Bigg Boss Telugu 5 Week 6 Elimination: డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు.. ఎవరు ఎలిమినేట్ అవుతారంటే?
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో మరో ఎలిమినేషన్‌కు సిద్దమవుతున్నది. ఇప్పటికే ఇంటి నుంచి ఐదుగురు సెలబ్రిటీ బయటకు వచ్చారు. ఆరోవారం ఎలిమినేషన్ ప్రక్రియ మరింత ఆసక్తిగా మారింది. అయితే ఈ సారి ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లిపోతారనే విషయం బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో, అభిమానుల్లో చర్చనీయాంశమైంది. ఆ వివరాల్లోకి వెళితే..

ఆరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధం
బిగ్‌బాస్ తెలుగు 5 సీజన్ సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమై ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా దేశవ్యాప్తంగా నంబర్‌వన్ స్థాయిలో రేటింగ్‌ను నమోదు చేస్తున్నది. గత ఐదు వారాలుగా ఐదుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం సరయు రాయ్, రెండోవారం ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా ఖాతూన్ ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఇప్పుడు ఆరోవారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది.

పది మంది నామినేషన్‌లో
ప్రస్తుతం కొనసాగుతున్న ఆరోవారంలో మొత్తం పది మంది నామినేట్ అయ్యారు. నామినేట్ అయిన వారిలో యాంకర్ రవి, శ్రీరామచంద్ర, జెస్సీ, సిరి హన్మంతు, లోబో, వీజే సన్నీ, మానస్, ప్రియాంక, విశ్వ, శ్వేతా వర్మ ఉన్నారు. ఈ వారం అందరూ టాప్ సభ్యులు, టైటిల్ గెలవడానికి అర్హతవారే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఆసక్తిగా మారింది.

ఎవరెవరికీ ఎంత ఓటింగ్ అంటే..
సోమవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు నమోదైన ఓటింగ్ శాతం ఇలా ఉంది. షణ్ముఖ్‌కు 30 శాతం, సన్నీ 19 శాతం, శ్రీరామచంద్ర 16 శాతం, యాంకర్ రవి 7 శాతం, శ్వేత వర్మ 6 శాతం, జెస్సీ 5.5 శాతం, సిరి హన్మంతు 5 శాతం, విశ్వ 5 శాతం, ప్రియాంక 5 శాతం, లోబో 5 శాతం ఓట్లతో ఓట్లతో కొనసాగుతున్నారు.

ఇప్పటి వరకు నమోదైన ఓట్లు
ఇక గత రెండు రోజుల్లో హాట్ స్టార్ యాప్‌లో భారీగా నమోదైన ఓట్లలో వివరాలు ఉన్నాయి. షణ్ముఖ్ 13 వేల ఓట్లకుపైగా, వీజే సన్నీ 11 వేల ఓట్లకుపైగా, శ్రీరామచంద్ర 7500 ఓట్లకుపైగా, శ్వేతా వర్మ 7000 ఓట్లకుపైగా, యాంకర్ రవి 4500 ఓట్లకుపైగా, జస్వంత్ పడాల 4 వేల ఓట్లకుపైగా, ప్రియాంక సింగ్ 3 వేల ఓట్లకుపైగా, లోబో 3 వేల ఓట్లకుపైగా, విశ్వ 3 వేల ఓట్లకుపైగా ఓట్లు నమోదయ్యాయనేది తాజా సమాచారం.
Recommended Video

ఎలిమినేషన్‌లో మిస్డ్ కాల్ డేటా కీలకంగా
అయితే హాట్ స్టార్ యాప్‌లో నమోదైన వివరాలు పక్కన పెడితే.. మిస్డ్ కాల్ డేటానే ఎలిమినేషన్‌లో కీలకంగా మారుతుందనే విషయం పలు సందర్భాల్లో రుజువు అయ్యాయి. అయితే మిస్డ్ కాల్ డేటాను బిగ్‌బాస్ నిర్వాహకులు సీక్రెట్‌గా మెయింటెయిన్ చేయడం వల్ల ఎవరు అవుట్ అవుతారనేది ఖచ్చితంగా చెప్పడం కష్టం. అయితే ఈ వారం తక్కువ శాతం ఓటింగ్, ఓట్లతో లోబో, ప్రియాంక, విశ్వ మెడపై కత్తి వేలాడుతున్నది. అయితే చివరి నిమిషంలో ఈ వేటు నుంచి ఎవరు బయటపడుతారనేది మిస్డ్ కాల్ డేటాలో స్పష్టమవుతుంది. ఎక్కువగా విశ్వ ఎలిమినేట్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తున్నది. అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారో కాస్త వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











