Bigg Boss Telugu 7 week Elimination..ఏడో వారం మరో మహిళా కంటెస్టెంట్ అవుట్.. అందరూ ఊహించినట్టుగానే
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ఏడోవారం ఎలిమినేషన్‌కు రంగం సిద్దమైంది. గత కొద్ది వారాలుగా ఇంటి నుంచి మహిళా కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోయారు. ప్రస్తుతం వారంలో ఇద్దరు మహిళా కంటెస్టెంట్లు ప్రియ, అని మాస్టర్ ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. తాజా సమాచారం ప్రకారం.. ప్రస్తుత వారం మహిళా కంటెస్టెంట్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ కంటెస్టెంట్ ఎవరంటే..

బిగ్‌బాస్ తెలుగు నుంచి ఎలిమినేట్
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆరుగురు సభ్యులు ఎలిమినేట్ అయ్యారు. తొలి వారం సరయు రాయ్, రెండో వారం ఉమాదేవి, మూడో వారం లహరి షారి, నాలుగో వారం హమీదా ఖాతూన్, ఐదో వారం నటరాజ్ మాస్టర్, ఆరో వారం శ్వేతా వర్మ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ వారం కూడా మహిళా కంటెస్టెంట్ ఇంటి నుంచి వెళ్లిపోతున్నారనే విషయం వైరల్‌గా మారింది.

నామినేషన్ ఉన్నది వీరే..
ఇక ప్రస్తుతం అంటే ఏడో వారానికి ఎలిమినేషన్ ప్రక్రియ కోసం మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. అందులో ఈ వారం ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సిరి హన్మంతు, జస్మంత్ పడాల, లోబో, ఆర్జే కాజల్, ప్రియ, యాంకర్ రవి, అనీ మాస్టర్, శ్రీరామచంద్ర నామినేషన్‌లో ఉన్నారు. అయితే ప్రియ, అని మాస్టర్ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు అవకాశాలు ఉన్నాయి. వారికి అతి తక్కువ ఓట్లు వచ్చాయనే విషయం కొద్ది రోజులుగా రిపోర్టులు తేల్చేశాయి.

ప్రియ, అని మాస్టర్‌కు పోటాపోటీగా
అయితే హాట్ స్టార్ యాప్‌లో నమోదైన ఓట్ల విషయానికి వస్తే ప్రియ, అని మాస్టర్‌కు పోటాపోటీగా ఓట్లు తెచ్చుకొన్నారు. కానీ మిస్డ్ కాల్ డేటా ప్రకారం ప్రియ పైచేయి సాధించారు. దాంతో ప్రియ ఏడో వారం ఎలిమినేట్ అయ్యారు. దాంతో ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఏడో వ్యక్తిగా ప్రియ మారారు. అయితే ఇంటి నుంచి ఇప్పటి వరకు ఆరుగురు మహిళా కంటెస్టెంట్లు వెళ్లిపోవడం అత్యంత చర్చనీయాంశమైంది.

ప్రియ ఎలిమినేషన్‌తో
ప్రియ ఎలిమినేషన్ సందర్భంగా ఇంటిలో భావోద్వేగాలు నెలకొన్నాయి. ఇంటి సభ్యులందరూ చాలా ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా శ్రీరామచంద్ర కన్నీటి పర్యంత అయ్యారు. అలా ఆమెకు గ్రాండ్‌గా గుడ్‌బై చెప్పారు అనే విషయం బయటకు వచ్చింది. అయితే ప్రియ ఎలిమినేట్ మాత్రం బిగ్‌బాస్ ప్రేక్షకుల్లో కొందరికి జీర్ణించుకోలేని విషయంగా మారింది.

అని మాస్టర్‌కు అనుకూలంగా
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో టాస్క్‌లు 100 శాతం ఆడే కంటెస్టెంట్లలో అని మాస్టర్ ఒకరు. ఆమె టాస్క్‌ను మగవారితో సమానంగా ఆడటానికి ప్రయత్నిస్తారు. అలాగే సింగిల్ ఫెర్ఫార్మర్‌గా ఇంటిలో ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏ గ్రూప్‌లో చేరడానికి ఆసక్తి చూపలేదు. అలాంటి అనీ మాస్టర్ సేఫ్ కావాలని కోరుకొన్నారు. ఎలాంటి గేమ్ ప్రదర్శించని ప్రియ ఎలిమినేట్ కావడంపై కొందరు సరైనదే అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











