Bigg Boss Telugu 7th Week Elimination: డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు.. ఎవరెవరికి ఎన్ని ఓట్లు పడ్డాయంటే?

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటి షోలో ఏడోవారం ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నది. ఈ వారం మొత్తం ఎనిమిది కంటెస్టెంట్లు నామినేట్ కావడం, అందులో అందరూ టాప్ కంటెస్టెంట్లు కావడం ఆసక్తిగా మారింది. ఈ వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారనే విషయం బిగ్‌బాస్ అభిమానుల్లో అత్యంత చర్చనీయాంశమవుతున్నది. అయితే తాజా ఓట్ల ప్రకారం ఎవరి జాతకం ఎలా ఉందంటే...

Photo Courtesy: Star మా and Disney+Hotstar

గత ఆరువారాల్లో ఎలిమినేషన్

గత ఆరువారాల్లో ఎలిమినేషన్

గత ఆరువారాల్లో ఎలిమినేషన్ ప్రక్రియ అంత సంతృప్తికరంగా లేకపోయిందనే విమర్శ వస్తున్నది. ఇంటిలో బలమైన కంటెస్టెంట్‌గా శ్వేతా వర్మ అనిపిస్తున్న తరుణంలో ఆమె అరెస్ట్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఈ వారం ఎవరు వెళ్లిపోతారనే విషయం ఇంట్రెస్ట్‌గా మారింది.

 నామినేషన్‌లో ఎనిమిది మంది

నామినేషన్‌లో ఎనిమిది మంది

బిగ్‌బాస్ ఇంటిలోని సభ్యుల్లో ఏడో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ ప్రక్రియలో ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వారిలో శ్రీరాం, యాంకర్ రవి, జెస్సీ, అని మాస్టర్, ప్రియ, సిరి హన్మంతు, కాజల్, లోబో ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇంటిలో వీరందరూ టైటిల్ గెలువడానికి అవకాశం ఉన్న కంటెస్టెంట్స్ కావడం విశేషంగా మారింది.

 టాప్ 5 ఓటింగ్ జాబితాలో రవి, శ్రీరామ్

టాప్ 5 ఓటింగ్ జాబితాలో రవి, శ్రీరామ్

నామినేషన్ తర్వాత జరిగిన ఓటింగ్ వివరాల్లోకి వెళ్లితే టాప్ ఫైవ్‌లో ఎవరున్నారనేది ఆసక్తికరంగా మారింది. శ్రీరామచంద్ర, యాంకర్ రవి, జస్వంత్ పడాల, కాజల్ టాప్ రేంజ్‌లో ఓట్లు సంపాదించుకొన్నారు. శ్రీరామచంద్ర 20 శాతం ఓట్లు, యాంకర్ రవి 17 శాతానికి పైగా, జస్వంత్ పడాల 15 శాతం, కాజల్ 11 శాతం ఓట్లతో ముందున్నారు. ఇది గురువారం ఉదయం నాటికి ఉన్న ఓటింగ్ శాతం కావడం గమనార్హం.

ఎలిమినేష్ ముప్పులో ఆ ముగ్గురు

ఎలిమినేష్ ముప్పులో ఆ ముగ్గురు

ఇక లోబో, అని మాస్టర్, ప్రియ, సిరి హన్మంతు తక్కువ ఓట్లు సంపాదించుకొన్న జాబితాలో చేరి ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. లోబో దాదాపు 10 శాతానికిపైగా ఓట్లు సంపాదించుకోగా, 10 శాతం కంటే తక్కువగా సిరి హన్మంతు, ప్రియ, ఆని మాస్టర్ సంపాదించుకొన్నారు.

Recommended Video

Shahrukh Khan కి టఫ్ టైమ్.. ఉచ్చులో Ananya Pandey | King Khan ఆవేదన || Filmibeat Telugu
ఏడో వారం కూడా మిస్డ్ కాల్ డేటానే కీలకం

ఏడో వారం కూడా మిస్డ్ కాల్ డేటానే కీలకం

అయితే తాజాగా హాట్ స్టార్ ఓటింగ్ ప్రకారం సిరి హన్మంతు, అని మాస్టర్, ప్రియ తక్కువ ఓట్లు రాగా, ఎలిమినేషన్ ప్రక్రియలో మిస్డ్ కాల్ డేటా కీలకం కానున్నదనేది విశ్లేషకులు భావిస్తున్నారు. మిస్డ్ కాల్ డేటా సీక్రెట్‌గా ఉంచడం కారణంగా ఎలిమినేషన్ ప్రక్రియను ఊహించడం కష్టమే. కానీ ఈ వారం ప్రియ, అని మాస్టర్‌, సిరి హన్మంతులో ఒకరు ఎలిమినేట్ కావడం తథ్యం అనే మాట వినిపిస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X