Bigg Boss Winner: సన్నీ గెలుపుపై సరయు సంచలన పోస్ట్.. ఆ కంటెస్టెంట్‌కు అన్యాయం చేశారంటూ!
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత ఎంతో మంది లోకల్ అమ్మాయిలు తెలుగు రాష్ట్రాల్లో విశేషమైన గుర్తింపును అందుకున్నారు. అందులో చాలా మంది మంచి పేరును సంపాదించుకోగా.. కొందరు మాత్రం వైవిధ్యమైన వ్యవహార శైలితో నెగెటివ్‌గా ఫేమస్ అయ్యారు. అలాంటి వారిలో ప్రముఖ యూట్యూబర్ సరయు రాయ్ ఒకరు. సెవెన్ ఆర్ట్స్ అనే చానెల్ ద్వారా నెటిజన్లకు పరిచయమైన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే భారీ స్థాయిలో పాపులర్ అయింది. దీనికి కారణం ఆమె బోల్డు వీడియోలు చేస్తుండడమే. చాలా కాలంగా సందడి చేస్తోన్న సరయు.. బిగ్ బాస్ ఐదో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చి, మొదటి వారమే ఎలిమినేట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా సరయు బిగ్ బాస్ విన్నర్ సన్నీపై సంచలన పోస్ట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

అలాంటి వీడియోలతో ఫుల్ ఫేమస్
యూట్యూబ్‌లో సరయు రాయ్ సెవెన్ ఆర్ట్స్ అనే ఛానెల్‌లో పని చేస్తుంది. ఇందులో ఎన్నో సున్నితమైన అంశాలను టచ్ చేస్తూ భారీ సంఖ్యలో వీడియోలు చేసింది. అన్నింటిలోనూ అడల్ట్ కంటెంటే ఉంటుంది. అంతలా ఈ బ్యూటీ పచ్చి బూతులు మాట్లాడుతూ రచ్చ చేస్తోంది. అందుకే ఆమె చేసే వీడియోలు అన్నింటికీ నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోంది. దీంతో అవన్నీ తక్కువ సమయంలోనే వైరల్ అవుతుంటాయి. తద్వారా సరయు రాయ్‌కు సైతం తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫాలోయింగ్ దక్కింది. దీంతో ఆమె ఫుల్ ఫేమస్ అయిపోతోంది.

వివాదాలతో వార్తల్లో... తగ్గని బ్యూటీ
సరయు రాయ్ అండ్ టీమ్ సెవెన్ ఆర్ట్స్ ఛానెల్ ద్వారా చేసే వీడియోలు వివాదాస్పదం అవుతుంటాయి. మరీ ముఖ్యంగా అప్పట్లో సీత అనే పేరుతో చేసిన ఓ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో అప్పట్లో ఇది పెద్ద రచ్చ అయిపోయింది. ఆ తర్వాత అలాంటివే చాలా వీడియోలపై పెద్ద ఎత్తున చర్చలు కూడా జరిగాయి. అయినప్పటికీ ఆమె మాత్రం అస్సలు తగ్గడం లేదు. ఈ క్రమంలోనే మరిన్ని వీడియోలను చేస్తూ రెచ్చిపోయింది. దీంతో ఈ బ్యూటీ తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. అదే సమయంలో చాలా మంది ఫాలోవర్లను కూడా పెంచుకుంటోంది.

బిగ్ బాస్ ఎంట్రీ.. భారీ అంచనాలు
ఎన్నో అంచనాలతో వచ్చిన బిగ్ బాస్ ఐదో సీజన్‌లో ఒకేసారి 19 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇందులో చాలా మంది ప్రేక్షకులకు సుపరిచితులు అయిన వారే ఉన్నారు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో హవాను చూపిస్తోన్న పలువురు సెలెబ్రిటీలు సైతం అడుగు పెట్టారు. అలాంటి వారిలో బోల్డు బ్యూటీ సరయు ఒకరు. యూట్యూబ్‌లో అడల్ట్ కామెడీతో వీడియోలు రూపొందించే ఈ బ్యూటీ.. బూతులతో రచ్చ రచ్చ చేస్తుంటుంది. అందుకే బిగ్ బాస్ ఐదో సీజన్‌లో కూడా అలాగే వ్యవహరిస్తుందని ఆమెపై భారీ అంచనాలు పెట్టుకున్న విషయం తెలిసిందే.

