Bigg Boss యాంకర్ రవి అలాంటి వాడు.. మానస్ డేంజర్.. ఎలిమినేషన్ తర్వాత శ్వేతా వర్మ షాకింగ్ కామెంట్స్

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ఆరోవారం ముగిసింది. ఇంటి నుంచి ఇప్పటి వరకు 6 కంటెస్టెంట్స్ బయటకు వచ్చారు. ఆరోవారంలో ఇంటి నుంచి శ్వేతా వర్మ ఎలిమినేట్ అయ్యారు. శ్వేత ఇంటి నుంచి నేరుగా నాగార్జున వద్దకు వచ్చి ఇంటిలో తన అనుభవాలను పంచుకొన్నారు. ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరి గురించి తన అభిప్రాయాలను వెల్లడించింది. శ్వేత వర్మ ఎలిమినేషన్ ప్రాసెస్ ఎలా జరిగిందంటే..

 ఫన్ డే రోజున ఎలిమినేషన్ ప్రక్రియ

ఫన్ డే రోజున ఎలిమినేషన్ ప్రక్రియ

సండే కావడంతో ఇప్పటిలానే ఫన్ డే వాతావరణం కనిపించింది. నాగార్జున ఇంటి సభ్యులతో రకరకాల గేమ్స్ ఆడించారు. ఆటలు ఆడిస్తూనే ఎలిమినేషన్ ప్రక్రియను చేపట్టారు. నామినేట్ అయిన పది మందిలో ఒకరు నిన్న ఎలిమినేట్ అయి సీక్రెట్ రూమ్‌లోకి లోబో చేరిన విషయం తెలిసిందే.

చివరికి శ్వేతావర్మ, జెస్సీ, సిరి హన్మంతు

చివరికి శ్వేతావర్మ, జెస్సీ, సిరి హన్మంతు


ఇక తొమ్మిది మందిలో ఒక్కక్కొరిని సేఫ్ చేస్తూ ఆటలను కొనసాగించాడు. తొలుత ప్రియాంక సింగ్ ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. ఆ తర్వాత షణ్ముఖ్ సేఫ్ అయ్యారు. అలా అందర్నీ సేఫ్ చేస్తూ చివరకు ఎలిమినేషన్‌లో శ్వేతా వర్మ, జెస్సీ, సిరి హన్మంతు మిగిలారు. ఆ ముగ్గురిలో జెస్పీ సేఫ్ కావడంతో చివరికి సిరి హన్మంతు, శ్వేతా వర్మ మిగిలారు.

శ్వేతా వర్మ ఎలిమినేషన్ ఇలా..

శ్వేతా వర్మ ఎలిమినేషన్ ఇలా..


లాన్‌లోకి సిరి, శ్వేతాను పిలిచి ఫైనల్‌ ఎలిమినేషన్ ప్రాసెస్‌ను చేపట్టారు. ఇద్దరికి చెరో సుత్తి ఇచ్చి బాక్స్‌ను పగలకొట్టమన్నారు. ఆ తర్వాత అందులో ఉన్న బాక్స్‌లో నుంచి రెండు బాక్స్ తీసుకొని వారిని లివింగ్ హాల్‌లోకి తీసుకొచ్చారు. అందులో నుంచి ఒక స్లిప్ తీయగా అందులో సిరి హన్మంతు సేఫ్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. దాంతో శ్వేతా వర్మ బిగ్‌బాస్ తెలుగు 5 నుంచి బయటకు వచ్చారు.

అని మాస్టర్ ఎమోషనల్‌గా

అని మాస్టర్ ఎమోషనల్‌గా

శ్వేతా వర్మ ఇంటి నుంచి బయటకు వెళ్తున్నారనే విషయం తెలియగానే అనీ మాస్టర్ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. కంటతడి పెట్టుకొంటూ ఆమె కనిపించారు. ఇంటిలోని ప్రతీ ఒక్కరు శ్వేతాను భారమైన హృదయంతో బయటకు పంపించారు. ఇక నాగార్జునతో వేదిక మీద జతకలిసింది. నీవు వస్తుంటే ఇంటిలో అందరూ ఎమోషనల్‌గా కనిపించారు అని నాగార్జున అడిగితే.. నేను ప్రతీ ఒక్కరితో చాలా కనెక్ట్ అయ్యాను. చాలా విషయాలు పంచుకొన్నాం అని శ్వేతా వర్మ చెప్పింది.
ఆరు వారాల బిగ్‌‌బాస్ జర్నీ

ఆరు వారాల బిగ్‌‌బాస్ జర్నీ


నాగార్జునతో కలిసి తన ఆరువారాల ప్రయాణాన్ని శ్వేతా వర్మ చూసింది. ఆ తర్వాత కొందరు కంటెస్టెంట్ల గురించి కార్డు పెడుతూ.. ఎవరికి దూరంగా అంటే.. యాంకర్ రవి పేరు చెప్పి.. అతడి స్ట్రాటజీ డిఫరెంట్. అతడికి ఇన్‌ఫ్లూయెన్స్ కాకూడదు అంటూ చెప్పింది. అలాగే మానస్ డేంజర్ అని.. ఆయన ఆట ఎవరికి అంతుపట్టదు. ఈ క్షణంలో ఒకలా ఉంటే మరో క్షణంలో మరో రకంగా ఉంటాడు అని శ్వేతా వర్మ చెప్పింది. ఈ రెండు పాయింట్లు వారి బలాన్ని చెబుతుంది అని శ్వేతా వర్మ చెప్పింది. మాట మార్చే తీరు కాజల్‌కు ఉంటుందని చెప్పింది. మానస్, సన్నీ, విశ్వ మంచి కంటెస్టెంట్లు.. మీ గేమ్‌కు పదును పెట్టండి అంటూ సూచించింది.

Recommended Video

Bigg Boss Telugu 5 : సిరి ని ఘోరంగా అవమానించిన షణ్ముఖ్.. తెగ ఏడ్చేసిన సిరి..! || Filmibeat Telugu
శ్రీరామచంద్ర పాటతో మరింత ఉద్వేగంతో

శ్రీరామచంద్ర పాటతో మరింత ఉద్వేగంతో


శ్వేతా వర్మకు గుడ్ బై చెప్పే ముందు ఒక పాట పాడమని శ్రీరామచంద్రను కోరితే ముస్తఫా ముస్తఫా అంటూ పాట పాడారు. శ్రీరామచంద్ర పాట తర్వాత ఇంటి సభ్యులందరూ ఎమోషనల్ అయ్యారు. అలా ఇంటి సభ్యుల గురించి నాలుగు మంచి మాటలు చెప్పి.. బిగ్ బాస్ నుంచి నిష్క్రమించింది. లోబో సీక్రెట్ రూమ్ నుంచి ఎప్పుడైనా ఇంటిలోకి వెళ్లే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X