Bigg Boss Telugu 5 Week 8th nominations: నామినేషన్‌లో ఆరుగురు టాప్ కంటెస్టెంట్లు.. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో ఏడోవారం ఎలిమినేషన్ ముగిసిందో లేదో వెంటనే 8వ వారం ఎలిమినేషన్ కోసం రంగం సిద్ధమైంది. కొద్ది వారాలుగా తమ ఇంటిలో సభ్యుల తీరు తెన్నుల ఆధారంగా తోటి సభ్యులు నామినేషన్ ప్రక్రియలో కారణాలు చెబుతూ నామినేషన్ ప్రక్రియను మొదలు పెట్టారు. ఎనిమిదో వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న సభ్యులపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కంటెస్టెంట్లు నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. 8వ వారం నామినేషన్ ప్రక్రియలో ఎవరెవరూ ఉన్నారంటే..

ఏడోవారం ఎలిమినేషన్ ఉత్కంఠగా
ఏడోవారం ఎలిమినేషన్ ప్రక్రియను హోస్ట్ నాగార్జున ఉత్కంఠ భరితంగా, భావోద్వేగంగా మొదలుపెట్టారు. ఆటపాటలను కొనసాగిస్తూనే ఇంట్లో ఉండే వ్యక్తులను వారికి వచ్చిన ఓట్ల ఆధారంగా సేఫ్ చేశారు. చివర్లలో అని మాస్టర్, ప్రియ మిగిలి ఉండటంతో ఉత్కంఠగా మారింది. ఇద్దరు టైటిల్ పోరుకు అర్హత ఉన్నవారే అనే అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ పెరిగింది.

డబుల్ ఎలిమినేషన్ అనే అనుమానంతో
ఎలిమినేషన్ ప్రక్రియలో అని మాస్టర్, ప్రియను ఓ చెక్క బాక్సులోకి పంపించి హోస్ట్ నాగార్జున ఆ ప్రాసెస్‌ను ఆసక్తిగా మలిచారు. బాక్సులోకి వెళ్లిన ఒకరు ఎలిమినేట్ అవుతారు. మరొకరు సేఫ్ అవుతారు అని చెప్పారు. అయితే ఇద్దరు కూడా చెక్క బాక్సులో లేకపోవడంతో అందరూ కంగారు పడ్డారు. దాంతో ఓ దశలో డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా అనే అనుమానాన్ని క్రియేట్ చేశారు.

ప్రియ ఎలిమినేషన్‌తో
అయితే చివరకు అని మాస్టర్ కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు రావడంతో ప్రియ ఎలిమినేట్ అయినట్టు హెస్ట్ నాగార్జున ప్రకటించారు. దాంతో ప్రియ వేదికపైకి వచ్చి నాగ్‌తో జత కలిశారు. అలా ప్రియ ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో నామినేషన్ ప్రక్రియ ప్రతీ వారం జఠిలంగా మారింది. దాంతో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియపై అందరి దృష్టి పండింది.

గందరగోళం మధ్య ఆరుగురు నామినేషన్‌లో
ఇక ఎప్పటి మాదిరిగానే ఎనిమిదో వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ గందరగోళం మధ్య కొనసాగినట్టు సమాచారం. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ నామినేషన్ ప్రక్రియను హల్ చల్ చేశారు. ఈ సారి నామినేషన్ ప్రక్రియలో టాప్ కంటెస్టెంట్లు ఉండటంతో ప్రస్తుత వారం ఎలిమినేషన్ కూడా ఆసక్తిగా మారింది.

నామినేషన్ ప్రక్రియలో లెటర్ బాంబు
బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ ప్రక్రియను లెటర్స్‌ను ఆధారంగా చేసుకొని ప్రారంభించారు. కన్ఫెషన్ రూమ్‌లో ఉండే కంటెస్టెంట్లు.. ఎవరికైతే తమ తోటి కంటెస్టెంట్లకు లెటర్స్ ఇస్తారో వారు నామినేషన్ ప్రక్రియలో ఉండదు. ఎవరికైతే ఇవ్వరో వారు నామినేషన్ ప్రక్రియలో ఉంటారు అని బిగ్‌బాస్ నిబంధన చెప్పారు. అయితే కొందరు సభ్యులు తమ తోటి సభ్యులకు లెటర్స్ ఇవ్వడానికి నిరాకరిస్తూ.. వాటిని స్క్రాప్ చేయడం కనిపించింది.
Recommended Video

8వ వారం నామినేట్ అయింది వీరే
బిగ్‌బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి నామినేషన్‌లోకి ఆరుగురు ఇంటి సభ్యులు వచ్చారు. అందులో సిరి హన్మంతు, షణ్ముఖ్ జస్వంత్, శ్రీరామచంద్ర, మానస్, యాంకర్ రవి, లోబో ఉన్నారు. అయితే ఈ వారం ఇంటి సభ్యులకు సంబంధించి గట్టిపోటి ఉండే అవకాశం కనిపిస్తున్నది. అయితే ఎనిమిదో వారం ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోతారో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











