Bigg Boss Week 9th Nominations ప్రియాంక చేసిన పనికి షాక్. యాంకర్ రవిని ఆర్జే కాజల్ టార్గెట్ చేస్తూ..

బిగ్‌బాస్‌ తెలుగు 5 రియాలిటీ షోలో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఇంట్లో రచ్చ జరిగింది. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకొంటూ దుమ్మెత్తి పోసుకొన్నారు. కంటెస్టెంట్ల మధ్య భారీగా మాటల యుద్ధమే జరిగింది. ఇక నామినేషన్ల ప్రక్రియ మధ్య ఎవరెవరూ ఏం అన్నారు? 9వ వారానికి ఎవరు నామినేట్ అయ్యారు అనే విషయాల్లోకి వెళితే..

Photo Courtesy: Star మా and Disney+Hotstar

మీ ఇంటి పేరు పొగరా అంటూ శ్రీరామచంద్ర

మీ ఇంటి పేరు పొగరా అంటూ శ్రీరామచంద్ర

నామినేషన్ ప్రక్రియను ప్రారంభించడానికి ముందు బిగ్‌బాస్ మాట్లాడుతూ.. ఇంటి సభ్యులు ఎలాంటి ముసుగు లేకుండా నామినేషన్ చేసుకొనే రోజు వచ్చింది అని చెప్పారు. దాంతో నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఆర్జే కాజల్ చేతిలో ఓ ప్లేట్‌లో తెల్లని నురుగు లాంటి వస్తువును తీసుకొని వచ్చి నామినేషన్ ప్రక్రియలోకి దిగింది. కాజల్‌కు శ్రీరామ చంద్ర కౌంటర్ ఇస్తూ .. మీ ఇంటి పేరు పొగరా? నీవు పొగరుబోతువా అంటే.. నీవు ఇచ్చిన రియాక్షన్ నాకు నచ్చలేదు అంటే.. నాగుపాములు పోట్లాడినట్టు సైగ చేస్తూ సింగర్ శ్రీరామ చంద్ర కనిపించారు.

నన్ను ఇంటి నుంచి పంపించి..

నన్ను ఇంటి నుంచి పంపించి..

ఇక యాంకర్ రవిని ప్రియాంక సింగ్ నామినేట్ చేస్తూ.. ఆలోచించే విషయానికి వస్తే.. రవి అన్న కంటే ఎవరు గొప్పగా ఆలోచించలేరు అంటూ నామినేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది. బాగా ఆలోచిస్తున్నాననే కారణంతో నన్ను ఇంటి నుంచి బయటకు పంపించాలని అనుకొంటున్నావు అని రవి అంటే అవును అని ప్రియాంక సమాధానం చెప్పింది. అయితే ఫైనల్‌లో నువ్వు నేను ఉంటే.. నీవు గెలువలేవనే విషయం నీకు కచ్చితంగా తెలుసు అని రవి అన్నాడు. అందుకు సమాధానం ఇస్తూ.. అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తునాను అని పింకి చెప్పారు.

 నేను వీక్ కంటెస్టెంట్‌ను కాదు అంటూ విశ్వ

నేను వీక్ కంటెస్టెంట్‌ను కాదు అంటూ విశ్వ

ఇక ప్రియాంకను యాంకర్ రవి నామినేట్ చేస్తూ.. ఇంట్లో వీక్ కంటెస్టెంట్లు ఇంట్లో ఉండటానికి అర్హత లేదు అంటే.. నేను వీక్ అనే పదం ఉపయోగించలేదు. ఆ పదాన్ని నీవు చెప్పకు అని ప్రియాంక కౌంటర్ ఇచ్చింది. దాంతో విశ్వ ఆమె ముఖానికి ఫోమ్ పూసి నామినేట్ చేశాడు.

నిన్ను ఎదగకుండా ఆపడం ఎవరితరం కాదు..

నిన్ను ఎదగకుండా ఆపడం ఎవరితరం కాదు..

అలాగే యాంకర్ రవి, ఆర్జే కాజల్ మధ్య భారీగానే గొడవ జరిగింది. నిన్ను ఎదగకుండా ఆపాలని నేను ప్రయత్నం చేయడం లేదు. నువ్వు ఎదగకుండా ఆపాలని కూడా ఈ ఇంటిలో ఎవరు ట్రై చేయడం లేరు అంటూ ఆర్జే కాజల్ అంటే.. ఎవరో గురించి ఎందుకు మాట్లాడుతావు అంటే.. నీ మీద నాకు అలాంటి గౌరవం, అంచనాలు ఉన్నాయి అంటూ ఆర్జే కాజల్ సమాధానం చెప్పింది. దాంతో ఇక మాటలు ఆపి ముఖానికి ఫోమ్ రాసేయ్ అంటూ సైగ చేశారు.

ప్రియాంక నీవు.. మరొకరి గేమ్ ఆడకు

ప్రియాంక నీవు.. మరొకరి గేమ్ ఆడకు

ప్రియాంక సింగ్‌ను షణ్ముఖ్ జస్వంత్ నామినేట్ చేస్తూ.. నీవు నీ గేమ్ ఆడు. మరొకరి గేమ్ నువ్వు ఆడకు అంటూ కామెంట్ చేశాడు. మీరు అనేసి నామినేట్ చేసి బయటకు పంపిస్తే.. నేను గేమ్ ఇంకా ఎవరు ఆడుతారు. మీరే ఆడండి గేమ్ అంటూ ప్రియాంక ఆవేదన వ్యక్తం చేసింది. అంతలోనే షణ్ముఖ్ వచ్చి ముఖానికి ఫోమ్ పూయడానికి ప్రయత్నిస్తే.. దానిని తీసుకొని గట్టిగా కొట్టేసుకొన్నది. ఆ సంఘటన చూసి ఇంటిలోని సభ్యులు షాక్ గురయ్యారు.

Recommended Video

Comedian Sudarshan About Manchi Rojulochaie | Santosh Shobhan | Part 03
9వ వారంలో నామినేట్ అయింది వీరే..

9వ వారంలో నామినేట్ అయింది వీరే..

ఇదిలా ఉండగా, 9వ వారం నామినేషన్ సందర్భంగా కెప్టెన్ షణ్ముఖ్ మినహాయించి బిగ్‌బాస్ ఇంటిలోని అందరూ నామినేట్ అయ్యారు. అనీ మాస్టర్, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, విశ్వ, మానస్, ప్రియాంక, యాంకర్ రవి, సిరి హన్మంతు, శ్రీరామచంద్ర, వీజే సన్నీ నామినేట్ అయ్యారు. దాంతో ఈ వారం ఎలిమినేషన్, ఓటింగ్ ప్రక్రియ రసకందాయంలో పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X