Bigg Boss Telugu 5 Week 9th Nominations: బిగ్‌బాస్ తెలుగు చరిత్రలోనే తొలిసారి.. ఎవరెవరు నామినేట్ అయ్యారంటే?
బిగ్‌బాస్ తెలుగు 5 రియాలిటీ షోలో 9వ వారానికి ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఇంతకు ముందెన్నుడూ లేని విధంగా నామినేషన్ ప్రక్రియ జరిగింది. ఎప్పటి మాదిరిగానే ఇంటి సభ్యుల మధ్య అవేశకావేశాలు చోటుచేసుకొన్నాయి. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు వాగ్బాణాలు సంధించుకొన్నారు. 9వ వారం ఎవరు నామినేట్ అయ్యారనే విషయంలోకి వెళితే...

బిగ్‌బాస్ తెలుగు 5 దీపావళీ వేడుక
ఎనిమిదో వారాంతం దీపావళీ వేడుకలతో ఇళ్లంతా పండుగ వాతావరణం నెలకొన్నది. ఇంటిలోకి యాంకర్ సుమ, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు ముక్కు అవినాష్, బాబా భాస్కర్, అరియానా గ్లోరి, సయ్యద్ సోహైల్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, శ్రీయా సరన్ ఇంటిలో సందడి చేశారు.

ఎనిమిదో వారం ఎలిమినేషన్
దీపావళీ వేడుకల్లో భాగంగా ఆటపాటలతో ఇంటి సభ్యులను ఆలరిస్తూనే హోస్ట్ నాగార్జున ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఎనిమిదో వారం ఇంటి నుంచి ఎంటర్‌టైనర్ ఆఫ్ ది హౌస్ లోబో ఎలిమినేట్ అయ్యారు. ఇంటి సభ్యుల ఎమోషన్స్ మధ్య లోబో బిగ్‌బాస్ హౌస్ నుంచి నిష్క్రమించారు.

తొమ్మిదో వారం నామినేషన్ ప్రక్రియ
ఇక ఎప్పటిలానే ఆదివారం రాత్రి బిగ్‌బాస్ ఇంటిలో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. తొమ్మిదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. ఇంటిలో నామినేషన్ ప్రక్రియ సందర్భంగా మానస్, శ్రీరామచంద్రకు వీజే సన్నీ, సిరి హన్మంతుకు భారీగా గొడవలు చోటుచేసుకొన్నారు.

శ్రీరామచంద్రను ఉద్దేశించి మానస్
నామినేషన్ ప్రక్రియ సందర్భంగా శ్రీరామచంద్రను ఉద్దేశించి మానస్ మాట్లాడుతూ.. ప్రతీ వారం ఎవరో ఒకరు ఇంటి నుంచి వెళ్లిపోతారు. కాబట్టి నీవు ఇంటి నుంచి వెళ్లిపోయినా ఫరక్ పడదు అని అంటే.. నీవు ఉన్నా ఇంటిలో ఏ మాత్రం ఫరక్ ఉండదు అంటూ శ్రీరామచంద్ర ఘాటుగా స్పందించారు.

వీజే సన్నీ వర్సెస్ సిరి హన్మంతు
ఇక సిరి హన్మంతు, వీజే సన్ని మధ్య ఘాటుగా వాగ్వాదం జరిగింది. ఇంటిలో జరిగే గేమ్స్ సమయంలో ఎవరైనా, ఎంతైనా అనుకోవచ్చు. కానీ హెల్త్ విషయాన్ని పాయింట్ అవుట్ చేయడం నాకు చాలా బాధగా ఉంది. నీ నుంచి అలాంటి మాటలు రావడం చాలా బ్యాడ్ వైబ్స్ వచ్చాయి. అందుకే నామినేషన్ చేస్తున్నాను అని సిరి హన్మంతు పేర్కొన్నారు.

మానస్‌తో యాంకర్ రవి వాగ్వాదం
ఇక మానస్‌తో సింగర్ శ్రీరామచంద్ర, యాంకర్ రవి గట్టిగానే గొడవ పడ్డారు. మానస్ కోసం సన్నీ మధ్యలో దూరడంతో వాగ్వాదం మరింత పెరిగింది. మీరు ఎవరు మానస్‌కు సపోర్ట్ చేయడానికి అని శ్రీరామచంద్ర అంటే.. నా ఫ్రెండ్. నీకు అల్లుడు అంటూ ఘాటుగా వీజే సన్నీ జవాబు ఇచ్చాడు.

9వ వారంలో నామినేషన్స్
ఇదిలా ఉండగా, బిగ్‌బాస్ తెలుగు 5 షోలో 9వ వారంలో కెప్టెన్ షన్ముఖ్ జస్వంత తప్ప మిగితా వారందరూ నామినేట్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో ఇలా ఇంటి సభ్యులందరూ నామినేట్ కావడం అరుదైన సంఘటన గా పేర్కొంటున్నారు. అయితే ఈ వారం ఇంటి సభ్యులందరూ నామినేట్ కావడంతో ఎవరు ఇంటి నుంచి వెళ్లిపోతారనే విషయం ఆసక్తిగా మారింది.
Recommended Video
నామినేట్ అయింది వీరే..
బిగ్‌బాస్ తెలుగు 9వ వారంలో అనీ మాస్టర్, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, విశ్వ, మానస్, ప్రియాంక, యాంకర్ రవి, సిరి హన్మంతు, శ్రీరామచంద్ర, వీజే సన్నీ నామినేట్ అయ్యారు. కెప్టెన్ కావడంతో షణ్ముఖ్ జస్వంత్ నామినేషన్ నుంచి సేఫ్ అయ్యారు. రానున్న రోజుల్లో ఎవరికి ఎంత ఓటింగ్ అవుతుందనే విషయాన్ని పరిశీలిద్దాం.


Click it and Unblock the Notifications











