక్కరు ఇద్దరి పేర్లను బయటపెట్టారు. సీక్రెట్ రూమ్‌లో కాకపోయినా.. బయట నిర్వహించినా ఆ ఇద్దరి పేర్లనే నేను చెప్పేవాడిని అంటూ వీజే సన్నీ.. నా స్ట్రాటజీ ప్రకారం.. నన్ను నామినేట్ చేసిన వాళ్లను నేను నామినేట్ చేస్తున్నాను అంటూ కాజల్, నాలోని కోపం బయటకు చూపకపోతే.. షన్ను ఎవరిని నామినేట్ చేసేవాడో నాకు తెలుసు అంటూ లోబో చెప్పడం కనిపించింది.

వీజే సన్నీపై ప్రియ కంప్లయింట్
యాంకర్ రవి, ప్రియ, విశ్వ తదితరులు తమ కారణాలను చెప్పి నామినేట్ చేయడం జరిగింది. ప్రతీసారి నన్ను సన్నీ టార్గెట్ చేస్తున్నట్టు కనిపించింది అంటూ ప్రియ, తన గేమ్ ఆడకుండా పక్క వాళ్ల గేమ్ ఆడుతున్నారు అంటూ ప్రియ కంప్లైట్ చేశారు. ఇక గ్రూపిజం చేస్తున్నారు అంటూ శ్రీరామచంద్ర కామెంట్ చేయడం కనిపించింది. విశ్వపై షన్ను, జస్వంత్‌పై యాంకర్ రవి ఫిర్యాదు చేస్తూ నామినేట్ చేశారు.
Recommended Video

ఐదోవారం నామినేట్ అయిన వారు వీరే..
ఇక ఐదో వారం నామినేషన్ నుంచి కెప్టెన్ శ్రీరామచంద్ర మినహాయించారు. ఫిర్యాదులతో సాగిన నామినేషన్ ప్రక్రియ అనంతరం ఐదోవారంలో మొత్తం తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. తాజా సమాచారం ప్రకారం. షణ్ముఖ్, వీజే సన్నీ, జస్వంత్, యాంకర్ రవి, మానస్, విశ్వ, హమీదా ఖాతూన్, లోబో, శైలజా ప్రియ నామినేట్ అయ్యారు. ఈ వారం కూడా టాప్ కంటెస్టెంట్లు నామినేట్ కావడంతో ఈ సారి ఎలిమినేషన్ మరింత ఆసక్తిగా మారింది.


Click it and Unblock the Notifications











