Bigg Boss Telugu 8 week Elimination: టాప్‌ ఓటింగ్‌తో ముగ్గురు సేఫ్ జోన్‌లోకి.. డేంజర్‌ జోన్‌లో ఆ ఇద్దరు!

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఎనిమిదో వారం ఎమినేషన్‌ అత్యంత ఆసక్తిగా మారింది. ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియలో టాప్ సెలబ్రిటీలు, టైటిల్ రేసుకు పోటీ పడుతున్న వారు ఉండటంతో ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎనిమిదో వారం ఇంటిలో కెప్టెన్సీ టాస్క్ పోటీదారులు, కెప్టెన్సీ టాస్క్‌తో ముందుకు సాగుతున్నది. అయితే 8వ వారం ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఎవరికి ఎలిమినేషన్ ముప్పు ఉంది అనే విషయంలోకి వెళ్తే..

ప్రియ ఎలిమినేషన్‌పై అసంతృప్తి

ప్రియ ఎలిమినేషన్‌పై అసంతృప్తి

బిగ్‌బాస్ తెలుగు ఇంటి నుంచి ఏడో వారం ప్రియ ఎలిమినేట్ కావడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంటిలో కంటెంట్ ఇచ్చే ప్రియ ఎలిమినేట్ కావడంతో ప్రస్తుత వారం చాలా డల్‌గా, బోరింగ్‌గా మారింది. ప్రియ ఉండి ఉంటే వీజే సన్నీతో ఫన్ క్రియేట్ చేసే ఎపిసోడ్స్ ఉండేవనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఆకట్టుకొన్న శ్రీరామచంద్ర

ఆకట్టుకొన్న శ్రీరామచంద్ర

ప్రస్తుతం ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం ఏడుగురు నామినేట్ అయ్యారు. అందులో సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్, లోబో, మానస్, యాంకర్ రవి, శ్రీరామచంద్ర ఉన్నారు. జెస్సీ కోసం శ్రీరామచంద్ర స్వయంగా నామినేషన్‌లోకి రావడం అందర్నీ ఆకట్టుకొన్నది. జెస్సీని సేఫ్ చేయడానికి శ్రీరామచంద్ర తన లెటర్‌ను స్క్రాప్ చేసి నామినేషన్‌లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

 ఈ వారం కెప్టెన్ ఎలిమినేట్ అవుతాడా?

ఈ వారం కెప్టెన్ ఎలిమినేట్ అవుతాడా?


అయితే ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్సీ టాస్క్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేట్ అయిన వారందరూ కెప్టెన్సీ టాస్క్ పోటీదారులు కావడం గమనార్హం. కెప్టెన్సీ పోటీదారులు టాస్క్ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య కెప్టెన్‌గా ఎన్నికైన తర్వా తఎవరో ఒకరు ఎలిమినేట్ అయితే పరిస్థితి ఏమిటంటే.. ఆ రెండు రోజులు కెప్టెన్‌గా ఉంటాడు. కెప్టెన్‌ హోదాలోనే ఎలిమినేట్ అవుతారు అనే చర్చ కూడా ఇంటి సభ్యుల మధ్య వచ్చింది.

మూడు రోజుల ఓటింగ్‌‌లో షణ్ముఖ్, శ్రీరామ, మానస్

మూడు రోజుల ఓటింగ్‌‌లో షణ్ముఖ్, శ్రీరామ, మానస్

గత మూడు రోజులుగా నామినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్ల ఓట్ల వివరాలు ఆసక్తి కరంగా మారాయి. ఎప్పటి మాదిరిగానే ఓటింగ్ పరంగా షణ్ముఖ్ జస్వంత్ టాప్ స్థానంలో ఉన్నారు. షణ్ముఖ్ అత్యధికంగా 26 శాతం ఓట్లతో నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో శ్రీరామచంద్ర 19 శాతం, మానస్ 18 శాతం ఓట్లతో రెండు, మూడు స్థానంలో ఉన్నారు.

Recommended Video

KGF Chapter 2 Vs RRR : Rajamouli రంగంలోకి దిగితే Yash రికార్డ్ గల్లంతే!! || Filmibeat Telugu
ఆ ఇద్దరికి ఎలిమినేషన్ ముప్పు..

ఆ ఇద్దరికి ఎలిమినేషన్ ముప్పు..


ఇక నామినేషన్‌లో ఉన్న యాంకర్ రవి 15 శాతం ఓట్లుతో సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఇక అతి తక్కువ ఓట్లతో లోబో, సిరి హన్మంతు ఎలిమినేషన్ ముప్పును ఎదుర్కొంటున్నారు. లోబో 10 శాతం, సిరి హన్మంతు 10 శాతానికి అటు ఇటుగా ఉన్నారు. అయితే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ కావడం తథ్యం అనేది ఇప్పటి వరకు పోలైన ఓటింగ్ డేటా చెబుతున్నది. ఎప్పటి మాదిరిగానే మిస్డ్ కాల్ డేటా కీలకంగా మారనున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X