Bigg Boss Telugu 5 nominations.. వెధవ.. సిగ్గు ఉండాలి.. లోబో, విశ్వపై విరుచుకుపడ్డ ప్రియాంక సింగ్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో అక్టోబర్ 11వ ఎపిసోడ్ సోమవారం నామినేషన్ల ప్రక్రియ కావడంతో ఇళ్లంతా గరంగరంగా కనిపించింది. ఇంటి సభ్యులు ఓ రేంజ్‌లో ఆగ్రహంతో కనిపించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందే తమ వ్యూహాలకు పదును పెట్టారు. 36వ రోజు షోలో ఏం జరిగిందంటే...

Recommended Video

Bigg Boss Telugu 5 : అక్కా తొక్కా అని పిలవకండి.. రెచ్చిపోయిన ఆనీ మాస్టర్..! || Filmibeat Telugu
లోబో నీవు నమ్మక ద్రోహివి

లోబో నీవు నమ్మక ద్రోహివి

లోబోను నామినేట్ చేస్తూ.. వద్దు అన్నావు.. నీవే స్టార్ట్ చేశావు. గేమ్‌ను గేమ్‌లానే ఆడాలి. రూల్స్ ప్రకారమే గేమ్ ఆడాను. నీవు అక్కడ ఉండాలి. కానీ నీవు నిద్ర వచ్చి పక్కకు వెళ్లిపోయావు. దాంతో ఎవరు చేయాల్సిన పని వాళ్లు చేసుకొన్నారు. ఇక నీవు నమ్మకం గురించి మాట్లాడుతున్నావు. మహారాజా టాస్క్‌లో ముందు నుంచి వీజే సన్నీవైపు ఉండి ఆ తర్వాత యాంకర్ రవి వైపుకు వెళ్లిపోవడం నమ్మకాన్ని వమ్ము చేయడమే కదా. నీవు నమ్మకం గురించి మాట్లాడటం సరికాదు అని ప్రియాంక సింగ్ అన్నారు.

ఇంటి నుంచి వెళ్లిపొమ్మని డైరెక్టుగా

ఇంటి నుంచి వెళ్లిపొమ్మని డైరెక్టుగా


నామినేషన్ వేయడం అంటే మమూలు మాట అనుకొంటున్నావా? నామినేషన్ వేయడం అంటే ఇంటి నుంచి వెళ్లి పోమ్మని డైరెక్ట్‌గా చెప్పడం. ఎవరి అదృష్టం ఉంటే వాళ్లు ఈ ఇంట్లో ఉంటారు. అలాంటి ప్రమాదంలోకి నెట్టి.. సిల్లీ రిజన్స్‌తో నామినేట్ చేయడం తప్పు. సిల్లీ రీజన్స్ ఇవ్వడానికి నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా. యాంకర్ రవి వైపు వెళ్లే ముందు సన్నీకి చెప్పావా? నమ్మకం గురించి మాట్లాడటానికి సిగ్గు ఉండాలి అంటూ ప్రియాంక ఘాటుగా స్పందించింది.

కండబలం కాదు.. విశ్వ.. బుద్దిబలం

కండబలం కాదు.. విశ్వ.. బుద్దిబలం


విశ్వను నామినేట్ చేస్తూ.. కండబలం కాదు.. బుద్ధిబలం ఉపయోగించాలి. కెప్టెన్సీ టాస్క్ సమయంలో బకెట్స్ ఉండాలి. కానీ బకెట్స్ ఉంటే గేమ్ మరోలా ఉండేదేమో. బకెట్స్ అటు ఇటూ పడేసి గేమ్‌ను తప్పుదోవ పట్టించావు. అందరూ ట్యాంక్‌‌లు అలానే ఉంటే గేమ్ ఎలా అవుతుంది? కెప్టెన్ ఎవరు అవుతారు అని ప్రియాంక ఫైర్ అయింది.

అరవడం తగ్గించు ప్రియాంక

అరవడం తగ్గించు ప్రియాంక


అయితే ప్రియాంక కాస్త అరవడం కొంచెం తగ్గించి మాట్లాడు అంటూ.. నా నోరే అంతా అంటూ ప్రియాంక అదే మాదిరిగా సమాధానం చెప్పింది. నేను తప్పు మాట్లాడటం లేదు. అన్నయ్య అంటూ మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు అమర్యాదకంగా మాట్లాడలేదు. వెధవ రీజన్స్ అంటూ విశ్వ ఫోటోను మంటలో వేసింది. అయితే వెధవ రీజన్స్ అనకు.. నీవే వెధవ రీజన్స్ చెబుతున్నావు అంటే సేమ్ టూ యూ. అంటూ గట్టిగా అరిచింది.

6వ వారంలో 10 మంది నామినేట్

6వ వారంలో 10 మంది నామినేట్

బిగ్‌బాస్ ఇంటిలో 6వ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు 10 మంది. యాంకర్ రవి, శ్వేతా వర్మ, శ్రీరామచంద్ర, జెస్సీ, సిరి హన్మంతు, లోబో, వీజే సన్నీ, మానస్, ప్రియాంక, విశ్వ నామినేట్ అయ్యారు. ఈ వారం మొత్తం పది మంది ఉండటం ఆసక్తిగా మారింది. అందరూ టాప్ సెలబ్రిటీలు ఉండటంతో ఎవరు వెళ్లిపోతారనే విషయం అత్యంత చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X