twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Telugu 9th week Elimination..తొమ్మిదో వారం స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్.. ఎవరూ ఊహించిని విధంగా!

    |

    తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ రెండు రాష్ట్రాల్లో భీభత్సమైన పాపులారిటీ తెచ్చుకుంది. ఇప్పటికే నాలుగు సీజన్స్‌ను పూర్తి చేసుకోగా ప్రస్తుతం ఐదవ సీజన్‌‌ విజయవంతంగా నడుస్తోంది. ఇప్పటి వరకు ఎనిమిది మంది ఎలిమినేట్ అయిపోయారు. ఇక ఈ వారం మరో కంటెస్టెంట్ ఎలిమినేటి కానున్నారు. ఇక ప్రతి వారం లాగానే ఈ వారం కూడా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ పేరు వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే

    Photo Courtesy: Star మా and Disney+Hotstar

    ఎనిమిది మంది ఎలిమినేట్

    ఎనిమిది మంది ఎలిమినేట్

    బిగ్ బాస్ మొదటి సీజన్‌ను ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండవ సీజన్‌ను నాని హోస్ట్ చేశారు. మూడు నాలుగు సీజన్స్‌ను హోస్ట్ చేసిన అక్కినేని నాగార్జున ఈ ఐదవ సీజన్‌ను కూడా హోస్ట్ చేస్తున్నారు.. ఇప్పటి వరకు ఎనిమిది వారాలు పూర్తి కాగా ఎనిమిది మంది ఎలిమినేట్ అయిపోయారు. మొదటి వారం సరయు.. రెండో వారం ఉమాదేవి.. మూడో వారం లహరి.. నాలుగో వారం నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఐదవ వారం హమీదా ఎలిమినేట్ అయ్యారు.

    ఎనిమిది మంది నామినేషన్స్ లో

    ఎనిమిది మంది నామినేషన్స్ లో

    ఇక ఆరవ వారంలో శ్వేతా వర్మ ఏడవ వారంలో ప్రియా, ఇక ఎనిమిదవ వారంలో లోబో ఎలిమినేట్ అయ్యారు. దీంతో ప్రస్తుతం ఇంట్లో 11 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. ఇక ఎప్పటి లాగే ఈ వారాంతంలో బిగ్ బాస్ తెలుగు 5 హౌస్ నుంచి ఎలిమినేట్ కావడానికి మరో కంటెస్టెంట్ సిద్ధంగా ఉన్నాడు. తొమ్మిదో వారం ఎలిమినేషన్‌కు నామినేట్ చేయబడిన కంటెస్టెంట్లు శ్రీరామ చంద్ర, సన్నీ, కాజల్, ప్రియాంక, సిరి, జస్వంత్, విశ్వ అలాగే రవి.

    పోల్స్ ప్రకారం

    పోల్స్ ప్రకారం

    ఇక అనధికారిక ఓటింగ్ పోల్స్ ప్రకారం ఆర్జే కాజల్, విశ్వ డేంజర్ జోన్‌లో ఉన్నారు. అయితే ముందు నుంచి కూడా ఆర్జే కాజల్ ఈ వారం ఎగ్జిట్ పాస్ పొందవచ్చని ప్రచారం జరుగుతోంది. కానీ నెటిజన్లు మాత్రం కాజల్‌కు బదులు ప్రియాంకను ఇంటి నుంచి ఎలిమినేట్ చేయాలని సోషల్ మీడియాలో 'స్టార్ మా'ని ట్యాగ్ చేసి మరీ కోరుతున్నారు.

    ప్రియాంకను టార్గెట్ చేసి

    ప్రియాంకను టార్గెట్ చేసి

    ప్రియాంక ఇంట్లో ఏమీ చేయడం లేదని, ఆమె ఎప్పుడూ మానస్ వెనుకే ఉంటుందని అంటున్నారు. అలా కారణం లేకుండానే ప్రియాంకపై ఓ వర్గం ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుస్తోంది. అయితే ప్రియాంక మాత్రం తన బెస్ట్ ఇస్తూ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అలాగే స్టార్ మా ఆర్జే కాజల్‌కు బదులు జెస్సీ లేదా విశ్వను ఎలిమినేట్ చేయడం పై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

    Recommended Video

    Manchi Rojulochaie Movie Team Theatre Visit | Blockbuster Celebrations
    ఈ వారం ఎవరంటే?

    ఈ వారం ఎవరంటే?

    అయితే ఈ వారం విశ్వ ఎలిమినేట్ అయినట్టు చెబుతున్నారు. ఈమేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. మరో పక్క ఈసారి 19 మందిని లోపలికి పంపడంతో లెక్కల ప్రకారం ఈ వారం డబల్ ఎలిమినేషన్ అంటున్నారు. ఈ డబుల్ ఎలిమినేషన్‌ చేయాల్సి వస్తే అందులో భాగంగా విశ్వతో పాటు ప్రియాంక లేదా కాజల్ ఈ వారం ఎలిమినేట్ అవ్వనున్నారని అంటున్నారు. ఇక మరోవైపు ఇప్పటికే షో సగం దాటడంతో వైల్డ్ కార్డ్ ఇక ఉండబోదు.

    English summary
    Bigg Boss Telugu 5 week 8 elimination on cards. Filmibeat conducted online Survey on Bigg Boss Telugu 5 week 8 elimination: Majority viewers said that Lobo may expressed eviction threat.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X