వారంలోనే ఆమెకు షాకిచ్చేశారుగా
ఐదో సీజన్‌లోకి ఎన్నో అంచనాల నడుమ అడుగు పెట్టింది సరయు రాయ్. బయట ఉన్న ఫాలోయింగ్ నేపథ్యంలో ఆమె చాలా కాలం పాటు హౌస్‌లో కొనసాగుతుందని అంతా అనుకున్నారు. కానీ, మొదటి వారమే కంటెస్టెంట్లు ఆమెను టార్గెట్ చేసి నామినేట్ చేసేశారు. దీంతో మిగిలిన వాళ్ల కంటే తక్కువ ఓట్లు పోలవడంతో ఎవరూ ఊహించని విధంగా సరయు రాయ్ ఆరంభ వారంలోనే షో నుంచి బయటకు వచ్చేసింది. ఆమె ఎలిమినేషన్ వల్ల చాలా మంది నిరాశకు లోనయ్యారు. అదే సమయంలో ఆమె ఎలిమినేషన్‌పై అనుమానాలు సైతం వ్యక్తం అయ్యాయి.

అందులో యమ యాక్టివ్‌గా ఉంటూ
సోషల్ మీడియాలో సరయు రాయ్ ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. దీని ద్వారానే ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లో ఉండే ఈ బ్యూటీ.. తన పర్సనల్ లైఫ్‌తో పాటు ప్రొఫెషనల్ కెరీర్‌కు సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అదే సమయంలో తన ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. ఇందులో ఎక్కువగా అందాల విందు చేస్తూ తీసుకున్నవే ఎక్కువగా ఉండేవి. ఇక, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత సరయు రాయ్ సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ అయింది. దీంతో వరుస పోస్టులతో హల్‌చల్ చేస్తోంది.

ఆ కంటెస్టెంట్లకు సపోర్టు చేసింది
బిగ్ బాస్ మొదటి వారమే ఎలిమినేట్ అయిన సరయు రాయ్.. స్టేజ్‌పై ఉన్న సమయంలోనే కొందరిపై విమర్శలు చేసింది. మరీ ముఖ్యంగా బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియా వేదికగా షణ్ముఖ్ జస్వంత్ ఫ్యాన్స్‌తో పెద్ద యుద్ధమే చేసింది. అలాగే, సిరి హన్మంత్‌పై కూడా షాకింగ్ కామెంట్స్ చేసింది. అదే సమయంలో విశ్వ, యాంకర్ రవి, శ్రీరామ చంద్రలకు మాత్రం బాగా సపోర్ట్ చేసింది. ఈ క్రమంలోనే వాళ్లకు ఓట్లు వేసి ఎలిమినేషన్ నుంచి తప్పించాలని కోరింది. అలాగే, ఫినాలేకు చేరుకున్న శ్రీరామ్‌కు సైతం భారీగానే ఓట్లు పోలయ్యేలా చేసిందని చెప్పుకోవచ్చు.

సన్నీ గెలుపుపై సంచలన పోస్ట్ చేసి
ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఐదో సీజన్ గత ఆదివారం ముగిసిన విషయం తెలిసిందే. ఇందులో వీజే సన్నీ విజయం సాధించాడు. దీంతో అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సరయు రాయ్.. ఈ సీజన్ రిజల్ట్‌పై స్పందించింది. ఈ మేరకు ఓ నెటిజన్ చేసిన పోస్టును తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో 'బంగారం కోసం వెతుకుతూ.. డైమండ్‌ను కోల్పోయాం' అని ఉంది. అంటే సన్నీ కోసం శ్రీరామ్‌ను ఓడించాము అని అర్థం వచ్చేలా ఉంది. ఇక, సరయు రాయ్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం తెగ హాట్ టాపిక్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











