Bigg Boss Telugu 5 Nominations: కుక్క కాటుకు చెప్పుదెబ్బ .. యాంకర్ రవిపై ప్రియ ఫైర్.. ప్రియాంక విసిరి కొడుతూ..

బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ఏడోవారానికి నామినేషన్ల ప్రక్రియను మొదలైంది. నామినేషన్ ప్రక్రియను కొత్తగా మొదలుపెట్టినట్టు యాంకర్ రవి తనకు వచ్చిన సందేశాన్ని చదవి వినిపించారు. అయితే ఏడోవారం మొదటి రోజున ఇంటి సభ్యుల మధ్య వాడివేడిగా మాటల యుద్ధంతోపాటు గొడవలు కూడా కనిపించాయి. నామినేషన్ల ప్రక్రియలో ప్రియాంక సింగ్, ప్రియ, కాజల్, వీజే సన్నీ మధ్య జరిగిన వాగ్వాదం ఎలా ఉందంటే...

వేటగాళ్లుగా సన్నీ, శ్రీరామచంద్ర, జెస్సీ

వేటగాళ్లుగా సన్నీ, శ్రీరామచంద్ర, జెస్సీ

ఏడోవారంలో నామినేషన్ల ప్రక్రియ ఎప్పుడు జరగని విధంగా జరుగుతంది. ఇంటిలో ముగ్గురు వేటగాళ్లును పెట్టారు. నామినేషన్ ప్రక్రియ కోసం వీజే సన్ని, శ్రీరామచంద్ర, జెస్సీ వేటగాళ్లుగా మారిపోయారు. నామినేషన్ల ప్రక్రియలో కనిపించినదేమిటంటే.. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారంటూ ప్రియాంక చేతిలో ఉన్న వస్తువును విసిరికొట్టింది. నా గేమ్ స్ట్రాటజీ ఇదే.. కుక్క కాటుకు చెంపదెబ్బ అంటూ యాంకర్ రవిని వీజే సన్నీ నామినేట్ చేశాడు.

నామినేషన్ల ప్రక్రియలో భారీ గొడవ

నామినేషన్ల ప్రక్రియలో భారీ గొడవ


షణ్ముఖ్ తనకు అవకాశం రావడంతో అనీ మాస్టర్‌ను నామినేట్ చేయగా.. సిరి హన్మంతు మాత్రం మానస్‌ను నామినేట్ చేసింది. నాకు సారీ చెప్పినప్పటికీ నేను కన్విన్స్ కాలేదు. అందుకే నేను మానస్‌ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. తనను నామినేట్ చేయడంపై ఎదుటి కంటెస్టెంట్‌పై సిరి హన్మంతు అసహనం వ్యక్తం చేసింది. ఎలాంటి కారణం లేకుండా నామినేట్ చేస్తున్నారు అంటూ సిరి అంటే.. చదువుకొన్నాడా? లేదో అంటూ అని మాస్టర్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అని మాస్టర్‌పై యాంకర్ రవి కవిత

అని మాస్టర్‌పై యాంకర్ రవి కవిత

ఇక అనీ మాస్టర్‌ను ఉద్దేశించి జోష్‌గా యాంకర్ రవి కవితను చదివాడు. అని ఓ అని.. చేస్తావు మమల్ని చేస్తావు నామినేషన్ స్ట్రాంగ్ అని.. శ్వేత పోయింది ఎవరిని అంటావు కూతురు అని అంటూ రవి కవితను లయబద్ధంగా చదివాడు. దాంతో అనీ మాస్టర్ వాహ్ వా అంటూ ప్రశంసించింది. ఇదిలా ఉండగా శ్వేతా ఉంటే నేను నిజంగా నామినేట్ చేసేవాడిని అని సన్నీ అంటే.. నా వల్ల శ్వేతా వెళ్లిందా అంటూ యాంకర్ రవి గట్టిగా అరవడం కనిపించింది. సన్నీ ఎందుకిలా చేస్తున్నాడు అంటూ అని మాస్టర్ వాపోయింది.

సోఫా మీద టవల్ వేస్తున్నాడు అంటూ

సోఫా మీద టవల్ వేస్తున్నాడు అంటూ

యాంకర్ రవిని ప్రియ నామినేట్ చేసింది. తన నామినేషన్‌కు కారణం చెబుతూ.. ప్రతీ రోజు సోఫా మీద టవల్‌ను ఆరవేస్తున్నాడు. అందుకే నామినేట్ చేస్తున్నాను అని ప్రియ అంటే రవి షాక్ తిన్నాడు. అవును నిజమే.. నా రీజన్ అదే అంటూ ప్రియ చెప్పడంతో అందరూ షాక్ తిన్నారు. దాంతో పక్కనే ఉన్న ప్రియాంక చేతిలో ఉన్న వస్తువును విసిరి కొట్టి ప్రియవైపు కోపంగా చూస్తూ.. అందరూ సేఫ్ గేమ్ ఆడుతున్నారు. నాకు ఇలాంటి నకిలీ మనుషుల మధ్య ఉండటం ఇష్టం లేదు అంటూ ప్రియాంక గట్టిగా అరిచింది.

Recommended Video

Pushpa The Rise US Premieres Plans | Allu Arjun కెరీర్ లో ఫస్ట్ టైమ్..!! || Filmibeat Telugu

ఏడోవారంలో నామినేట్ అయిన వారు వీరే

తాజా సమాచారం ప్రకారం.. ఏడో వారం ఎలిమినేషన్ కోసం జరిగిన నామినేషన్ల ప్రక్రియ ఘాటుగా సాగింది. ఏడోవారం ఇంటి నుంచి బయటకు వెళ్లి పోవడానికి అర్హత ఉందని అంటూ కంటెస్టెంట్లు ఒకరినొకరు నామినేట్ చేశారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో అని మాస్టర్, కాజల్, ప్రియ, జెస్సీ, లోబో, సిరి హన్మంతు, యాంకర్ రవి, ప్రియాంక సింగ్, శ్రీరామచంద్ర ఉన్నారు. ఈ సారి టాప్ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ముప్పు ఎదుర్కొంటున్నారు. ఎవరు సేఫ్ అవుతారు? ఎవరు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతారు అనే విషయం చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X